Nara Lokesh Yuvagalam padayatra

పుట్టపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన పాదయాత్ర ఘనస్వాగతం నడుపు పెనుగొండలోకి ప్రవేశించిన యువగళం అడుగడుగునా హారతులతో నీరాజనాలు, పూలవర్షంతో ఘనస్వాగతం

పుట్టపర్తి: పుట్టపర్తి నియోజకవర్గంలో రెండురోజుల పాటు విజయవంతంగా సాగిన యువగళం పాదయాత్ర ఆదివారం సాయంత్రం పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెనుగొండ నియోజకవర్గ ఇంఛార్జ్ పార్థసారధి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలు యువనేతకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. యువగళం 51వరోజు పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గం రామయ్యపేట విడిది కేంద్రం నుంచి ఆదివారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ పుట్టపర్తి నియోజకవర్గంలో రెండోరోడజు పాదయాత్ర ఉత్సాహంగా సాగింది.  రామయ్యపేటలో యువనేతకు హారతులు పట్టి స్వాగతం పలికారు. గౌనిపల్లిలో యువనేతను కలిసిన ఎస్సీ సామాజికవర్గీయులు. తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పెనుగొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించగానే  భారీ గజమాలతో పెనుగొండ ప్రజలు యువనేతకు స్వాగతం పలికారు.  గౌనివారిపల్లిలో పూల వర్షం కురిపిస్తూ కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు.  కొరెవాండ్లపల్లిలో యువనేతకు స్వాగతం, మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పలికారు. పాదయాత్రకు బయలుదేరే ముందు రామయ్యపేట విడిది కేంద్రం వ‌ద్ద భగవాన్ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలు వేసి న‌మ‌స్కరించారు. విద్య‌,విజ్ఞానం, వైద్యారోగ్యం, సేవా కార్యక్రమాలు చేప‌ట్టిన భ‌గ‌వాన్ స‌త్యసాయి బాబా స్ఫూర్తితో ప్రజాసేవ‌కి అంకితం అవుతాన‌ని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తనని కలవడానికి వచ్చిన ప్రజలు, యువతను ఆప్యాయంగా పలకరించి సెల్ఫీలు ఇచ్చారు.  పాదయాత్ర దారిలో యువనేత లోకేష్ పుట్టపర్తి నియోజకవర్గం రామయ్య పేట గ్రామంలో 80 ఏళ్ల అవ్వ వెంకటలక్ష్మిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పింఛన్ల పెంపు విషయంలో అవ్వ, తాతలను వైసీపీ ప్ర‌భుత్వం ఎలా మోసం చేస్తుండో లోకేష్ వివరించారు. యువనేతను ప్రైవేటు స్కూలు యాజమాన్య ప్రతినిధులు, ఆటో కార్మికులు, మహిళలు కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పగడాలపల్లి వద్ద భోజన విరామ స్థలంలో బిసిలు, యువకులతో యువనేత సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. సాయంత్రం పెనుగొండ నియోజకవర్గంలో ప్రవేశించిన పాదయాత్ర కొండాపురం పంచాయితీ రెడ్డిచెరువుకట్ట వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

టిడిపి వాడినని వాహనమిత్ర ఎగ్గొట్టారు – టి. నాగేంద్ర, ఆటో డ్రైవర్, పుట్టపర్తి

వాహన మిత్ర కింద నాకు ఒకసారి మాత్రమే పదివేలు వేశారు. రెండవసారి అసలు పథకమే అమలు చేయలేదు. రెండో విడత డబ్బులు జమ చేయలేదు. వాహన మిత్ర ఎందుకు రాలేదని సచివాలయంలో అడిగితే వెళ్లి కమిషనర్ ను అడుగు అన్నారు.  కమిషనర్ ను అడిగితే వస్తుందిలే అన్నారు.  మళ్లీ వెళ్లి అడిగితే చివరకు నువ్వు టిడిపి.. నీకు ఇవ్వొద్దని చెప్పారని అన్నారు.

దళితులపై దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు – ఎం. నారాయణమ్మ, గౌనిపల్లి

ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎస్సీలు గట్టిగా మాట్లాడాలన్నా భయపడుతున్నారు. ఒక వర్గం వారే పెత్తనం చేస్తున్నారు. మా ఎస్సీలకు ఇచ్చే సంక్షేమ పథకాలు రద్దు చేశారు. దళితులు రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే ఎంతో గౌరవిస్తారు. కానీ దళితులపై దాడులు జరిగితే మాత్రం వైసీపీ పట్టించుకోరు. దళితులకు అండగా ఉంటామన్న హామీ ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తాం

పొలం ఉందని పెన్షన్ తీసేశారు! – వెంకటలక్ష్మమ్మ, రామయ్యపేట

పెన్షన్ రూ.3 వేలు ఇస్తానంటే మా లాంటి ముసలి వాళ్ళు నమ్మి ఓట్లేశారు. పెన్షన్ పెంచిన కొన్ని రోజులకే సరుకుల ధరలు పెంచారు. ఏది కొనాలన్నా వందపైనే ఉంది. పొలం ఎక్కువ ఉందని సాకు చూపి కొంతమంది పెన్షన్లు తీసారు. పొలాలన్నీ పండవు కదా!

పెన్షన్ ఇవ్వడంలేదు – రాములు(63సం.లు), గౌనివారిపల్లి

వలంటీర్ ని అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఉన్నప్పుడు వస్తాయిలే అని చెబుతున్నారు. పెన్షన్ కోసం సంవత్సరం పై బడి అడుగుతున్నా. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. పెన్షన్ వస్తుందనే నమ్మకం కూడా లేదు.

టిడిపి అధికారంలోకి వచ్చాక రజకులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ బిసిల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేస్తాం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం బీసీ సంక్షేమానికి నిధులిప్పించ‌మంటే .. ఇవ్వలేదు – పగడాలవారిపల్లిలో బిసి ప్రతినిధులతో ముఖాముఖిలో నారా లోకేష్

పుట్టపర్తి: వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగానే రజకులు వృత్తిపనిచేసుకునేందుకు ఉచితంగా వాషింగ్ మెషీన్లు అందజేసి, ప్రతినెలా 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని యువనేత Nara Lokesh పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం పగడాలవారిపల్లిలో బీసీ సామాజికవర్గీయులతో యువనేత సమావేశమయ్యారు. మాజీ మేయ‌ర్, చేనేత‌ల ముద్దుబిడ్డ‌, ఉన్నత విద్యావంతురాలు పంచుమ‌ర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచి బీసీల పుట్టిల్లు తెలుగుదేశమని నిరూపించార‌ని కొనియాడారు. శాసనమండలి సభ్యురాలిగా గెలుపొంది సంచ‌ల‌నం సృష్టించిన‌ పంచుమర్తి అనురాధని ఘనంగా సత్కరించారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక బీసీలకు రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. మద్యం దుకాణాల్లో కల్లుగీత కార్మికులకు రిజర్వేషన్లు ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నాం.  ప్రమాదంలో చనిపోయిన ఆవులు, గొర్రెలకు ఇన్సూరెన్స్ విధానం మళ్లీ తీసుకొస్తాం. రాష్ట్రంలో తెలంగాణా తరహాలో నీరా కేఫ్ లు ఏర్పాటుచేస్తాం.  బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని టిడిపి ఆనాడే తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. జగన్  మాత్రం కేవలం 4 జిల్లాల వాళ్లను మాత్రమే ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం చేశారు. సీఎం అయిన నాలుగేళ్ల తర్వాత జగన్ కు వాల్మీకీ, బోయలు గుర్తొచ్చారు. వడ్డెర్లకు ఎక్స్ ప్లోజివ్ లైసెన్సులపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జిఓ నెం.217తో ముఖ్యమంత్రి  మత్స్యకారుల పొట్టగొట్టాలని చూస్తున్నారు. చేపచెరువులను మత్స్యకారులకే కేటాయిస్తాం. మత్య్సకారులకు గతంలోఇచ్చిన సంక్షేమ పథకాలు మళ్లీ తీసుకొస్తాం. అధికారంలోకి రాగానే చంద్రన్న బీమా రూ.10 లక్షలకు పెంచుతాం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే బీసీల రక్షణ కోసం ప్ర‌త్యేక చట్టం తీసుకొస్తాం.

బ్యాక్ బోన్ అంటూనే బిసిల వెన్నెముక విరిచిన వైసీపీ

బీసీలే వైసీపీకి బ్యాక్ బోన్ క్లాస్ అంటూ మాయ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన‌  వైసీపీ ప్ర‌భుత్వం వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తుల వెన్ను విరిచేశారు. బీసీల‌పై ఎవరు దాడి చేసినా జైలుకు పోతారు. హార్టీ కల్చర్ కింద కల్లుచెట్లు సాగును కూడా చేర్చే ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు సీఎం అయ్యాకే వడ్డెర్లకు ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ వడ్డెర్లకు క్వారీలు ఇస్తే వాటిని పాపాల పెద్దిరెడ్డి లాక్కున్నారు. బీసీ సబ్ ప్లాన్ ను ఏర్పాటు చేసింది టీడీపీనే. 26వేల మంది బీసీలపై ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది.  కల్లుగీత కార్మికులకు TDP హయాంలో పనిముట్లు, టీవీఎస్ వాహనాలను ఇచ్చాం. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన బీసీలకు ఈ ప్రభుత్వం కేస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. వైసీపీ నేతలు లాక్కున్న గొర్రెలు మేపుకునే భూములు టీడీపీ వచ్చాక స్వాధీనం చేసుకొని కురబలకు అప్పగిస్తాం.

బిసిల ముఖాముఖిలో సమావేశంలో వ్యక్తమైన సమస్యలు

వడ్డెర్ల చేతిలో ఉన్న మైన్ల ను వైసిపి నాయకులు లాక్కున్నారు. టిడిపి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే  మైన్లు కేటాయించడం తో పాటు ఎక్స్ ప్లోజివ్ లైసెన్సులు వడ్డెర్లకు ఇవ్వాలి. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలి. వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిన గౌడ కార్పొరేషన్ ని పున‌రుద్ధరించాలి. కల్లుగీత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. బీసీ పిల్లలు చదవుల్లో అన్యాయానికి గురవుతున్నారు. యాదవులు గొర్రెలు కొనుగోలు చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కారు రుణాలు ఇవ్వడంలేదు. నీరా కేఫ్ ఏపీలోనూ ఏర్పాటుచేయాలని కోరారు.

యువతకు ఉద్యోగాలతోపాటు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం! చట్టసభల్లో యువతకు 40శాతం సీట్ల హామీకి కట్టుబడి ఉన్నాం! రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తాం పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని మళ్లీ తీసుకొస్తాం! యువతీయువకులతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

పుట్టపర్తి: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. యువతకు ఉద్యోగాలివ్వడమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం  పగడాలవారిపల్లిలో యువతతో నారా లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…పక్క రాష్ట్రాల పేపర్ తెరిస్తే పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఏపీ పేపర్ తెరిస్తే కేసులు, కబ్జాలు, ఆక్రమణలు, దందాలు మాత్రమే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఏపీకి వచ్చిన పరిశ్రమలు, కంపెనీలు, వాటి అనుంబంధ సంస్థలను వైసీపీ ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు తరిమేసింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నోరెత్తితే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేధిస్తోంది. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో స్పందించినా సీఐడీ కేసులతో వేధిస్తోంది. యువతకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు, వారిని చైతన్యపరిచేందుకే యువగళం ప్రారంభించాను. అనంతపురంజిల్లాకు కియా పరిశ్రమను తీసుకొచ్చాం. దీనివల్ల అనంతపురం జిల్లా తలసరి ఆదాయం సుమారు రూ.25వేలు పెరిగింది. కడపకు ఉక్కు, ఎలక్ట్రానిక్ కంపెనీలు తెచ్చాం. కర్నూలుకు సిమెంట్, సోలార్ కంపెనీలు పెట్టి వాటిని ప్రోత్సహించాం.  శ్రీకాళహస్తిలో టీసీఎల్ కంపెనీని పెట్టాం. అక్కడ నెలకు రూ.4లక్షల జీతంతో యువత ఉద్యోగాలు చేస్తున్నారు. చట్టసభల్లో 40శాతం యువతకు అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. టాలెంట్ ఉన్న యువతకు, పార్టీకోసం కష్టపడేవారికి ప‌ద‌వుల్లో ప్రాధాన్యం ఇస్తారు.

వైసీపీ పాలనలో కరువైన రక్షణ

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు చేయాలంటే నేరస్తులు వణికిపోయేవారు. ఒకసారి అత్యాచారం చేసిన వ్యక్తి పోలీసులు తనను ఏం చేస్తారోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గెలిచిన తర్వాత కూడా అసభ్యకర పోస్టులు పెట్టారు. నరసరావుపేటలో అనూష ను ఓ దుర్మార్గుడు హత్య చేస్తే, నిందితుడికి వారం రోజుల్లో బెయిల్ వచ్చింది. కారణం దిశ చట్టం కింద కేసు పెట్టడం. వాస్తవంగా రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో లేదు. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే దిశచట్టం పై ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. చంద్రబాబు సీఎం అవుతారు, మహిళల ర‌క్షణ క‌ల్పిస్తారు.

పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని తెస్తాం!

చంద్రబాబు పాలనలో పీజీ విద్యార్థులకు ప్రత్యేక జీఓ ద్వారా ఫీజు రీయింబర్స్ మెంట్ ను అందించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేసింది. జగన్ తెచ్చిన విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను తొలగించి తిరిగి పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తెచ్చి  పీజీకి కొనసాగిస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారం ఉండేది కాదు. వైసీపీ ప్రభుత్వంలో మోసకారి పథకాలు ఇస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల భారంతో నలిగిపోతున్నారు. చదువు పూర్తి అయినా ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. విద్యాసంస్థల్లో పెండింగ్ లో ఉన్న మార్కుల లిస్టులను వన్ టైం సెటిల్ మెంట్ తో సర్టిఫికెట్లు ఇప్పిస్తాం.

ఇంగ్లీషు మీడియంను బలవంతంగా రుద్దం!

విద్యార్థులపై ఇంగ్లీషు మీడియాన్ని వైసీపీ ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోంది. విద్యార్థులకు తెలుగు మీడియం ఆప్షన్ ఉండాలని నేను భావిస్తున్నాను. నేను ఇంగ్లీషు మీడియంలో చదువుకుని తెలుగులో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిపడ్డాను. అందుకే నా కొడుకు దేవాన్ష్ కి చిన్నప్పటి నుండే తెలుగుభాషలో శిక్షణ ఇప్పిస్తున్నాను. ఏపీలో విద్యారంగంలో పెనుమార్పు తెచ్చేందుకు చంద్రబాబు గతంలో అనేక నిర్ణయాలు చేశారు. వైసీపీ పాలనలో నిరక్షరాస్యత శాతం పెరిగింది. అక్షరాస్యతను పెంచడానికి మేం అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం.

రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తాం!

చంద్రబాబు క్రీడారంగాన్ని ప్రోత్సహించారు. ఉమ్మడి ఏపీలో పుల్లెల గోపీచంద్ తో అకాడమీ పెట్టించి అనేక మందికి క్రీడా వేదికను ఏర్పాటు చేశారు. అటువంటి అకాడమీ ద్వారానే మన దేశానికి మెడల్స్ వచ్చాయి. ఈ ఘనత చంద్రబాబుది. గతంలో మనం ఏవిధంగా చేశామో, మళ్లీ అధికారంలోకి వచ్చాక క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తాం. రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తాం. గ్రామస్థాయి నుండి క్రీడలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు క్రీడా స్థలాలను అభివృద్ధి చేశాం. కబడ్డీ, వాలీబాల్, ఇతర ఆటలను మేం పెద్దఎత్తున ప్రోత్సహించాం. ఏపీ నుండి స్పోర్ట్స్ కోటాలో భారతదేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన వారిని గ్రూపు-1 ర్యాంకు ఉద్యోగాలు కల్పించిన చరిత్ర చంద్రబాబుది.

సిలబస్ లో మార్పులు తెస్తాం!

టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కేజీ టు పీజీ వరకు విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ఉపాధి అవకాశాలు లభించేలా సిలబస్ లో  మార్పులు తెస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి అడ్మిషన్లను పెంచుతాం. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను రెండింటికీ ఊతమివ్వాల్సి ఉంది. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటగా విద్యావ్యవస్థను అభివృద్ధి చేస్తాం.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే బాధ్యత మేం తీసుకుంటాం. టీడీపీ పాలనలో విదేశాలకు వెళ్లిన వాళ్లకు వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని అమలు చేయకుండా ఇబ్బందులకు గురిచేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక విదేశీవిద్యను పునరుద్ధరిస్తాం. చదువుకున్నవాళ్లంతా తమ స్వార్థం చూసుకోకుండా, భావితరాల అవసరాలు తెలుసుకుని సమాజానికి సేవ చేయాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక నిర్ణీత కటాఫ్ తేదీని ప్రకటించి పక్కరాష్ట్రాల్లో అడ్మిషన్లు వచ్చిన వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తాం.

యువత గంజాయికి దూరంగా ఉండాలి

దయచేసి యువతను కోరుతున్నా. డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండండి. గంజాయికి వ్యతిరేకంగా యువత కూడా పెద్దఎత్తున పోరాడాలి. గంజాయి, డ్రగ్స్ ను ఏపీ నుండి తరిమికొట్టాలి. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ రాష్ట్రాల వైపు మనం చూడడం కాదు..ఆ రాష్ట్రాలు మన ఏపీ వైపు చూసేలా చేస్తాం. రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషిచేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగమనేది లేకుండా చేస్తాం.

యువతతో సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

గాయత్రి, డిప్లమో 2వ సంవత్సరం: చదువుకున్న వాళ్లు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగావకాశాలు కల్పించి ఆదుకోండి.

సాయి కార్తిక్, బీటెక్ 3వ సంవత్సరం: డిగ్రీ పూర్తయ్యాక పీజీ చదివే స్థోమత లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మేం చదువుకునే ఫీజ్ రీఎంబర్స్ మెంట్ తో అవకాశం కల్పించండి.

అశ్రిత, డిప్లమో మొదటి సంవత్సరం: ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు మమ్మల్ని బయటకు పంపాలంటే వణికిపోతున్నారు. దిశ చట్టం ఉందని ప్రభుత్వం చెబుతోంది. కానీ యాప్ ఒక్కటే అమలవుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక మా రక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకురండి.

రవి,బీటెక్: యువత అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గత పాలనలో కళారంగాన్ని ప్రోత్సహించారు. ప్రస్తుత కాలంలో అకాడమీలు అలంకారప్రాయంగా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక కళాకారుల్ని, కవుల్ని, కళారంగంలో ముందుకు వెళ్లాలనుకునేవారిని ప్రోత్సహించండి.

శ్వేతారెడ్డి: రాష్ట్రంలో  ఇప్పటికీ 67శాతమే అక్షరాస్యత శాతం ఉంది. దీన్ని పెంచడానికి మీరు చర్యలు తీసుకోండి. చట్టసభల్లో యువతకు ప్రాధాన్యత కల్పించండి.

సంతోష్ రెడ్డి, బీటెక్ 3వ సంవత్సరం: యువతకు ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా ఏర్పాటుచేయండి. క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇవ్వండి.

అనురాధ: విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేసి ఆదుకోండి.

రాజేష్: ఉత్తుత్తి పథకాలతో విద్యార్థులను పార్టీలు మోసం చేస్తున్నాయి. కానీ ఈ వ్యవస్థ సమూలంగా నిర్మూలనకు చర్యలు తీసుకోండి.

షేక్ షాహిని: నేను విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నాను. కానీ మా తల్లిదండ్రులకు ఆ స్థోమత లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఆ అవకాశాన్ని కల్పించండి. నాలా చాలా మందికి ఈ కోరిక ఉంది.

బాలచంద్రిక: నేను తెలంగాణ, ఏపీ ఎంసెట్ రాశాను. తెలంగాణలో సీటు వచ్చింది. కానీ ఫీజు రీయింబర్స్ రాదని చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఏపీలోనే చదవాల్సి వస్తోంది. మీరు అధికారంలోకి వచ్చాక మాలాంటి వాళ్లకు రీఎంబర్స్ మెంట్ అవకాశం కల్పించండి.

భారతి, ఎంబీఏ రెండో సంవత్సరం: ఉన్నతవిద్య చదవాలంటే చాలా మందికి ఆర్థిక భారంతో కూడుకున్న అంశం అయ్యింది. మీరు అధికారంలోకి వచ్చాక మాలాంటి వాళ్లను ఆదుకోండి.

జయసింహ: యువత వ్యవసాయం చేయాలనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహం అందడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక యువతను వ్యవసాయ రంగంలో ప్రోత్సహించండి.

యువనేతను కలిసిన ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు

పుట్టపర్తి నియోకవర్గం రామయ్యపేట విడిది కేంద్రంలో  ప్రైవేటు విద్యాసంస్థల మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.  ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఉన్నత విద్యలో మాతృభాషలో చదువుకునే వీలు లేకుండా కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చదువుకోవాలి అని విద్యార్థులను మానసికంగా వత్తిడి తెస్తున్నారు. ఆన్లైన్ అడ్మిషన్ విధానం ద్వారా పక్క రాష్ట్రాలకు, పట్టణాలకు విద్యార్థులు వెళుతున్నారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యాసంస్థలు మూతపడుతుండడంతో అక్కడి విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష అయిపోతోంది. డిగ్రీ కళాశాలల కోర్సు ఫీజులను హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రెగ్యులేషన్ మానిటరింగ్ కమిటీ అడ్డగోలుగా పెంచేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం ఎత్తేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోతున్నారు. విద్యార్థులు తాము వాడుకున్న ఫీజులు కళాశాలలో కట్టలేక డిగ్రీ చదువులను మధ్యలోనే ఆపేస్తున్న పరిస్థితి. ఇలా ప్రతి సంవత్సరము దాదాపుగా 2,50,000 మంది పైచిలుకు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.  ప్రస్తుతం ఉన్న గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికి పాత పద్ధతినే అమలు పరచి అన్ని కళాశాలలకు కామన్ ఫీజులను నిర్ణయించి,  పాత పద్దతి లోనే ఫీజు నిర్ణయించే అధికారం యూనివర్సిటీలకు ఇవ్వాలని మనవి చేస్తున్నాం.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ పాలనలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి నాకు అవగాహన ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తాం.  ఉన్నత విద్యావిధానాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాం. విద్యార్థుల భవిష్యత్తు, రానున్న టెక్నాలజీ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా సిలబస్ ను మారుస్తాం. ఇప్పటికే యువతతో ముఖాముఖి అయిన సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించాను. ప్రతి ఒక్కరికీ విద్య అందేలా చర్యలు తీసుకుంటాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో నాణ్యమైన విద్య అందించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటాం. ఏ విద్యార్థీ డిగ్రీతో తమ చదువులు ఆపకుండా పీజీ చదువుకునేందుకు ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేసే పథకాలను తక్షణమే రద్దు చేస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేసి, విద్యార్థి తల్లిదండ్రులు ఫీజులు కట్టడానికి ఇబ్బందులు లేకుండా చేస్తాం. సాధారణ ఫీజులతో గ్రామీణ ప్రాంత యువతకు విద్యనందించే విద్యాసంస్థలను ఆదుకుంటాం.

యువనేతను కలిసి సమస్యలను విన్నవించిన పుట్టపర్తి మహిళలు

పుట్టపర్తి నియోజకవర్గం రామయ్యపేట విడిది కేంద్రంలో నియోజకవర్గ మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై యువనేతను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైంది. ఎన్సీఆర్ బి నివేదిక ప్రకారం మన రాష్ట్రం లో 2019లో 1084 అత్యాచార కేసులు  (1104 మంది మహిళలు), 2020 లో 1090 కేసులు (1107 మహిళలు), 2021 లో 1100 పైగా అత్యాచారాలు జరిగాయి. ఆస్పత్రిలోనే సామూహిక అత్యాచారం, రైల్వే స్టేషన్‌లోనే అత్యాచారం జరుగుతున్నాయి. ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. దిశ చట్టం పేరుతో చాలా ప్రచారం చేసి చివరకు దిశ చట్టం యాప్‌కే పరిమితమైంది. ఈ యాప్ తో చదువు రాని సామాన్య, వలస కూలీ మహిళలకు రక్షణ దొరకే పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి మాటతప్పింది. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల భార్యలు గృహిణులుగా ఉన్నారు. వారిని కూడా పొదుపు సంఘాల్లో చేర్చాలి. ఆడపిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలి. మహిళల రక్షణకు మరిన్ని బలమైన చట్టాలు తీసుకురావాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది సర్గీయ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. శాసనసభకు తొలి మహిళా స్పీకరును పంపిన ఘనత చంద్రబాబుది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన ఘనత తెలుగుదేశం పార్టీది. మహిళల కోసం ‘రాష్ట్ర మహిళా కమిషన్’ ను మొదటి సారి ఏర్పాటు చేసింది చంద్రబాబు. 4.75లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుది. విద్య, ఉపాధి రంగాలలో మహిళలకు 33.33శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. ‘దీపం’ పథకాన్ని ప్రవేశ పెట్టి పేదింటి మహిళలకు దాదాపు 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది చంద్రబాబు. 2014 లో డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేశాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సరిపడ మహిళా పోలీసులను నియమిస్తాం. మహిళలపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం. వైసీపీ పాలనలో దాడులు చేసి, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని కేసుల నుండి తప్పించుకున్న వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. బాధిత మహిళలకు పూర్తి న్యాయం చేస్తాం.

యువనేతను కలిసిన ఆటో యూనియన్ ప్రతినిధులు

పుట్టపర్తి నియోజకవర్గం అలపల్లి వద్ద ఆటో యూనియన్ నేతలు యువనేతను కలిసి సమస్యలను విన్నవించారు.  ఈ-చలాన్ విధానాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. ఈ ప్రభుత్వం పోలీసులకు టార్గెట్లు పెట్టి ఫైన్లు వసూలు చేయిస్తోంది. చలానాలు చెల్లించకపోతే పెద్దఎత్తున జరిమానాలు వేస్తున్నారు. వాహనమిత్ర కేవలం వందలో పదిమందికి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఒక ఏడాది ఇచ్చి, మరో ఏడాది ఇవ్వడం లేదు. డీజల్, పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. సొంతంగా ఆటో కొనుక్కునే పరిస్థితులు లేవు. వైసీపీ ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను భారీగా పెంచింది.  పుట్టపర్తి, ఓడీసీలో ఆటోస్టాండ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం.

నారా లోకేష్ మాట్లాడుతూ…

దోచుకోవడంలో ఈ ప్రభుత్వం ఎవరినీ మినహాయించడంలేదు. ఆటోవాళ్ల సంక్షేమం కోసం లైఫ్ ట్యాక్స్ రద్దు చేసింది చంద్రబాబే. మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం.   అడ్డగోలు చలానా విధానానికి టీడీపీ వచ్చాక స్వస్తి పలుకుతాం. ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం. మౌలిక సదుపాయాలతో ఆటో స్టాండ్లు ఏర్పాటు చేస్తాం. ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటాం. అంతరాష్ట్ర సరిహద్దుల్లో తిరిగే ఆటోలకు సింగిల్ పర్మిట్లు ఇస్తాం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. పెట్రోల్, డీజల్ ధరలు తగ్గిస్తాం.

Also, read this blog: The Inspiring Journey of Yuvagalam by Nara Lokesh

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *