మండుటెండలోనూ లోకేష్ కోసం రోడ్లవెంట బారులుతీరిన జనం బత్తలపల్లిలో జనప్రవాహం… కిటకిటలాడిన ప్రధాన రహదారి యాత్రలో పోలీసుల డ్రోన్… జగన్ కు లైవ్ లింకు పంపుతానన్న యువనేత ధర్మవరం నియోజకవర్గంలో రెండో రోజూ అదే స్పందన 58వరోజు ఉత్సాహంగా సాగిన యువగళం పాదయాత్ర
ధర్మవరం: యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర 58వరోజు (ఆదివారం) ధర్మవరం నియోజకర్గంలో ఉత్సాహంగా సాగింది. ధర్మవరం నియోజకవర్గంలో వరుసగా రెండోరోజూ కూడా ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. దారివెంట అడుగడుగునా మహిళలు యువనేతకు నీరాజనాలు పడుతూ ఘనస్వాగతం పలికారు. బత్తలపల్లి ప్రధాన రహదారి జనప్రవాహంతో కిటకిటలాడింది. బత్తలపల్లిలో ప్రజలు యువనేతకు అపూర్వస్వాగతం పలుకగా, అదే సమయంలో లోకేష్ పైన పోలీసు డ్రోన్ ఎగిరింది. ఈ సమయంలో ఆగి సెల్ఫీ దిగిన లోకేష్… అయ్యా జగన్ గారు మీరు నన్ను చూడాలి అనుకుంటే మీకు యూట్యూబ్ లైవ్ లింక్ పంపిస్తా అంటూ డ్రోన్ ఎగురుతున్న వీడియో విడుదల చేశారు. బత్తలపల్లి బాణసంచా మోతలు, డప్పుల చప్పుళ్లతో హోరెత్తింది. ధర్మవరం క్యాంప్ సైట్ లో తొగటవీర క్షత్రియసంఘం యువనేతను కలసి తామునేసిన పట్టువస్త్రాలు బహుకరించారు. ఒక చేనేత సోదరుడు లోకేష్ చిత్రంతో నేసిన పట్టువస్త్రాన్ని యువనేతకు బహుకరించారు. ధర్మవరంలోని సిఎన్ బి కళ్యాణ మండపం క్యాంప్ సైట్ నుంచి యువగళం 58వరోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో సుమారు వెయ్యిమందికి పైగా అభిమానులతో యువనేత ఓపిగ్గా ఫోటోలు దిగారు. అనంతరం చేనేత కార్ముకులతో యువనేత సమావేశమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. తర్వాత పార్టీ కేడర్ కేరింతలు, అభిమానుల కోలాహలం నడుమ పాదయాత్ర ప్రారంభమైంది. మండుటెండలో సైతం యువనేత కోసం జనం బారులుతీరి ఎదురుచూడటం కన్పించింది. నాగలూరులో బోయ సామాజికవర్గీయులు యువనేతతో సమావేశమై సమస్యలు చెప్పుకున్నారు. వేల్పుమడుగు వద్ద పొడరాళ్లపల్లికి చెందిన జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్వాసిత రైతులు లోకేష్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. భోజన విరామానంతరం ప్రారంభమైన యువనేత పాదయాత్రకు బత్తలపల్లిలో అపూర్వస్వాగతం లభించింది. అనంతరం బత్తలపల్లి శివార్లలో నిర్వహించిన బహిరంగ సభలో నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ధఎత్తున ప్రజలు హాజరయ్యారు. లింగారెడ్డిపల్లిలో స్థానికులు యువనేతకు ఘనస్వాగతం పలికారు. తర్వాత యువగళం పాదయాత్ర ముస్టూరు విడిది కేంద్రానికి చేరుకుంది.
యువగళం దెబ్బకు మంత్రులను మార్చే పనిలో జగన్! ఆధారాలతో సహా ధర్మవరం ఎమ్మెల్యే అక్రమాలను నిరూపిస్తాం! ధర్మవరం కేటుగాడిపై సిట్ వేసి మింగిన భూములు కక్కిస్తాం బత్తలపల్లి బహిరంగసభలో యువనేత నారా లోకేష్
ధర్మవరం: అరాచకపాలనపై పోరుసాగిస్తూ నేను చేపట్టిన యువగళం పాదయాత్ర 58వరోజుకు చేరుకునే సరికి జగన్ నలుగురు మంత్రులను మార్చే పనిలో పడ్డాడు… అదీ యువగళం పవర్… యువత బలం అని టిడిపి యువనేత Nara Lokesh పేర్కొన్నారు. ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. సభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ 400 రోజుల పాదయాత్ర పూర్తయితే ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయం. మై డియర్ జగన్…నేను టెర్రరిస్టు కాదు..వారియర్ అని ముందు నుండి చెబుతూనే వచ్చాను. అయినా నన్ను అడుగడుగునా అడ్డంకులతో ఇబ్బందులు పెట్టారు. అంబేద్కర్ రాజ్యాంగం నన్ను ముందుకు నడుపుతోంది. నేను కార్యకర్తల్ని కాపాడడానికి రాలేదు…కార్యకర్తలే పార్టీని వారి భుజస్కందాలపై మోస్తున్నారు. గతంలో పరిటాల రవీంద్రను చంపినా ఎవరూ భయపడలేదు. పార్టీ మారలేదు. పార్టీ మారాలని ఎంతో మంది భయపెట్టినా పసుపుజెండాతోనే మా జీవితం అని ఈ ప్రాంతప్రజలు నిలబడ్డారు. ఎన్టీఆర్ ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో..ప్రజల గుండెల్లో పసుపుజెండా పాతుకుపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కొట్టిన దెబ్బకు జగన్ రెడ్డి విలవిల్లాడుతున్నాడు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత వేలాది ఉద్యోగావకాశాలు కోల్పోయారు.
ముఖ్యమంత్రి వద్ద రెండు బటన్లు ఉన్నాయ్!
ముఖ్యమంత్రి దగ్గర రెండు బటన్స్ ఉంటాయి. ఒక బటన్ నొక్కితే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడతాయి. బల్ల కింద ఉండే రెండో బటన్ నొక్కితే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతాయి. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు , ఇంటి పన్ను పెంచాడు , చెత్త పన్ను వేసాడు, ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు , నిత్యావసరాలు ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ నంబర్1. యువతను నమ్మించి చీట్ చేసాడు. వైసీపీ పాలనలో ఖైదీలకు ఇచ్చే సౌకర్యాలు కూడా విద్యార్థులకు ఇవ్వడం లేదు. ఖైదీలకు నెలకు రెండు వేలు ఖర్చు చేస్తుంటే విద్యార్థులకు కేవలం వెయ్యి రూపాయిలు మాత్రమే మెస్ ఛార్జీలు ఇస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. TDP అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
మద్యంకోసం మహిళల తాళిబొట్లు తాకట్టు!
మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పడు అప్పుల కోసం మహిళల తాళిబొట్లు తాకట్టు పెడుతున్నాడు ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.
మోటార్లకు మీటర్లతో రైతులకు ఉరితాళ్లు
రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు కాబోతున్నాయి. ఉద్యోగస్తులను వదిలిపెట్టలేదు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. రైతుల్ని ముంచేసాడు. జగన్ పరిపాలన లో పురుగుల మందులు పనిచేయవు. వైసీపీ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. అర్బికే సెంటర్లు ఒక మోసం…మొత్తం నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రాష్ట్రంలో అందిస్తున్నారు.
బిసిలకు కూడా వెన్నుపోటు పొడిచాడు!
బీసీలకు వెన్నుపోటు పొడిచాడు.పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీ సంక్షేమం పై నేను చర్చకు సిద్ధం. ఎవరి హయాంలో బీసీలకు మేలు జరిగిందో చర్చించేందుకు నువ్వు సిద్ధమా?
మైనారిటీలను కూడా మోసగించాడు!
పవిత్ర రంజాన్ వేళ మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. బిజేపి తో పొత్తు లో ఉన్నప్పుడు కూడా టిడిపి మైనార్టీలను ఇబ్బంది పెట్టలేదు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం.
ధర్మవరం దోచింది రూ.1000కోట్లు
ధర్మవరం ఎమ్మెల్యే గత నాలుగేళ్లలో కొట్టేసింది రూ. వెయ్యికోట్లు. ఎమ్మెల్యే ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తి రూ.5 కోట్లు. ఇప్పుడు ఆయన ఆస్తి వెయ్యి కోట్లు. ఎమ్మెల్యే అయిన తరువాత ఆయనకి ప్రతి రోజూ గుడ్ మార్నింగే! ఎందుకో తెలుసా ముందు రోజు కలక్షన్ అంతా ఉదయమే ఇంటికి వచ్చేస్తుంది. ఈయన ఎమ్మెల్యే అయిన తరువాత ధర్మవరం ప్రజలకు మాత్రం ప్రతిరోజూ బ్యాడ్ మార్నింగే! ఎందుకో తెలుసా ఎమ్మెల్యే ఎవరి స్థలం కబ్జా చేస్తాడో అన్న భయం. టిడిపి హయాంలో ధర్మవరం ధర్మం ఉండేది. ధర్మవరం ఎమ్మెల్యే అయ్యాకా ధర్మవరంలో మొత్తం అధర్మమే! గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఉదయాన్నే టౌన్లో నడుస్తాడు. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయా అని చూస్తాడు. సాయంత్రానికి ఎమ్మెల్యే గ్యాంగ్ రంగంలోకి దిగి భూమిని కబ్జా చేస్తుంది. ఇలా ఒక్క ధర్మవరం టౌన్ లోనే 50 ఎకరాలు కొట్టేసాడు. ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ప్రతినెల 30 లక్షల వాటా వెళ్తుంది. ఎవరైనా వెంచర్ వెయ్యాలి అంటే ఎమ్మెల్యేకి ఎకరాకు రూ.10లక్షల కప్పం కట్టాల్సిందే.
చెరువును మింగేసి ఫామ్ హౌస్ నిర్మించిన ఘనుడు
ధర్మవరం టౌన్ ని అనుకొని ఉన్న చెరువు,ఎర్రగుట్టను మింగేసి ఫామ్ హౌస్ కట్టాడు. 20 ఎకరాల భూమి స్వాహా చేశాడు. ఎస్టీ భూములను దౌర్జన్యంగా లాక్కొని తమ్ముడి భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఫామ్ హౌస్ లో రేసింగ్ ట్రాక్, గుర్రపు స్వారీ కోసం ప్రత్యేక రోడ్డు వేయించుకున్నాడు. బోటింగ్ కోసం చెరువులో ప్రత్యేక పాయింటు ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఎంత దుర్మార్గుడు అంటే ఈయన సరదగా బోటులో తిరగడానికి వాటర్ లెవల్ ఉండాలని వ్యవసాయానికి నీరు వదలలేదు. 2 వేల ఎకరాలకు నాలుగేళ్లుగా నీరు విడుదల చేయకుండా అన్నదాతల నోట మట్టికొట్టాడు.
అధికారులతో నోటీసులు ఇప్పించి భూముల స్వాహా!
భూములు కబ్జా చేయడంలో ఎమ్మెల్యే స్టైలే వేరు.. ముందు తాను కాజేయాలనుకున్న భూమి యజమానికి లేదా రైతుకు రెవెన్యూ అధికారుల ద్వారా నోటీసులు ఇప్పిస్తాడు. ఈ భూమి అసైన్డ్ భూమి అని.. సాగులో లేనందున తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని నోటీస్ ఇప్పిస్తాడు.. అప్పుడు ఆ రైతులు ఏం చేయాలో తెలియక భయపడి పోతారు. అప్పుడు ఈ ఎమ్మెల్యే తన అనుచరులని రైతుల దగ్గరకు పంపించి భూమిని సగం ధరకు అమ్మేయాలని బేరం పెడతారు. ఇలా ధర్మవరం మెయిన్ రోడ్డుకు అనుకొని ఉన్న భూములను స్వాహా చేశాడు.
సోలార్ ప్లాంట్ భూములతో రూ.50కోట్లు స్వాహా
ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం టిడిపి హాయంలో 106 ఎకరాలు కేటాయించాం. ఈ ధర్మవరం ఎమ్మెల్యే ఆ కంపెనీ యజమానులను బెదిరించి 106 ఎకరాలను తమ్ముడి పేరుతో రాయించుకున్నాడు. ఆ కంపెనీ ఐదేళ్ల క్రితం ఎకరా మూడున్నర లక్షలతో కొనుగోలు చేసింది. ఐదేళ్ల తర్వాత ఎకరా మూడు లక్షలకే ఎమ్మెల్యే తమ్ముడికి అమ్మేసిందంటే దీని వెనుక బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్తం చేసుకోవచ్చు. ఈ డీల్ లో ఎమ్మెల్యే కొట్టేసింది 50 కోట్లు. ముదిగుబ్బ మండలంలో ఈ ఎమ్మెల్యే అనుచరుడు నారాయణరెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ముదిగుబ్బ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలాలు మొత్తం కబ్జా చేశాడు. సుమారు 50 కోట్లు విలువ చేసే 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్నాడు. కావాలంటే సర్వే నంబర్లు.. ఆధారాలతో సహా నిరూపిస్తాం. ధర్మవరం పట్టణంలోని మున్సిపల్ రిజర్వడ్ స్థలాలను ఎమ్మెల్యే అనుచరులు విచ్చలవిడిగా ఆక్రమించుకొని అమ్ముకుంటున్నారు. సర్వే నంబర్లతో సహా అన్ని ఆధారాలు ఇస్తాం చర్యలు తీసుకునే దమ్ముందా? ధర్మవరం బస్టాండ్ ఎదురుగా సాయి నగర్ కాలనీలో సుమారు 500 మంది 30 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఒక కాలనీ మొత్తం నాదని ఎమ్మెల్యే చెబుతున్నాడు. డబ్బులు చెల్లించకపోతే ఇల్లు పడగొట్టి ఖాళీ చేయిస్తానని పేదలపై దౌర్జన్యం చేస్తున్నాడు. ఇప్పటికే అధికారుల నుంచి నోటీసులు కూడా ఇప్పించాడు. ఈ భూమి విలువ సుమారు 100 కోట్లు ఉంటుంది.
ఉప్పలపాడు రీచ్ నుంచి బెంగుళూరుకు ఇసుక!
ఎమ్మెల్యే ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఉప్పలపాడు రీచు నుంచి రోజు వందల కొద్ది టిప్పర్లు బెంగళూరుకు వెళ్తున్నాయి. పేరుకే జెపి వెంచర్స్ కి కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ ఈ పెత్తనం మొత్తం. నలుగురు అనుచరులను బినామీలుగా పెట్టుకొని ఇసుక దందా చేస్తున్నాడు. నదికి అనుకోని ఉన్న పొలాలను కూడా వదలడం లేదు. ఇటీవల తన పొలంలో ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం కూడా చేశాడు. వీరి దౌర్జన్యాలకు అడ్డుచెప్పిన జిల్లా మైనింగ్ అధికారిని బదిలీ చేయించారు. వీరి ఒత్తిళ్లకు తట్టుకోలేక మరో అధికారి సెలవు పై వెళ్ళిపోయాడు. తాము అధికారంలోకి వస్తే చిత్రావతి రిజర్వాయర్ ముంపు గ్రామాలకు పెద్ద మొత్తంలో పరిహారం ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే . తన అనుచరులను ముంపు బాధితుల జాబితాలో చేర్చి సుమారు 20 కోట్లు కాజేశాడు. కావాలంటే కలెక్టర్ గారికి ఆధారాలు సమర్పిస్తాం. చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? ఎమ్మెల్యే రాజీనామా చేస్తాడా? టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నాయకుల భూకబ్జాల పై మొదటి సిట్ వేసేది ధర్మవరంలోనే. డిఎస్పీ స్థాయి అధికారి, రిటైర్డ్ జడ్జ్ని పెట్టి సిట్ వేస్తాం. ఎమ్మెల్యే దోచుకున్న భూములు అన్ని పేదలకు పంచుతాం.
టిడిపి హయాంలోనే ధర్మవరం అభివృద్ధి!
ధర్మవరాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. పేదలకు టిడ్కొ ఇళ్లు, పేదలకు ఇళ్ల పట్టాలు, గ్రామాల్లో సిసి రోడ్లు, ఎల్ఈడి వీధి దీపాలు, నీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చాం. ధర్మవరం చెరువు నుండి 4 ఏళ్ళు వ్యవసాయానికి నీళ్లు ఇచ్చాం. 386 కిలోమీటర్ల తారు రోడ్డు వేసాం. ధర్మవరం లో 4 లైన్ రోడ్డు వేసాం. 20 వేల ఇల్లు కట్టాం. 20 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 10 వేల టిడ్కొ ఇళ్లు మంజూరుచేశాం. పాదయాత్రలో భాగంగా ధర్మవరం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రతి చేనేత కార్మికుడికి సంవత్సరానికి 24 వేలు అందిస్తానని హామీ ఇచ్చాడు. అయితే అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత నేతన్న నేస్తం అంటూ పథకాన్ని ప్రారంభించాడు. కార్మికులకు కాకుండా సొంత మగ్గం ఉన్నవాళ్లకి మాత్రమే పథకం అంటూ ఫిట్టింగ్ పెట్టారు. అందులోను కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని.. ఫోర్ వీలర్ ఉందని.. పది ఎకరాల భూమి ఉందని చెప్పి 15 వేల మందికి కోత విధించారు. ధర్మవరం నియోజకవర్గంలో 80 వేల మందికి పైగా చేనేతలు ఉంటే కేవలం 8 వేల మందికి మాత్రమే నేతను నేస్తం ఇస్తున్నారు.
చేనేత వస్త్రాలకు జిఎస్టీ లేకుండా చేస్తాం
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత వస్త్రాలకు జీఎస్టి లేకుండా చేస్తాం. యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ అందిస్తాం. టిడ్కొ ఇళ్ళు కేటాయిస్తాం. కామన్ వర్కింగ్ షెడ్లు నిర్మిస్తాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తాం. టిడిపి ప్రభుత్వంలో చేనేత వృత్తిపై ఆధారపడిన వారిని ఆదుకోవడం కోసం ముడి పట్టుపై రాయితీ అందించాం. ఒక్కొక్కరికి నెలకు 2000 రూపాయల వరకు రాయితీ అందించాము. ధర్మవరం నియోజకవర్గంలో సుమారు 25 వేల మందికి ప్రతినెల 2000 ఇచ్చి వ్యాపారానికి చేయూత అందించాం. అంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి 24 వేల రూపాయలు గతంలోనే ఇచ్చాము. జగన్ కొత్తగా వచ్చి పథకంలో 15 వేల మందికి కోత పెట్టడం తప్ప కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. టిడిపి ప్రభుత్వంలో చేనేత కార్మికులకు ఆదరణ పథకం ద్వారా పరికరాలు అందించాం. ధర్మవరం నియోజకవర్గంలోనే పదివేల మంది చేనేతలకు ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చి ప్రోత్సహించాం.
18శాతం జిఎస్టీతో కోలుకోలేని దెబ్బ
అలాగే అనంతపురం జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి, ఉరవకొండ ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేసి చేనేత వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసం సుమారు పదివేల మందికి శిక్షణ అందించాం. శిక్షణ పొందిన వారికి రుణాలు ఇప్పించి వ్యాపారాలు పెట్టుకునేలా ప్రోత్సాహం అందించాం. టిడిపి ప్రభుత్వంలో చేనేత ఉత్పత్తులపై ఒక్క శాతం కూడా పన్ను విధించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చేనేత ఉత్పత్తిపై 18 శాతం జీఎస్టీ విధించి చేనేతలను కోల్కోలేని దెబ్బ కొట్టాడు. ఒక్కో చేనేత కార్మికుడు తయారు చేసే 10 వేల రూపాయల చీరపై.. 1800 రూపాయలు వైసీపీ లాక్కుంటున్నారు. టిడిపి ప్రభుత్వం లో పట్టు వస్త్రాల విదేశీ ఎగుమతులను భారీగా ప్రోత్సహించాం. వ్యాపారుల్ని ఇతర దేశాలలో అనుసంధానం చేసి సాఫీగా ఎగుమతులు సాగేలా చర్యలు తీసుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేతలకు చేనేత రుణమాఫీ కింద 110 కోట్ల రూపాయలు అందజేశాం. చేనేతలకు 2 వేల రూపాయల పెన్షన్ అందించాం. వైసిపి ప్రభుత్వ హయాంలో 55మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి పరిహారం అందలేదు. ధర్మవరం మళ్ళీ అభివృద్ధి చెందాలి అన్నా, పరిశ్రమలు వచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి అన్నా భారీ మెజారిటీతో టిడిపిని గెలిపించండి.
మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్! పట్టణప్రాంత చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, కామన్ వర్కింగ్ షెడ్లు టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టురైతుల బకాయిలు చెల్లిస్తాం ఆత్మహత్యలకు పాల్పడిన చేనేతలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చేనేత కార్మికుల ఆత్మీయ సమావేశంలో యువనేత లోకేష్ ఆత్మహత్య చేసుకున్న కార్మికుడి పిల్లలను చదివిస్తానన్న యువనేత
ధర్మవరం : టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మగ్గం ఉన్న చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ధర్మవరం సిఎన్ బి కళ్యాణ మండపంలో చేనేత,పట్టు కార్మికులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. సమావేశంలో రాములమ్మ అనే చేనేత మహిళ అప్పుల బాధతో భర్త చనిపోయాడని, ఇద్దరు పిల్లల్ని చదివించడం భారంగా మారిందని లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తంచేయగా, ఇద్దరి పిల్లల చదువు బాధ్యత నేను చూసుకుంటా, ఈ ఏడాది నుండి పిల్లల్ని నేను చదివిస్తానని భరోసా ఇచ్చారు. లోకేష్ మాట్లాడుతూ… వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఒక ధర్మవరం పట్టణంలోనే సుమారు 55 మంది నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ద్వారా ఇస్తామన్న ప్రభుత్వం… 5 లక్షల రూపాయలలో ఇప్పటివరకు కనీసం ఒక రూపాయి కూడా ఎక్స్ గ్రేషియా విడుదల చేయలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందిస్తాం. పట్టణ ప్రాంతాల్లో చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, మౌలిక వసతులతో కూడిన కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తాం. చేనేత సమస్యల పై నాకు అవగాహన ఉంది అందుకే టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత ను దత్తత తీసుకుని సమస్యలు పరిష్కరిస్తా. రాష్ట్ర వ్యాప్తంగా పట్టు రైతులకు వైసిపి ప్రభుత్వం 45 కోట్ల రూపాయిలు బకాయిలు పెట్టింది. ఒక్క ధర్మవరం మార్కెట్లోనే ప్రతినెల 40 టన్నుల వరకు పట్టుగూళ్ళు విక్రయాలు జరుగుతాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టు రైతుల బకాయిలు చెల్లిస్తాం.
చేనేతలు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే ఏంచేస్తున్నారు?
దేశం మొత్తం పేరుగాంచిన ధర్మవరం చేనేతకు వైసిపి పరిపాలనలో గడ్డుకాలం వచ్చింది. 55 మంది చేనేత కార్మికులు ధర్మవరం లో చనిపోతే ప్రభుత్వం ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు. గుడ్ మార్నింగ్ అంటూ నటించే మహా నటుడు ధర్మవరం ఎమ్మెల్యే ఏమి చేస్తున్నాడు. చేనేత ఎక్కువగా ఉన్న చోట పవర్ లూమ్ పెట్టడం వలన చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పవర్ లూమ్ లో తయారు అయ్యే వస్త్రాలు గుర్తించే విధంగా లోగో ఉంటే తమకు మేలు జరుగుతుంది అని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా చేనేత, పవర్ లూమ్ రెండింటిని విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంది. చేనేత కార్మికుల కష్టాలు, ఇబ్బందులు వేరు. అన్ని ఒకే గాటిన కట్టకూడదు. ప్రపంచ వ్యాప్తంగా ధర్మవరం పట్టుచీరలకు ఒక ప్రత్యేకత ఉంది. ధర్మవరం పట్టణంలో గతంలో 20వేల మగ్గాలు ఉండగా వైసిపి పాలనలో 10 వేలకు తగ్గిపోయాయి. 12వేల చేనేత కుటుంబాలతో పాటు సుమారు 80 వేల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు రాయితీలు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేతలకు చేనేత రుణమాఫీ కింద 110 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. టిడిపి హయాంలో చేనేతలకు నెలకు 2000 రూపాయిలు పట్టు సబ్సిడీ అందించాం. బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదరణ పథకం ద్వారా ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి 30 వేల రూపాయల విలువైన చేనేత పనిముట్లు అందించడం జరిగింది. టిడిపి హయాంలో చేనేతలకు 2 వేల రూపాయల పెన్షన్ అందించాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి హయాంలో ఇచ్చిన యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ ఎత్తేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ముడి పట్టు ధర 2500 నుంచి 3000 రూపాయల వరకు ఉండగా, వైసిపి ప్రభుత్వంలో 6500 నుంచి 7000 వరకు పెరగడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. పట్టుసాగు ఉత్పత్తి రోజు రోజుకు తగ్గిపోతున్న క్రమంలో, పట్టు రైతులకు ప్రోత్సాహకాలు అందించి పట్టు సాగు వైపు మొగ్గు చూపేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి కిలోకు 50 రూపాయల చొప్పున రాయితీ కల్పించి, పట్టుగూళ్ళు విక్రయించిన అనంతరం రాయితీ సొమ్మును అన్నదాత ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
చేనేత కార్మికులు మాట్లాడుతూ….
వైసిపి పరిపాలనలో చెయ్యడానికి పని లేదు, నేసిన చీరకు గిట్టుబాటు ధర లేదు. పవర్ లూమ్ వలన చేనేత పై ఆధారపడిన కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నాం. చేనేత ఉన్న చోట పవర్ లూమ్ లేకుండా రిజర్వేషన్ యాక్ట్ అమలు చేయాలి. గత టిడిపి హయాంలో ఇచ్చిన యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ పథకాలను వైసిపి ప్రభుత్వం ఎత్తేసింది. ఇస్తామన్న నేతన్న నేస్తం కూడా కేవలం సొంత మగ్గాలు ఉన్న వారికే అని కండిషన్ పెట్టింది. దీంతో 90 శాతం మందికి సాయం అందడం లేదని తెలిపారు.
చేనేత కార్మికుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:
దేవరపల్లి రాములమ్మ : 20 ఏళ్లుగా మగ్గం వర్కు చేస్తున్నాం. పెట్టుబడి ఎక్కువై అప్పులు పెరగడంతో నా భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెలకు రూ.1500 చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నాం. కుటుంబ పోషన కూడా కష్టంగా ఉంది. పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రభుత్వం ఏ సాయమూ చేయడం లేదు.(ఇద్దరు పిల్లన్ని చదవించే బాద్యత టీడీపీ తీసుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.)
రాము, ధర్మవరం : మేము చేనేత వృత్తిలో ఉన్నాం. సరైన గిట్టుబాటు ధర లేక మా అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం సాయం అందించలేదు. చేనేతలను ఆదుకోకుంటే ఆత్మహత్యలు పెరిగిపోతాయి.
వెంకటరమణ : చేనేతలకు నెలనెలా పెన్షన్ ఇవ్వాలి. ఊలు చుట్టేవాళ్లకూ పెన్షన్ ఇవ్వాలి.
పల్లె కృష్ణ : గత ప్రభుత్వంలో ముడి సరుకులకు బాగా సబ్సీడీ వచ్చేంది..దీంతో కొంత లాభాలు ఉండేది. కానీ ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మీరు అధికారంలోకి వచ్చాక మళ్లీ ముడి సరుకులకు సబ్సీడీ ఇవ్వండి.
పూల రామాంజనేయులు : చేనేతలకు పనిలేదు..చేసిన పనికి గిట్టుబాటు లేదు. మా ఉపాధి మాటేంటనే ప్రశ్న చేనేతల్లో లేవనెత్తుతోంది. దీనికి ప్రభుత్వాలు పరిష్కారం కనుక్కోవాలి. పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి అనంతలో 55 వేల మందిపైగా మగ్గాలపై నేసే వాళ్లున్నారు.
తాడిమర్రి వెంకట్రమణ : ధర్మవరంలో చేనేతలకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయాలి.
యువనేతను కలిసిన వాల్మీకి బోయ సంక్షేమ సంఘం ప్రతినిధులు
ధర్మవరం నియోజకవర్గం నాగలూరులో వాల్మీకి బోయ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. రాష్ట్రంలో 40లక్షలమందికి పైగా వాల్మీకి బోయ జనాభా ఉంది. వాల్మీకులకు కులవృత్తిలేక కూలీపనులు, చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం.సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వాల్మీకి బోయలను ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఎస్టీ జాబితాలో చేర్చండి. వాల్మీకి ఫెడరేషన్ ద్వారా మా సామాజికవర్గీయులకు బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించండి. రాష్ట్రంలోని అన్ని నియోకవర్గ కేంద్రాల్లో కళ్యాణ మండపాలు, మండల కేంద్రాల్లో వాల్మీకి భవనాలు నిర్మించాలి. వాల్మీకి బోయలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించండి. వాల్మీకిలపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీషీట్లను టిడిపి ప్రభుత్వం వచ్చాక తొలగించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
గత నాలుగేళ్లలో బిసిలకు చెందాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన బిసి ద్రోహి వైసీపీ. వాల్మీకి బోయలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 26వేలమంది బిసిలపై వైసీపీ సర్కారు తప్పుడు కేసులు నమోదుచేసి వేధిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు ప్రారంభించిన వాల్మీకి భవనాలను వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడుబెట్టింది. గత టిడిపి ప్రభుత్వం వాల్మీకి బోయలకు సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషిచేసింది. వాల్మీకి బోయ సామాజికవర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులను రాష్ట్రమంత్రిని చేయడంతోపాటు ఎంతోమందికి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా పద్ధతిన వాల్మీకి బోయ కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తాం. సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా వాల్మీకి బోయలకు న్యాయం చేస్తాం.
యువనేతను కలిసి సమస్యలను విన్నవించిన పొడరాళ్లపల్లి గ్రామస్తులు
ధర్మవరం నియోజకవర్గం పొడరాళ్లపల్లి జిల్లేడు బండ ప్రాజెక్టు ముంపు బాధితులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 2003లో చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్న సమయంలో ఎక్కువ భూములు ముంపునకు గురికాకుండా 0.48 టిఎంసిల సామర్థ్యంతో జిల్లేడు బండ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. మిగిలిన సాగుభూమిలో మామిడి, చీని, జామ, పూలచెట్లు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం జిల్లేడు బండ ప్రాజెక్టును 2.48 టిఎంసిలకు పెంచుతూ అనుమతులు మంజూరుచేసింది. దీనివల్ల దాదాపు 1500 ఎకరాలు ముంపునకు గురవుతోంది. పొడరాళ్లపల్లి వాసులు ఎక్కువగా భూములు కోల్పోతున్నారు. భూసేకరణపై రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం మాకు ఎకరాకు రూ.30లక్షలు పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం నుంచి మాకు పరిహారం ఇప్పించి న్యాయం చేయాల్సిందిగా విజ్జప్తి.
యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం భూములు లాక్కోవడంపై చూపిన శ్రద్ధ నిర్వాసితులకు పరిహారం అందించడంలో చూపించడం లేదు. రైతులనుంచి ఏ ప్రాజెక్టుకైనా భూములను సేకరించాలంటే భూసేకరణ చట్టం – 2013 ప్రకారం పరిహారం చెల్లించాలి. అడ్డగోలుగా భూములు లాక్కోవడమే తప్ప జగన్ ప్రభుత్వానికి బాధితుల గోడు పట్టడం లేదు. జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించేలా టిడిపి తరపున ప్రభుత్వంపై వత్తిడితెస్తాం. అవసరమైతే తెలుగుదేశం పార్టీ పక్షాన నిర్వాసితుల సమస్యను అసెంబ్లీ, మండలి దృష్టికి తీసుకెళ్తాం. న్యాయం జరిగేవరకు జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తాం.
ధర్మవరం చేనేతల అభిమానానికి ధన్యవాదాలు – చంద్రబాబు కుటుంబానికి చేనేత పట్టు వస్త్రాలు బహూకరించిన తొగట వీర క్షత్రియులు – తొగట వీర క్షత్రియుల కులదేవత చౌడేశ్వరి చిత్రంతో ఉన్న వస్త్రం లోకేష్‌కి అందజేత – ధర్మవరం ప్రజలు ఆత్మీయత జీవితంలో మరిచిపోలేనన్న నారా లోకేష్
తెలుగుదేశం తేజం, టిడిపి యువనేత నారా లోకేష్‌కి నేతన్నలు అమూల్యమైన కానుకలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. యువగళం పాదయాత్రలో ధర్మవరం చేరుకున్న నారా లోకేష్‌కి అపూర్వ స్వాగతం పలికారు. చేనేతల పురం ధర్మవరంలో నేతన్నలైన తొగటవీర క్షత్రియ సంఘం లోకేష్‌ని పట్టువస్త్రాలతో ఆత్మీయంగా సత్కరించారు. ధర్మవరం తనపై కురిపించిన అభిమానానికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. నలభై ఏళ్లకి పైగా చేనేతలకి అండదండలు అందిస్తోన్న తెలుగుదేశం కుటుంబానికి పట్టు చీరలు, పంచెలు, కండువాలు పెట్టారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మనవడు దేవాన్ష్, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి కోసం చేతి మగ్గాలపై స్వచ్ఛమైన పట్టుతో నేసిన వస్త్రాలను బహూకరించారు. ధర్మవరం నేతన్నలు తమపై చూపించిన అభిమానానికి లోకేష్ ఆనందంతో పులకించిపోయారు. తొగటవీర క్షత్రియుల కులదేవత నందవరం చౌడేశ్వరి అమ్మవారి చిత్రాన్ని పట్టుతో నేసి లోకేష్‌కి అందజేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా తమ ధర్మవరం నియోజకవర్గానికి యువనేత నారా లోకేష్ వస్తున్నారని తెలిసి చాలా రోజుల ముందు నుంచే చేతిమగ్గాలపై చీరలు, పంచెలు, కండువాలు నేసి సిద్ధం చేసుకున్నారు. తమ అభిమాన యువనేత లోకేష్ కి అందజేసి ఆనందం వ్యక్తం చేశారు తొగట వీర క్షత్రియ సంఘీయులు.
లోకేష్‌కి అపురూప బహుమతి
యువనేత లోకేష్‌పై ధర్మవరం నేతన్నలకి అంతులేని అభిమానం. యువగళంకి నేతన్నలు యువదళమై అండగా నిలిచారు. చేనేతలో నైపుణ్యాన్ని ప్రదర్శించి, లోకేష్ ప్రతిరూపాన్ని యువగళం పేరుని పట్టుతో నేసి వస్త్రరూపంలోకి తీసుకొచ్చారు. తొగట వీర క్షత్రియుడైన పుట్లూరు ప్రకాష్ అతని స్నేహితులు పట్టులో ఆత్మీయత కలనేసి ఇచ్చిన అపురూప బహుమతి లోకేష్ అందుకున్నారు.
Also, read this blog: Yuvagalam: Nara Lokesh’s Motivating Expedition
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh