Nara Lokesh Yuvagalam Padayatra

ధర్మవరంలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర జనసంద్రంగా మారిన వీధులు…. వేలసంఖ్యలో రోడ్లపైకి మహిళలు అడుగడుగునా నీరాజనాలు… పూలవర్షంతో అపూర్వ స్వాగతం బాణాసంచా మోతలు, డప్పుశబ్దాలతో దద్దరిల్లిన ధర్మవరం ధర్మవరంలో రాత్రి పొద్దుపోయేవరకు జనం ఎదురుచూపులు పాదయాత్ర పొడవునా వినతుల వెల్లువ…నేనున్నానని భరోసా

ధర్మవరం: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం  పాదయాత్ర శనివారం ధర్మవరం నియోజకవర్గంలో దుమ్మురేపింది. రాప్తాడు నియోజకవర్గం పైదిండి నుంచి ప్రారంభమైన 57వరోజు పాదయాత్ర… మధ్యాహ్నం ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ధర్మవరం ఇన్ చార్జి పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో పెద్దఎత్తున పార్టీనాయకులు, అభిమానులు, ప్రజలు యువనేతకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. యాత్ర ధర్మవరంలోకి చేరుకోగానే… పట్టణమంతా జనసంద్రంగా మారింది. యువకులు కేరింతలు కొడుతూ పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు నీరాజనాలు పట్టారు. యువనేత రాకకోసం ధర్మవరం రోడ్లవెంట జనం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఎదురుచూశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర్మవరంలో జనం స్వచ్చందంగా తరలిరావడంతో పార్టీశ్రేణులు ఆనందంతో పొంగిపోయాయి. తనని చూడటానికి రోడ్ల పైకి వచ్చిన ప్రజల్ని ఓపిగ్గా కలుస్తూ… వారితో ఫోటోలు దిగుతూ సమస్యలు తెలుసుకున్నారు.  ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రావడం లేదని యువకులు ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు వాపోయారు. వైసిపి పాలనలో మైనార్టీలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదని మైనారిటీలు చెప్పారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… వైసిపి పాలనలో అన్ని వర్గాలు బాధితులేనని, ఎవరూ ఆనందంగా ఉండకూడదు అనేది వీల కాన్సెప్ట్.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యవసర సరుకుల ధరలు తగ్గిస్తాం. పన్నుల భారాన్ని తగ్గిస్తాం. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు. ధర్మవరం శివార్లలో వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పాడుబెట్టిన టిడ్కో గృహాలను పరిశీలించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. నామాల క్రాస్ వద్ద సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదలచేయకపోవడంతో రెండేళ్లుగా జీతాలు లేవని ఆవేదన చెందారు. యువనేత లోకేష్ స్పందిస్తూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్యసాయి మంచినీటి పథకాన్ని దత్తత తీసుకుని మరింత విస్తరిస్తానని, కార్మికుల సేవలు వినియోగిచుకుంటామని చెప్పి ముందుకు సాగారు. ధర్మవరంలో నిర్వహించిన యువనేత పాదయాత్రలో వివిధ వర్గాలనుంచి వినతులు వెల్లువెత్తాయి. చేనేత కార్మికులు, బలిజలు, రజకులు, ముస్లింలు, స్వర్ణకారులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. చంద్రన్న నేతృత్వంలో రాబోయే టిడిపి ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటుందని చెబుతూ ముందుకు సాగారు.

యువనేత పాదయాత్రలో వ్యక్తమైన అభిప్రాయాలు:

కౌలుకుతీసుకున్న రెండెకరాల్లో రూ.50వేల నష్టం – చండ్రాయుడు, కొత్తచెరువు మండలం, నారెపల్లి గ్రామం

రెండెకరాలు కౌలుకు తీసుకుని ఎకరాలో వరి, ఎకరాలో శనగ పంట వేశాను. రెండెకరాలకు గాను రూ.50 వేలు నష్టం వచ్చింది. ప్రభుత్వం నుండి ఇన్ పుట్ సబ్సీడీలు లేవు. నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాయి. అప్పులు చేసి వ్యవసాయం చేయాల్సి వస్తోంది. భార్యభర్తలిద్దరం వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నాం. ముగ్డురు ఆడపిల్లలున్నారు. పోషణ కూడా కష్టంగా ఉంది.

నేతన్న నేస్తం ఇవ్వడం లేదు – బి.ఆంజనేయులు, గొల్లూరు గ్రామం

నాకు సొంత మగ్గం ఉంది. అయినా నేతన్న నేస్తం ఇవ్వడం లేదు. చేనేతలకు ఈ ప్రభుత్వం సబ్సీడీలు కూడా ఇవ్వడం లేదు. పవర్ లూమ్స్ సరుకు రావడంతో చేనేత వస్త్రాలకు డిమాండ్ లేదు.  గతంలో చేనేత పెన్షన్ నాకు వచ్చేది..కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. మా ఊర్లో కనీసం రోడ్లు, నీటి సదుపాయం కూడా లేదు. అనుకూలంగా ఉన్నవాళ్లకే పథకాలు ఇస్తున్నారు. ఇతర పార్టీల వారికి పథకాలు రానివ్వడం లేదు.

ఇంటి స్థలం వెనక్కి తీసుకుంటామని బెదిరిస్తున్నారు – చింతా నారాయణ స్వామి, ధర్మవరం

నాకు ఈ ప్రభుత్వం సెంటు స్థలం ఇచ్చింది. అందులో ఇప్పుడే ఇల్లు కట్టుకోవాలని అధికారులు చెప్తున్నారు..లేదంటే స్థలం వెనక్కి తీసుకుంటామని బెదిరిస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం చిన్న ఇల్లు కట్టాలన్నా రూ.5 లక్షలు కావాలి. ఇల్లు కట్టుకోను చేతకాక ఇప్పటికీ అద్దెంట్లో ఉంటున్నాం. రేషన్ కార్డు ఇవ్వడం లేదు. అడిగితే పెళ్లి సర్టిఫికేట్ అడుగుతున్నారు. పదేళ్లక్రితం మాకు పెళ్లైంది. ఇప్పుడు పెళ్లి సర్టిఫికేట్ అడిగితే ఎలా తీసుకురావాలి. ధర్మవరంలో 8 వేల మగ్గాలున్నాయి. చేనేత రంగం పూర్తిగా దెబ్బతింది.

చెప్పేవి నీతులు… దోచేవి గుట్టలు, చెరువులు! ధర్మవరం ఎమ్మెల్యే భూబాగోతాన్ని సాక్ష్యాధారాలతో ఎండగట్టిన యువనేత

ధర్మవరం ఎమ్మెల్యే భూబాగోతాన్ని యువనేత లోకేష్ సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేశారు. ఎమ్మెల్యే ఆక్రమించిన ధర్మవరం చెరువు  ఆనుకొని ఉన్న గుట్టను పరిశీలించిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న ధర్మవరం ఎమ్మెల్యే ఉద్యోగులకు నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారు. అయితే తాను మాత్రం చెరువులు, గుట్టలను దోచేస్తాడు. ధర్మవరం ఎమ్మెల్యే ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు. 902, 909 సర్వే నెంబర్లలోని 20 ఎకరాలను అక్రమించాడు. ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే గారి విలాస కార్యక్రమాలకు అడ్డా అని లోకల్ టాక్ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.

అధికారంలోకి రాగానే ధర్మవరం ఎమ్మెల్యే భూ అక్రమాలపై విచారణ జరిపిస్తాం!

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ధర్మవరం ఎమ్మెల్యే ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామని శనివారం మీడియాకి విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్ ట్రాక్, గుర్రపు స్వారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నంబర్లలో ఎర్రగుట్ట పైన ఉన్న 15 ఎకరాలను దొంగ పత్రాలు సృష్టించి ఎమ్మెల్యే కాజేశారని ఆయన ఆరోపించారు. ఎర్రగుట్టపై భూములను కొట్టేయడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. హైదరాబాదుకు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి సదరు సర్వేనెంబర్ పై రుణాలు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు తయారుచేశారని.. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వాటిని వేలంలో తమ కుటుంబ సభ్యులు కొన్నట్లు రికార్డులు తయారుచేసి భూములను కొట్టేశారు. ఎర్రగుట్టపై మరో   5 ఎకరాలు ధర్మవరం ఎమ్మెల్యే కుటుంబంలోని మహిళ పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారని.. ఇవి పిత్రార్జితంగా ఆమెకు సంక్రమించినట్లు రికార్డుల్లో చూపారన్నారు. అయితే సదరు కుటుంబ సభ్యురాలిది కర్నూలు జిల్లా గాక ఇక్కడికి ఇచ్చి వివాహం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన మహిళ తండ్రికి ఇక్కడ గుట్టపై భూమి ఎలా సంక్రమించిందని అధికారుల్ని ప్రశ్నించారు. ఎర్రగుట్టపై ఉన్న సర్వే నంబర్లకు సంబంధించి రికార్డులు సమర్పించాలని ఆర్.టి.ఐ ద్వారా అడగగా వాటికి సంబంధించిన రికార్డులు లేవంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారని చెప్పారు. రికార్డుల్లో లేని భూమి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరుతో ఎలా నమోదు అయిందని ప్రశ్నించారు. అలాగే పోతుల నాగేపల్లి పరిధిలోని 42, 43 సర్వే నెంబర్లలో అసైన్డ్ భూములను రైతులను బెదిరించి లాక్కోవాలని ప్రయత్నించినట్లు ఆరోపించారు. విషయం ఎస్సీ కమిషన్ వరకు వెళ్లడంతో అప్పటి కలెక్టర్ అడ్డుకున్నారని తెలిపారు. అందుకే ఆయనపై కక్ష పెంచుకుని ఇక్కడి నుంచి బదిలీ చేయించినట్లు ఆరోపించారు.  టిడిపి అధికారంలోకి రాగానే ధర్మవరం ఎమ్మెల్యే భూ అక్రమాలతో పాటు రాష్ట్రంలోని వైకాపా ఎమ్మెల్యేలందరి అవినీతిపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

లోకేష్ ను కలిసిన సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు

ధర్మవరం నియోజకవర్గం నామాల క్రాస్ వద్ద ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1997లో భగవాన్ సత్యసాయిబాబా వారు రూ.380కోట్లతో మంచినీటి పథకాన్ని ఏర్పాటుచేశారు.  ఈ పథకం నిర్వహణలో సుమారు 650మంది కార్మికులు వివిధ విభాగాల్లో గత 25సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహణ నిధులు మంజూరు చేయకపోవడంతో 2021నుంచి నిర్వహణ సంస్థ బాధ్యతలనుంచి తప్పుకుంది. కరోనా లాంటి కష్టకాలంలో సైతం సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు ప్రాణాలకు తెగించి ప్రజలకు తాగునీరు అందించారు.  ఆందోళనను ఉధృతం చేసినపుడల్లా 6,7నెలలకు ఒక జీతం ఇస్తూ ప్రభుత్వం సిబ్బంది జీవితాలతో ఆటలాడుకుంటోంది.nసత్యసాయి వాటర్ వర్క్స్ లో ప్రస్తుతం పనిచేస్తున్న 572మందిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి సకాలంలో జీతాలు చెల్లించాలి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాదిమంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న సత్యసాయి మంచినీటి పథకానికి నిర్వహణ నిధులు సమకూర్చలేక పథకాన్ని పాడుబెట్టడం దారుణం. కరెంటుబిల్లు, కార్మికులు జీతాలు చెల్లించకపోవడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యంకి అద్దం పడుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సత్యసాయి మంచినీటి పథకాన్ని దత్తత తీసుకొని మరిన్ని గ్రామాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటా. దీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి సేవలను వినియోగించుకుంటాం.

అభివృద్ధి అంటే రంగులు వేయ‌డం కాదు! టిడ్కోగృహాలను పరిశీలించిన యువనేత లోకేష్

అభివృద్ధి చేయ‌డం అంటే, ఉన్నవాటికి రంగులు వేయ‌డం కాద‌ని వైసిపి ప్రభుత్వం యువనేత నారా లోకేష్ చుర‌క‌లంటించారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో భాగంగా ఆదివారం ధర్మవరం 28వవార్డులో టిడ్కో గృహాలను లోకేష్ పరిశీలించారు. తాను ఇటుగా వ‌స్తున్నాన‌ని, ఆగ‌మేఘాల మీద టిడ్కో ఇళ్లకి రంగులు వేయిస్తున్న వైసీపీ స‌ర్కారు నాలుగేళ్లుగా వీటిని ప‌ట్టించుకోలేద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ల‌బ్ధిదారులు త‌మ స‌మ‌స్యలను లోకేష్‌కి వివ‌రించారు.

టిడ్కో లబ్ధిదారుల సమస్యలు:

గత ప్రభుత్వ హయాంలో ధర్మవరంలో  పేదలకోసం రూ.600 కోట్ల వ్యయంతో 8,832 టిడ్కోగృహాల నిర్మాణం చేపట్టింది. లబ్ధిదారుల వాటాగా వివిధ కేట‌గిరీల‌కు నిర్ణయించిన మొత్తం 68లక్షల రూపాయలు చెల్లించాం. 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1440 టిడ్కోగృహాలకు లబ్ధిదారుల పేర్లు మార్చి వైసిపి కార్యకర్తలను చేర్చారు. గత ప్రభుత్వ హయాంలోనే 80శాతానికి పైగా పూర్తయిన టిడ్కో ఇళ్లను గత నాలుగేళ్లుగా మాకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక గతంలో టిడ్కో ఇళ్లనిర్మాణాన్ని పూర్తిచేసి గత ప్రభుత్వ హయాంలో ఎంపికచేసిన 8,832మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగించాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక ఏడాదికి 5లక్షల ఇళ్లు కట్టిస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికిన వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లలో కట్టింది నాలుగు ఇళ్లు మాత్రమే. కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని వైసిపి ప్రభుత్వం మేం కట్టిన ఇళ్లకు మాత్రం సిగ్గులేకుండా రంగులు వేసుకుంటున్నారు. పేదవాడు కూడా సౌక‌ర్యవంతమైన ఇళ్లలో నివసించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో 5లక్షల టిడ్కో గృహాలను గ్రౌండింగ్ చేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక కుంటిసాకులతో దాదాపు సగం ఇళ్లను రద్దుచేసింది. గత ప్రభుత్వంలోనే దాదాపు 90శాతం పూర్తయిన 2.62లక్షల టిడ్కో ఇళ్లను మిగిలిన 10శాతం పూర్తిచేసి ఇవ్వకుండా గత నాలుగేళ్లుగా పాడుబెడుతోంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో ఎంపికచేసిన లబ్ధిదారులందరికీ ఇళ్లు పూర్తిచేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం.

స్టిక్కర్ సీఎం క‌వ‌రింగ్..టిడ్కో ఇళ్లకి క‌ల‌రింగ్!

టిడ్కో గృహాల వద్ద సెల్ఫీ దిగిన లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఇచ్చే ప‌థ‌కాలు క‌ట్ చేయ‌డంతో క‌టింగ్ మాస్టర్, ల‌బ్ధిదారుల‌కు అంద‌కుండా స‌వాల‌క్ష అడ్డగోలు నిబంధ‌న‌ల‌తో ఫిటింగ్ మాస్టర్ గా నేను పిలిచే సీఎం. టిడిపి ప్రభుత్వ హ‌యాంలో ప‌థ‌కాల‌కు త‌న స్టిక్కర్ వేసుకున్న సీఎం, టిడిపి హ‌యాంలో క‌ట్టిన‌ టిడ్కో ఇళ్లకూ రంగులు వేసుకున్నారు. నాలుగేళ్ల క్రిత‌మే ధ‌ర్మవ‌రం 28వ‌వార్డులో టిడిపి పూర్తి చేసిన ఈ ఇళ్లు, ల‌బ్ధిదారుల‌కు అప్పగించ‌కుండా శిథిలావ‌స్థకి చేర్చారు. నేను ప‌ర్యట‌న‌కి వ‌స్తున్నాన‌ని తెలిసి నాలుగు రోజుల నుంచీ త‌మ చేత‌గాని పాల‌న‌ని క‌వ‌ర్ చేసుకునేందుకు టిడ్కో ఇళ్లకు క‌ల‌ర్‌ కొట్టారని యువనేత దుయ్యబట్టారు.

చేనేత కార్మికులను కలిసిన యువనేత లోకేష్

ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో చేనేత కార్మికులను యువనేత లోకేష్ కలిసి వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువనేతకు చేనేత కార్మికులు త‌మ‌ సమస్యలను విన్నవించారు. ధర్మవరం నియోజకవర్గంలో 75శాతానికి పైగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాం. గత నాలుగేళ్లుగా చేనేతలు వాడే పట్టు, ముడిసరుకుల ధరలు నూరుశాతం పైగా పెరిగాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా రెండేళ్ల కోవిడ్ కాలంలో చేనేతరంగం అతలాకుతలమైంది. పెరిగిన ధరల కారణంగా చేనేత వస్త్రాలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మవరం నియోజకవర్గంలో 56మంది ఆకలిచావులు, బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికులకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి పరిహారం చెల్లించలేదు. ఆత్మహత్యలకు  పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించేలా చొరవచూపాలి. ప్రతి చేనేత కార్మికుడు ఎటువంటి పూచీకత్తు లేకుండా వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలి. చేనేత వృత్తిదారులను రుణవిముక్తులను చేయడానికి రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలి. చేనేత కార్మికులు తయారుచేసిన పట్టుచీరలను గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి.

యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ….

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అసమర్థత చేనేత కార్మికులకు శాపంగా మారింది. ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు పరిహారం ఇవ్వకపోగా, కనీసం వారి కుటుంబాలను పరామర్శించేందుకు సిఎంకు మనసు రాలేదు. గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు రూ.110 కోట్ల‌ మేర రుణమాఫీ చేశాం. చేనేత కార్మికులకు ముడిసరుకుపై సబ్సిడీ, సబ్సిడీ రుణాలు అందజేసి అండగా నిలిచాం. ఆదరణ పథకంలో చేనేత కార్మికులకు 90శాతం సబ్సిడీపై పనిముట్లు అందజేశాం. చేనేతలకు ముడిసరుకు సబ్సిడీ, సబ్సిడీరుణాలను అందజేసి ఆదుకుంటాం. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు చంద్రన్న బీమాతో తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.

యువనేతను కలిసిన బలిజ సామాజిక వర్గీయులు

ధర్మవరం నియోజకవర్గ బలిజ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో బలిజకాపులకు అమలుచేసిన పథకాలన్నింటినీ  రద్దుచేశారు. కాపులు/బలిజలకు 5శాతం రిజర్వేషన్ ను అమలుచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయలు వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలి. కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు రూ.25లక్షల నుంచి రూ.50లక్షలకు పెంచాలి. కాపుల విదేశీ విద్య సాయాన్ని రూ.10లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచాలి. ధర్మవరంలో బలిజ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాపు మహిళలకు కుట్టుమిషన్లు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా బలిజలపై జరుగుతున్న రాజకీయదాడులు, అక్రమకేసులను నివారించాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

తొలిసారి కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి కాపుల సంక్షేమానికి రూ.3,100 కోట్లు ఖర్చుచేసిన ఘనత గత టిడిపి ప్రభుత్వానిదే. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసింది. గతంలో కాపు విద్యార్థులకు విదేశీ విద్య, ఉపాధి రుణాలు అందజేశాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకృష్ణదేవరాయలు జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తాం. కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి విరివిగా సబ్సిడీ రుణాలు అందజేస్తాం. బలిజ కాపుల సంక్షేమాన్ని కాంక్షించే చంద్రన్నను సిఎం చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

యువనేత లోకేష్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజకసంఘం ప్రతినిధులు

ధర్మవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజకసంఘం, టిడిపి రజక సాధికార సమితి ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నివించారు. సమాజంలో ఇతర వర్గాల నుంచి అవమానాలు, దాడులు జరగకుండా మాకు ప్రత్యేక అట్రాసిటీ చట్టాన్ని తేవాలి. చట్టసభలు, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలి. కులవృత్తికి ఆధునిక యంత్ర పరికరాలు అందజేయాలి. రాష్ట్రంలో రజకులు డ్రైక్లీనింగ్ షాపులు, అధునాతన యంత్రాలపై వృత్తి పనిచేసుకునేందుకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేయాలి. ఒకేదేశం – ఒకే రిజర్వేషన్ ప్రాతిపదికన రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

బిసిల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం బిసిల వెన్నువిరుస్తున్నారు. గత నాలుగేళ్లలో బిసిలకు చెందాల్సిన రూ. 75వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించింది. బిసిలపై 26వేలకుపైగా తప్పుడు కేసులు బనాయించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. రజకులు వృత్తిపనిచేసుకునేందుకు వాషింగ్ మిషన్లను అందజేసి, 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తాం. రజక సంక్షేమానికి నిధులు కేటాయిస్తాం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తాం. మీ అందరి సంక్షేమం కోసం కృషిచేసే చంద్రన్నను సిఎం చేసేందుకు మీవంతు సహకారం అందించండి.

యువనేతను కలిసిన ముస్లిం మైనారిటీలు

ధర్మవరం నియోజకవర్గ ముస్లింలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చట్టపరంగా రక్షణ కల్పించాలి. ముస్లిం మైనారిటీలు వివక్షకు గురికాకుండా ప్రత్యేక అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలి. దుల్హన్ పథకాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా అమలుచేయాలి. ఆ పథకం కింద ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలి. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా యువత ఉపాధికి 50శాతం సబ్సిడీపై రుణాలు అందించాలి. గార్మెంటు, చిన్నపరిశ్రమలకు రుణాలిచ్చి మైనారిటీ యువతను ప్రోత్సహించాలి. మైనారిటీ ముస్లిం విద్యార్థులకు గతంలో మాదిరిగా విదేశీవిద్య పథకాన్ని అమలుచేయాలి. మౌజమ్, ఇమామ్ లకు ఇస్తున్న గౌరవవేతనాలను పెంచాలి. ముస్లిం మైనారిటీల కోసం ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుచేసి, విరివిగా రుణాలివ్వాలి. ముస్లిం మైనారిటీల కోసం ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటుచేయాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా గత నాలుగేళ్లుగా ముస్లిం మైనారిటీలపై వేధింపులు, దాడులు కొనసాగుతున్నాయి. మైనారిటీలకు చెందాల్సిన రూ.5వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10మంది మైనారిటీలు హత్యకు గురికాగా, 40మందిపై దాడులు జరిగాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తాం. దేశంలోనే తొలిసారిగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటుచేసింది ఎన్టీఆర్.  మైనారిటీల స్వావలంబనకు ఇస్లామిక్ బ్యాంక్ ను ఏర్పాటుచేసి ఆర్థికంగా చేయూతనిస్తాం. ముస్లిం మైనారిటీలకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం, దుల్హన్ పథకాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా అమలుచేస్తాం.

లోకేష్ ను కలిసిన స్వర్ణకార సంఘం ప్రతినిధులు

ధర్మవరంలో స్వర్ణకార సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నివించారు. కరోనా తర్వాత తగిన వ్యాపారం లేక స్వర్ణకారులు, బంగారు పనిచేసే కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణకార కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలి. చిన్న స్వర్ణకారులకు బ్యాంకురుణాలు మంజూరుచేసి ఆదుకోవాలి. బంగారు పనిచేసే కార్మికులకు ఇళ్లు మంజూరు చేయాలి. 50ఏళ్లు పైబడిన పేద స్వర్ణకార కార్మికులకు పెన్షన్లు మంజూరుచేయాలి. ధర్మవరంలో స్వర్ణకార అసోసియేషన్ భవనాన్ని ఏర్పాటుచేయాలి. స్వర్ణకారులపై పోలీసు దౌర్జన్యాలు, వేధింపులు లేకుండా చూడాలి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు మాదిరిగానే స్వర్ణకారులను కూడా ప్రభుత్వం వేధిస్తోంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణకారులకు వేధింపులు లేకుండా చేస్తాం. స్వర్ణకార కార్మికులను చంద్రన్న బీమా పరిధిలోకి తీసుకువస్తాం. పేద స్వర్ణకార కార్మికులకు పక్కాగృహాలు నిర్మిస్తాం.స్వర్ణకారులు స్వేచ్చాయుత వాతావరణంలో వ్యాపారాలు నిర్వహించుకునే వాతావరణం కల్పిస్తాం.

Also, read this blog: Yuvagalam: The Journey of Lokesh’s Triumph and Inspiration

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *