
కదిరి నియోజకవర్గంలో యువనేతకు బ్రహ్మరథం అడుగడుగునా మహిళల హారతులు, నీరాజనాలు
యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 46వరోజు (శనివారం) శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగింది. కదిరి నియోజకవర్గ ప్రజలు యువనేతకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగడుగునా లోకేష్ కు రోడ్లవెంట బారులు తీరి సంఘీభావం తెలుపుతూ నీరాజనాలు పట్టారు. కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుండి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగునా మహిళలు హారతులివ్వగా యువత, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముత్యాలపల్లి అనంతరం కొక్కింటి క్రాస్ వద్ద ఎస్టీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్టీలు సమస్యలు లేవనెత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తనకల్లు చేరుకున్న యువనేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రోడ్లపైకి భారీగా చేరుకుని తమ ఇబ్బందులు, బాధల్ని లోకేష్ తో విన్నంచుకున్నారు. అందరినీ ఆప్యాయతగా పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగారు. యర్రగుంట్లపల్లికి చేరుకున్న లోకేష్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
వైసీపీ పాలనలో మహిళలకి రక్షణ లేదు- లోకేష్‌కి మొరపెట్టుకున్న శశికళ
వైసీపీ పాలనలో మహిళలకి రక్షణ కరవైందని తనకల్లు మండలం గందోడివారి పల్లికి చెందిన శశికళ నారా లోకేష్ ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటి పక్కనే ఉండే వైసీపీ నేత తమపై దాడి చేశాడని, పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. మహిళలపై వైసీపీ నేతలు దాడి చేయడం, కేసు పెట్టినా పోలీసులు స్పందించకపోవడంతో లోకేష్‌ని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నానంది. స్థానిక టిడిపి నేతలు అండగా ఉంటారని లోకేష్ శశికళకి భరోసా ఇచ్చారు.
మెర్సీకిల్లింగ్‌కి అనుమతి కోరిన పాప జ్ఞానసాయిని బతికించిన బాబు పాప బతుకు ఆధారమైన పెన్షన్ తీసేసిన వైసీపీ – నారా లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెని చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలని 2016లో తల్లిదండ్రులు పెట్టుకున్న మెర్సీ కిల్లింగ్ పిటిషన్ గుర్తుందా? చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం ఆర్.ఎస్.కొత్తపల్లికి చెందిన జ్ఞానసాయి అనే బాలిక కాలేయ సమస్యతో బాధపడగా, చికిత్సకి 40 లక్షలకి పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత స్థోమత లేని రమణప్ప డబ్బు కోసం అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇక తన పాపని బతికించుకోలేనని మెర్సీ కిల్లింగ్‌కి అనుమతి కావాలంటూ మీడియా ద్వారా విన్నవించాడు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి సర్కారు ఖర్చుతో వైద్యం చేయించాలని ఆదేశించారు. చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు చేసిన 40 లక్షలతో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించి జ్ఞానసాయిని కాపాడారు. 9 నెలల వయస్సులో ఆపరేషన్ జరిగిన తరువాత చిన్నారి జ్ఞానసాయి మందులకి, నెలనెలా పరీక్షలకి లక్షల్లో ఖర్చు కాగా TDP ప్రభుత్వం సాయం అందించారు. పాప పెరిగి పెద్ద అయ్యింది. నాడు సీఎం చంద్రబాబు చేసిన సాయంతోనే తమ పాప జ్ఞానసాయి ప్రాణాలతో నిలిచిందని లోకేష్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసింది రమణప్ప కుటుంబం. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కాంట్రాక్టు జాబ్ కూడా ఇప్పించారని, వైసీపీ వచ్చాక అదే జాబ్ కారణంగా తన పాప జ్ఞానసాయి, తల్లికి వచ్చే పెన్షన్లు నిలిపేశారని రమణప్ప లోకేష్ ఎదుట వాపోయాడు. ఇప్పటికీ పాప మందులకి నెలకి 20 వేలు అవుతోందని, ఇది తమకి చాలా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ తరఫున వీలైన సాయం చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.
దేవాదాయ నిధులతో గ్రామాల్లో ఆలయాలు నిర్మిస్తాం పూజారులందరికీ గౌరవవేతనాలు అందజేస్తాం గిరిజన తండాలకు లింకురోడ్లను నిర్మిస్తాం గిరిజనులకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతాం తాండాలకు ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం నరేగా పెండింగ్ బిల్లులను వడ్డీతో సహా చెల్లిస్తాం ఎస్టీలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
కదిరి: టిడిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఎండోమెంట్స్ నిధులతో దేవాలయాలు నిర్మిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గం కొక్కంటి క్రాస్ వద్ద ఎస్టీలతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకష్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించడమేగాక ఆయా ఆలయాల్లో పనిచేసే పూజారులకు గౌరవవేతనాలు కూడా చెల్లిస్తామని చెప్పారు. అవసరమైన గిరిజన తాండాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతామని, తాండాలకు లింకురోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. తాండాలలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు టిడిపి హయాంలో 500 మంది జనాభా ఉన్న గ్రామాలను కూడా పంచాయతీలుగా మార్చి.. పథకాలు ఏర్పాటు చేశాం. తాండాలకు కనెక్టివిటీ రోడ్లు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు..రూ.2 వేల కోట్లతో చేపట్టిన పనులు ఈ సీఎం నిలిపేశారు. తాండాలకు సురక్షిత నీరు, రోడ్లు వేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. తాండాలకు ఫోన్ కనెక్టివిటీ చాలా అవసరం. చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రత్యేకంగా తాండాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించి..6 లక్షల కనెక్షన్లు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఆపేసింది. మేము వచ్చాక తాండాలకు ఇంటర్ నెట్ కనెక్షన్ ఇస్తాం.
ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేస్తాం
ఎస్టీల్లో నిరుద్యోగ సమస్య ఉంది. గతంలో మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాం. మేము వచ్చాక ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను పద్ధతి ప్రకారం భర్తీచేస్తాం. 2025 జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. ఒక్క గిరిజనులే కాదు..అందరి పిల్లలూ ఉద్యోగాలకు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. టీడీపీ వచ్చాక కొక్కింటి క్రాస్ లో ఎస్టీలకు భవనం నిర్మిస్తాం. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ తెచ్చిందే ఎన్టీఆర్. టీడీపీ గత ఐదేళ్ల హయాంలో ఏపీ చరిత్రలో 25 వేల కి.మీ సీసీ రోడ్లు వేశాం. మళ్లీ గెలిచుంటే రోడ్లు లేని తాండాలు ఉండేవి కాదు. ఈ దున్నపోతు రోడ్లు వేయకుండా పన్నులు పెంచుతోంది. పంచాయతీ రాజ్ మంత్రి ఎవరో తెలుసా.? ఉపాధి హామీ అంటే కూడా తెలుసో..తెలీదో. అనుభవం లేని వాళ్లు మంత్రులు అయితే సమస్యలకు పరిష్కారం దొరకదు. పంచాయతీ వ్యవస్థను ధ్వంసం చేశారు. వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఏడుస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ప్రభుత్వం లాగేసుకుంది. వచ్చేది టీడీపీనే..తాండాల్లో అభివృద్ధి చేస్తాం. ఎస్టీ నిధులకు సంబంధించిన ప్రభుత్వ సాఫ్ట్ వేర్ మార్చడం రెండు నిమిషాల పని. ఉపాధి హామీని వ్యవసాయానికి ఇండైరెక్ట్ గా అనుసంధానం చేశాం. పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయో తెలీదు. నెలకంటే బిల్లులు ఆలస్యం అయితే లబ్ధిదారులకు 12 శాతం వడ్డీకట్టాలి..మేము వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం.ఎస్టీలను చట్టసభలకు పంపిన ఘనత టీడీపీదే. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ జగన్ ఇస్తానన్నాడు..ఇచ్చాడా.? ఫేక్ హామీలపై ఎందుకు నిలదీయడం లేదు.? ఎస్టీలకు విదేశీ విద్య తీసేశారు. మేము 100 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇచ్చాం. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు జగన్ రద్దు చేశాడు.
నా యుద్ధం నిరుద్యోగ సమస్యపైనే!
నా యుద్ధం నిరుద్యోగ సమస్యపైనే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి..జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. 45 రోజుల యువగళం పాదయాత్రతో ప్రజల్లో మార్పు కనబడుతోంది. 45 ఏళ్లు నిండిన ఎస్టీ మహిళలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తా అన్నాడు..ఇచ్చాడా.? మిమ్మల్ని అడుగడుగునా ఈ సీఎం మోసం చేస్తున్నాడు. పార్టీ పెద్దలతో చర్చించి ఎస్టీలకు భూ పంపిణీపై నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల ముందు జగన్ రైతు రాజ్యం అన్నాడు. కానీ ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం లేదు. ఇన్ పుట్ సడ్సీడీ పెరగాలి. పెట్టుబడి తగ్గిస్తేనే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకునే పరిస్థితిలో లేదు. గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు..ఆదుకున్నారా.? నాలుగేళ్లలో దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్నాం. రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. అన్నదాత సుఖీభవ తెచ్చింది టీడీపీనే. రైతులకు పెట్టుబడి తగ్గించి..గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తీసుకుంటాం. గిరిజనులు కూడా ఆలోచించాలి..మిమ్మల్ని ఆదుకుని, తాండాలను అభివృద్ధి చేసింది టీడీపీనే. సంక్షేమాన్ని కుదించాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు. అభివృద్ధి..సంక్షేమం జోడెద్దుల్లా వెళ్తేనా రాష్ట్రం బాగుంటుంది.
ఎస్టీల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు
పవన్ కుమార్ నాయక్ : తాండాలకు నెట్ వర్స్ సమస్య ఉంది. నీటి సమస్య తీవ్రంగా ఉంది.
కృష్ణా నాయక్, గాజులవారిపల్లి : గతంలో తాండాలను పంచాయతీలుగా చేశాక పంట మొక్కలు పెట్టుకున్న వాళ్లకు బిల్లులు ఇవ్వలేదు. ఇప్పటికీ వేల కోట్ల బడ్జెట్ పెండింగులో ఉన్నాయి. సాఫ్ట్ వేర్ మారిందని ఈ ప్రభుత్వం చెప్తోంది. మా నిధులు మాకు మీరొచ్చాక కేటాయించి..విడుదల చేస్తారా.?
ఆంజనేయులు నాయక్, గార్లపెంటతాండ : బ్యాక్ లాగ్ పోస్టుల మాటే మేము ఇప్పుడు వినడం లేదు..మీరొచ్చాక బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తారా.? యరుకల, యానాది, సుగాలీలకు చట్టసభలో అవకాశం ఇస్తారా.?
కాంతమ్మబాయి, రామప్పతాండ : మా అబ్బాయిలు చదివి పాసైనా ఉద్యోగాలు లేవు. మా పిల్లలకు అవకాశం కల్పించి, ఉద్యోగావకాశాలు కల్పించాలి.
ఎమ్.అరుణ, గుంజువారిపల్లి, తనకల్లు మండలం : టీడీపీ హయాంలో ఇళ్లు మంజూరైంది. బేస్ మెంట్ కూడా నిర్మించి గోడలు కట్టాం. టీడీపీ హయాంలో ఇచ్చిన ఇళ్లు కాబట్టి వాళ్లనే అడగండని వాలంటీర్లు అంటున్నారు. మంజూరు చేసిన ఇళ్లు మాత్రం వైఎస్ఆర్ గృహ నిర్మాణం పథకం పేరుతో సైట్ లో చూపిస్తోంది. రూపాయి కూడా బిళ్లు ఇవ్వలేదు.
రమణమ్మ, బాబీ నాయక్ తండా, తనకల్లు మండలం : పింఛన్ తొలగించారు. నా కూతురు కొడుకు మా రేషన్ కార్డులో ఉన్నాడు..అతని వేలు పడటం లేదని రేషన్ తీసేశారు. నాకు ఆరోగ్యం లేదు. నా భర్త ప్రమాదంలో చనిపోయాడు.. పెన్షన్ అడిగితే ఎక్కడుందని అంటున్నారు. నా భర్త యాక్సిడెంట్లో చనిపోయినందుకు బీమా నాలుగు లక్షలు వస్తుందని వాలంటీర్లు అన్నారు..కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. నా కొడుకుకు మైండ్ సరిగా లేదు..కోడలు మూగది.
రాములమ్మ, మోటుచింతమానుతండా, తనకల్లు మండలం : నా భర్త టీబీ పేషెంట్. 20 ఏళ్ల నుండి బాధపడుతున్నారు. ఏ పనీ చేయలేడు..నడవలేడు. ఆరోగ్య శ్రీకార్డు ద్వారా చూపిస్తే మాత్రలు ఇచ్చి పంపుతున్నారు. అవి కూడా మేము వెళ్లాక.. రెండు మూడు రోజుల తర్వాత మందులు ఇస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్లు అంటున్నారు..కానీ మేమే వెళ్లి తెచ్చుకుంటున్నాము. పెన్షన్ అడిగితే డాక్టర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు..డాక్టర్లను అడిగితే నయం అవుతుంది సర్టిఫికేట్ ఎందుకని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మేము కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి.?
యువనేతను కలసి సమస్యలు విన్నవించిన టమోటా రైతులు
కదిరి నియోజకవర్గం గంగసానిపల్లిలో టమోటా రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. కదిరి నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా టమోటా పంట సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో హెక్టారుకు మల్చింగ్ పేపర్ కు రూ.16,500, కట్టెలకు ఎకరానికి రూ.10వేలు, సబ్సిడీపై ట్రేలు, 90శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందించేవారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రాయితీలన్నింటినీ ఎత్తివేసింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టమోటా రైతులకు రాయితీలు పునరుద్దరించాలి. మా ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేసి గిట్టుబాటు ధర లభించేలా చూడాలి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల పరిహారం అందించాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ….
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతాంగం వెన్నెముక విరిచేశాడు. రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధితో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని నట్టేట ముంచాడు. జగన్ చేతగానితనం కారణంగా టమోటాలకు కనీస ధర లేక రాయలసీమ రైతులు రోడ్లపై పారబోయాల్సిన దుస్థితి కల్పించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. గతంలో అందించిన రాయితీలన్నింటినీ పునరుద్దరిస్తాం.
యువనేతను కలిసిన బలిజ సామాజక వర్గీయులు
కదిరి నియోజకవర్గం బిసినివారిపల్లిలో టి.సదుం గ్రామానికి చెందిన బలిజ సామాజికవర్గీయులు యువనేతను కలిసి సమస్యలను విన్నవించారు. విద్య, ఉద్యోగాల్లో గత ప్రభుత్వం కాపు/బలిజలకు ప్రతిపాదించిన 5శాతం రిజర్వేషన్ ను అమలుచేయాలి. బలిజలు వ్యాపారాలు చేసుకోవడానికి సబ్సిడీ రుణాలు అందించి ప్రోత్సహించాలి. బలిజ కార్పొరేషన్ ఏర్పాటుచేసి యువత స్వయం ఉపాధికి నిధులు కేటాయించాలి. రైతులకు 90శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేయాలి. బలిజల్లో ఉన్నతవిద్యకు వెళ్లే విద్యార్థులకు విదేశీవిద్య పథకాన్ని అమలుచేయాలి. బలిజలను రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి. పారిశ్రామిక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించచాలి..
నారా లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులు, బలిజలను అణచివేయడమే పనిగా పెట్టుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి సీనియర్ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, బోండా ఉమ వంటి వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించారు. టిడిపి హయాంలో కాపు కార్పొరేషన్ ను ఏర్పాటుచేసి కాపుల సంక్షేమనికి 5ఏళ్లలో రూ.3,100 కోట్లు ఖర్చుచేశాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక కాపు కార్పొరేషన్ ను నిర్వీర్యంచేసి తీరని ద్రోహం చేసింది. అధికారంలోకి వచ్చాక కాపు,బలిజ సోదరులకు అండగా నిలబడి న్యాయంచేస్తాం.
Also, read this blog: Yuvagalam Pursuit of Perfection in Anantapur
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh