Nara Lokesh Yuvagalam

తంబళ్లపల్లిలో యువనేతకు అపూర్వ స్వాగతం రోడ్లవెంట బారులు తీరిన జనం లోకేష్ ను కలిసి బాధలు పెట్టిన మహిళలు, వృద్ధులు తెల్లవారుజామున క్యాంపుపైకి ఎమ్మార్వోను పంపిన పెద్దిరెడ్డి క్యాంపు ఖాళీచేయాలని నోటీసులు జారీచేసిన ఆర్డీఓ చట్టాన్ని గౌరవిస్తూ హైదరాబాద్ పయనమైన యువనేత

తంబళ్లపల్లె: అరాచక పాలన అంతమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 41వరోజు తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలో కొనసాగింది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం నందిరెడ్డివారిపల్లి విడిది కేంద్రం నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. దారిపొడవునా జనం నీరాజనాలు పట్టారు. పుంగనూరు, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాల్లో పాదయాత్రకు లభించిన అనూహ్య స్పందనతో కళ్లు బైర్లుకమ్మిన పాపాల పెద్దిరెడ్డి అండ్ కో యువగళాన్ని అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. తాజాగా శనివారం తెల్లవారుజామున 4గంటలకు స్థానిక ఎమ్మార్వో పోలీసులను వెంటబెట్టుకొని యువనేత బసచేసిన నందిరెడ్డివారిపల్లి విడిది కేంద్రం వద్దకు వచ్చారు. విడిది చేసిన స్థలం వివాదాల్లో ఉందని, వెంటనే ఖాళీచేయాలంటూ వత్తిడితెచ్చారు. అయితే అప్పటికే అప్రమత్తమైన స్థానిక నేతలు స్థల యజమానికి అనుకూలంగా ఇచ్చిన కోర్టు ఉత్తర్వుల కాపీని చూపారు. అయినప్పటికీ వివాదంలో ఉందని అధికారులు వితండవాదం చేయగా, అనవసరంగా గొడవలు వద్దని, మరికొద్దిగంటల్లో పాదయాత్ర మొదలయ్యాక ఎవరూ ఇక్కడ ఉండరని నాయకులు చెప్పడంతో ఎమ్మార్వో వెనక్కితగ్గారు.

క్యాంపు ఖాళీచేయాలని ఆర్డీఓ నోటీసులు

అయినా అధికారుల పై ఆగని ఒత్తిళ్లు. క్యాంప్ సైట్ లో ఉండగానే అధికారులకి పెద్దిరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఫోన్ చేసి బెదిరింపులు.ఏం పీకుతున్నారు అంటూ అధికారులను దుర్బాషలాడుతూ లోకేష్ పాదయాత్ర ని అడ్డుకోవాలని హుకుం జారీచేశారు. తొలుత 11,12,13 తేదీల్లో జిల్లాలో ఉండేందుకు అన్ని అనుమతులు ఇచ్చి ఎమ్మెల్యే వత్తిడికి తలొగ్గి ఎన్నికల కోడ్ కారణంగా క్యాంప్ సైట్ ఖాళీచేయాలని లోకేష్ కు ఆర్డీఓ నోటీసులు జారీచేశారు. యువనేత లోకేష్ మదనపల్లి సభలో ఎవరేం చేశారో చర్చకు రావాలని సవాల్ చేయడంతో  పాపాల పెద్దిరెడ్డి క్యాంప్ లో అలజడి మొదలైంది.

చట్టాన్ని గౌరవించి హైదరాబాద్ కు పయనం

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో యువనేత లోకేష్ క్యాంప్ సైట్ ఖాళీ చేయాలని ఆర్డీఓ శనివారం మధ్యాహ్నం నోటీసులు ఇచ్చారు. ఆర్డీఓ నోటీసులు ఇచ్చిన తర్వాత తాను కంటేవారిపల్లి క్యాంప్ సైట్ లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని యువనేత లోకేష్ ఎన్నికల కమిషన్ కు విజ్జప్తిచేశారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గం వీడాలని, మీరు పంపిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమాధానమిచ్చారు. అక్కడి నుంచి వచ్చిన సమాధానం మళ్లీ కమ్యునికేట్ చేస్తామని సమాచారం పంపారు. ఎన్నికల సంఘాన్ని, చట్టాలను గౌరవిస్తూ యువనేత లోకేష్ కంటేవారి పల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

యువనేతను కలసిన మహిళలు, వృద్ధులు!

తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు గ్రామంలో యువనేత నారా లోకేష్ కి టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు ప్రజలు భారీఎత్తున రోడ్లపైకి వచ్చారు. అంగళ్లు గ్రామంలోని యువత, మహిళలు, వృద్దులు యువనేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ కట్ చేశారంటూ పలువురు వృద్దులు వాపోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక బెంగుళూరు వలస వెళ్లామని అంగళ్లు యువత యువనేతకు తెలిపారు. లోకేష్ స్పందిస్తూ… జగన్ పాలనలో అందరూ బాధితులేనన్నారు. జగన్ పెట్రోల్, డీజిల్ పై వేస్తున్న అసాధారణ పన్నుల వలనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. టిడిపి అధికారలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. జగన్ అడ్డగోలుగా పెంచిన అన్ని పన్నులు తగ్గిస్తాం. పేద వాడిపై పన్నుల భారం తగ్గిస్తాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 6లక్షల పెన్షన్లు కట్ చేసింది. ఆఖరికి చెత్త పన్ను కూడా పెన్షన్ లో కట్ చేసే దారుణమైన సర్కారు జగన్ ప్రభుత్వం. TDP ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హులైన అందరికీ పెన్షన్లు ఇచ్చి తీరుతాం. జగన్ దెబ్బకి రాష్ట్రంలో కంపెనీ లు అన్ని బై బై ఏపి అన్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహిస్తాం.

యువనేత ఎదుట వ్యక్తమైన అభిప్రాయాలు:

భూములు కోల్పోయాం…. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పించండి-ముదివేడు రిజర్వాయర్ నిర్వాసిత రైతుల విన్నపం

ముదివేడు రిజర్వాయర్ కారణంగా శితివారిపల్లి, కొత్తపల్లికి చెందిన 300 కుటుంబాల వారం భూములు కోల్పోయాం. మాకు చెందిన 1020 ఎకరాల విస్తీర్ణం గల సాగుభూమికి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పనులు చేస్తోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ సమస్యలే. భూమిలేని పేదలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలి. ముంపునకు గురవుతున్న ఒక్కో ఎకరాకు భూసేకరణ చట్టం ప్రకారం రూ.40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలి. ఇవేమీ ఇవ్వకుండా మా భూములు లాక్కోవడం అన్యాయం. మేము ఎలా బతకాలి? టిడిపి అధికారంలోకి వచ్చాక నిర్వాసితులను ఆదుకోండి.

సీఎఫ్సీ ఏర్పాటు చేస్తే మా ఇబ్బందులు పోతాయి- ఏ.బాలాజీ, కంటెవారిపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గం

గత ప్రభుత్వంలో అంగళ్లలో సీఎఫ్సీ ఏర్పాటు చేయడం వల్ల 30 కుటుంబాలు అక్కడే ఉంటూ..కుమ్మర వృత్తిని కొనసాగిస్తున్నాయి. దీంతో వారికి ఆర్థిక భారం చాలా తగ్గింది. కంటెవారిపల్లిలో కూడా సీఎఫ్సీ ఏర్పాటు చేస్తే అందరం ఒకే చోట పని చేసుకుంటాం. దీనివల్ల మార్కెంటింగ్ సౌకర్యం మెరుగుపడుతుంది. 30 ఏళ్ల నుండి ఈ వృత్తిలో ఉంటున్నా..ఆర్థికంగా బలపడలేకపోయాం. ప్రస్తుత ప్రభుత్వంలో శాలివాహన కార్పొరేషన్ ద్వారా ఒక్క రుణం కూడా మంజూరు కాలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఆదుకోండి.

అభిమాన నాయకున్ని చూసేందుకు కదిరి నుండి వచ్చా-ఊసన్న, కదిరి, శ్రీసత్యసాయి జిల్లా.     

ఎనిమిదేళ్ల క్రితం నాకు పక్షవాత లక్షణాలు వచ్చాయి. అప్పుడు సాయం కోసం నారా లోకేష్ ను కలిసిన వెంటనే రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. దీంతో నేను వైద్యం చేయించుకున్నా. తర్వాత వెళ్లి కలుద్దామంటే పొలం పనులు, ఆరోగ్య సమస్యల నిమిత్తం వెళ్లలేకపోయా. కానీ ఇప్పుడు అంగళ్లు వస్తున్నారని తెలుసుకుని చూద్దామని వచ్చా. ఆనాడు లోకేష్ సాయం చేయకపోతే నేను మంచానికే పరిమితం అయ్యేవాణ్ణి.

లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించిన కురుబ సామాజికవర్గీయులు

తంబళ్లపల్లి నియోజకవర్గం నందిరెడ్డివారిపల్లి విశ్వం కాలేజి వద్ద కురుబ సామాజికవర్గీయులు లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. రాయలసీమ జిల్లాల్లో కురుబలు ఎక్కువగా గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రకృతివైపరీత్యాల వల్ల ప్రమాదవశాత్తు గొర్రెల కాపర్లు, గొర్రెలు మరణిస్తే ఎటువంటి సాయం అందడం లేదు. గొర్రెల కాపరులు, గొర్రెలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలి. అధునాతన పద్ధతులో గొర్రెల పెంపకానికి అవసరమైన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పాటుచేయాలి. గొర్రెలు మేపుకోవడానికి బీడు భూములు కేటాయించాలి. కురుబలకు ప్రత్యేక పూజావిధానం, దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను అభివృద్ధి చేసి నిత్యపూజ, కైంకర్యాలు చేసే అర్చకులకు గౌరవవేతనం కల్పించాలి. గొరవయ్యలు, ఉన్ని కమ్మిళ్లనేత వారికి పెన్షన్లు మంజూరు చేయాలి. కురుబ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి వ్యవసాయం, విద్య, విదేశీవిద్య, వ్యాపారాలు, కుటీర పరిశ్రమలస్థాపనకు ఆర్థిక సాయం అందించాలి. కురుబ కులంలో సంచారజాతి అయిన కురువలకు (మాదాసు, మాదారి) ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. కురుబ కుల ఆరాధ్యదైవమైన కనకదాసు విగ్రహాలు, భవనాలను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటుచేయాలి. కనకదాసు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.

*నారా లోకేష్ స్పందిస్తూ….*

కురుబల కోసం తొలుత కురుబ కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి సంక్షేమానికి కృషిచేసింది టిడిపి మాత్రమే. కురుబ సామాజికవర్గానికి చెందిన ఎస్ రామచంద్రారెడ్డి, బికె పార్థసారధి, బత్తిన వెంకటరాముడుకి ఎమ్మెల్యేగా, ఎంపిగా, జడ్ పి చైర్మన్ గా అవకాశం కల్పించాం. రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చాక గొర్రెల మేపుకు బీడు భూములు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తాం. కురుబల ఆరాధ్య దైవం కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం. కురుబ భవనాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తాం. రాబోయే ఎన్నికల్లో టిడిపిని గెలిపించి చంద్రన్నను సిఎం చేసేందుకు సహకారం అందించండి.

లోకేష్ ను కలసి సమస్యలు చెప్పుకున్న శాలివాహన సంఘం ప్రతినిధులు

తంబళ్లపల్లి నియోజకవర్గం కంటేవారపల్లిలో కుండలు, టెర్రాకోట బొమ్మలు తయారుచేసే శాలివాహనులు యువనేత నారా లోకేష్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. కులవృత్తి అయిన కుండలు, బొమ్మలు తయారుచేస్తూ చాలీచాలని సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి ఆదరణా లేదు. కుమ్మర కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి. టెక్నాలజీతో కూడిన పనిముట్లను సబ్సిడీపై అందించి ఆదుకోవాలి. మాకు ఇళ్లు మంజూరు చేయాలి. కంటెవారిపల్లెలోనూ సీఎఫ్సీ బిల్డింగ్, సేల్ కాంప్లెక్స్ నిర్మించాలని కోరారు.

*నారా లోకేష్ మాట్లాడుతూ…*

శాలివాహన సామాజికవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆదరణ ద్వారా గతంలో వేలాది రూపాయల విలువ చేసే పనిముట్లు అందించాం. టీడీపీ హయాంలో అంగళ్లలో సీఎఫ్సీ భవనం నిర్మించాం. దీంతో వారంతా ఒకేచోట ఉండి పని చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక కంటెవారిపల్లెలోనూ సీఎఫ్సీ బిల్డింగ్ నిర్మించే ప్రయత్నం చేస్తాం. టెర్రాకోట, శాలివాహనుల ఉత్పత్తులను ప్రమోట్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం.

Also read this blog: Yuvagalam Continuous Drive Towards Excellence

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *