పుట్టపర్తి నియోజకవర్గంలో యువగళానికి అపూర్వ స్పందన అడగడుగునా యువనేతకు ఆత్మీయ స్వాగతం
పుట్టపర్తి: రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 50వరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగింది. యువనేత పాదయాత్రకు దారిపొడవునా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎదురేగి స్వాగతం పలుకుతూ తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఓడీసీలో పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. మహిళలు అడుగడుగునా హారతులు ఇస్తూ నీరాజనాలు పలికారు. తనను చూసేందుకు వచ్చిన వారందరిని యువనేత ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగుతూ ముందుకుసాగారు. ఒడిసిలో ముస్లింలు యువనేతకు సమస్యలు చెప్పుకున్నారు. చిరువ్యాపారులు విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వాపోయారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… రాష్ట్రంలో కటింగ్, ఫిటింగ్ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్నివర్గాల సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. యువగళం పాదయాత్ర 50వ రోజు ఒనుకువారిపల్లి విడిదికేంద్రం నుండి ప్రారంభమైంది. దారిపొడవునా రైతులు, మహిళలు, లారీ కార్మికులు, వాటర్ వర్క్స్ కార్మికులు లోకేష్ ను కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. ఓడీసీలో అంబేద్కర్ సెంటర్ వద్ద ముస్లింలు కలసి తమ ఇబ్బందులు లోకేష్ కు చెప్పుకున్నారు. శ్రీ విజ్ణాన్ స్కూల్ విద్యార్థులు లోకేష్ ను చూసేందుకు ఎగబడ్డారు. వారితో లోకేష్ సరదాగా మాట్లాడి బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించాలని యువనేత ఆశీర్వదించారు. ఎంబీ క్రాస్ వద్ద సత్యసాయి ట్రస్టులో పనిచేసే కార్మికులతో మాట్లాడారు. అక్కడి నుండి రామయ్యపేట విడిది కేంద్రానికి చేరుకున్నారు.
ఫిష్ ఆంధ్రా శాశ్వతంగా ఫినిష్ అయినట్లేనా? – మూతపడిన ఫిష్ ఆంధ్రా ఎదుట యువనేత సెల్ఫీ!
పాదయాత్ర సందర్భంగా ఓబులదేవచెరువులో మూసివేసి ఉన్న ఫిష్ ఆంధ్ర మార్ట్ వద్ద యువనేత సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగితే గడ్డిమేటు అడ్డొచ్చింది అందట. అట్టా ఉంది మన జగన్ రెడ్డి చేపల బజార్ల తీరు. చేపల దుకాణం ఎందుకు తీయలేదంటే, సవాలక్ష కారణాలు. బులుగు రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ ఫిష్ ఆంధ్ర దుకాణాల నిర్వహణలో ఉంటే బాగుండేది. ఓబులదేవచెరువులో క్లోజ్ అయిన ఫిష్ ఆంధ్ర జగన్ రెడ్డి పనితనానికి నిదర్శనం. గతంలో చిత్తూరుజిల్లాలో ఫిష్ ఆంధ్ర మూతపై ఓ సెల్ఫీతో ప్రశ్నించాను. మౌనం అర్దాంగీకారం అనుకోవచ్చా? ఫిష్ ఆంధ్ర శాశ్వతంగా ఫినిష్ అయినట్టేనా అని యువనేత వ్యాఖ్యానించారు.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
బోరు మంజూరుచేసి పేరు మార్చుకున్నారు – బ్రహ్మాచారి, గాజులకుంటపల్లి, పుట్టపర్తి మండలం
20 రోజుల క్రితం జలసిరి పథకంలో నా భార్య పేరుపై బోరు మంజూరు అయింది. బోరు వేయించుకునేందుకు సిద్ధమవగా.. నాకు మంజూరైన బోరును వైసీపీ నేతలు మరొకరి పేరు మీదకు మార్చుకున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమపై ఒత్తిడి తెచ్చి మార్చారని సచివాలయ ఉద్యోగి నిస్సహాయత వ్యక్తంచేశాడు. ఎకరాన్నర పొలంలో మామిడి చెట్లు నాటాను. నా పక్కపొలం వాళ్ల దగ్గర నీళ్లు కొని చెట్లు తడుపుతున్నా. గతంలో ఏ ప్రభుత్వంలోనూ రైతులకు ఇటువంటి అన్యాయం జరగలేదు.
వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చి మోసగించారు! -షేక్.ఫర్విన్, ఓడీసీ
ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి రుణాలిస్తామంటే మా ముస్లిం మహిళలు జగన్ కు ఓట్లేశారు. వైసీపీ మమ్మల్ని మోసం చేశారు. మాకు రాజకీయాలు అవసరం లేదు. మా సమస్యలు తీర్చేవారికే ఓట్లేస్తాం. దుల్హన్ పథకానికి అన్ని కండీషన్లు పెడితే మేము ఎలా ఉపయోగించుకోవాలి. అసలు ఒక్కరైనా పథకం తీసుకుంటారా.? కనీసం TDP ప్రభుత్వం వచ్చాకైనా కండీషన్లు తొలగించి, దుల్హన్ పథకాన్ని అమలు చేయాలి. హజ్ యాత్రకు వెళ్లాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఎవరూ కేసులకు భయపడాల్సిన పనిలేదు. ఖూనీకోర్లకు ఉన్న విలువ యువతకు లేదు!
వైసీపీ పాలనలో ఖైదీలకు ఉన్న విలువ బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు లేదు. చంద్రబాబు గారు సంక్షేమ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచి ఆదుకున్నారు. వైసీపీ గొప్పగా విద్యా దీవెన, వసతి దీవెన అని పేరు మార్చారే తప్ప ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచలేదు. విద్యార్థులకు ఖర్చు చేసేది వెయ్యి రూపాయిలు మాత్రమే. యువత కు అనేక హామీలు ఇచ్చిన జగన్ ఆఖరికి యువతకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
రైతన్నలను కూడా ముంచేశారు!
వైసీపీ ప్రభుత్వం రైతుల్ని కూడా నిలువునా ముంచేశారు. గిట్టుబాటు ధర లేదు, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల్ని ఆదుకోకపోగా వైసీపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు బిగించేందుకు ఎవరూ సంతకాలు చేయొద్దు. టిడిడిపి అధికారంలోకి వచ్చిన మోటార్లకు మీటర్లు ఏర్పాటుచేసే విధానాన్ని రద్దుచేస్తాం. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఝలక్ ఇచ్చారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అన్న జగన్ 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు.
బిసిల కోసం ప్రత్యేక చట్టం తెస్తాం!
బీసీల బ్యాక్ బోన్ విరిచేసింది వైసీపీ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసారు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం.
కియా కారు చూస్తే గుర్తొచ్చేది చంద్రబాబే!
కియా కారు చూస్తే అనంతపురం గుర్తు వస్తుంది. దటీజ్ చంద్రబాబు గారు. డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు ఇలా ఏమి చూసినా చంద్రబాబు గారు గుర్తు వస్తారు. జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అనంతపురం కి నువ్వు తెచ్చిన ఒక్క కంపెనీ ఉందా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం నువ్వు చేశానని చెప్పగలవా? అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. వైసీపీ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే.
సత్యసాయి ప్రాజెక్టును దత్తత తీసుకుంటా!
సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయ్యి అనేక గ్రామాలకు త్రాగునీరు అందించే పథకాన్ని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసింది. కనీసం విద్యుత్ బిల్లులు కట్టడం లేదు, కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని సక్రమంగా నడిపించి గ్రామాలకు త్రాగునీరు అందిస్తాం. ఈ ప్రాజెక్టు ను నేను దత్తత తీసుకుంటాను. అనంతపురం లో ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అందించే బాధ్యత నాది. పుట్టపర్తి టౌన్ లో ప్రతి ఇంటికీ త్రాగునీరు అందించేందుకు టిడిపి హయాంలో 100 కోట్ల రూపాయిలతో ప్రాజెక్టు పనులు ప్రారంభించాం. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేసి రివర్స్ టెండరు ద్వారా వేరే కంపెనీకి అప్పగించారు. ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోవడం వలన పనులు జరగలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే ప్రాజెక్టు పూర్తిచేస్తాం.
హామీలన్నీ గాలికొదిలారు!
జగన్, పుట్టపర్తికి ఇచ్చిన హామీలు గుర్తుచేస్తాను. పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 193 చెరువులకు నీరిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు దాని ఊసే ఎత్తలేదు. రెండేళ్ల కిందట ఓ జీవో విడుదల చేశారు. 864 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు. ఆ రోజు స్థానిక చేసిన హడావిడి మాములుగా లేదు. కొన్ని లక్షలు ఖర్చుచేసి పెద్ద ర్యాలీ చేశారు. ఇక ప్రాజెక్టు కట్టేసినట్లే అని ప్రజలంతా అనుకున్నారు. కాని రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. జగన్ రెడ్డి పుట్టపర్తికి వచ్చినపుడు మరో హామీ కూడా ఇచ్చారు. పుట్టపర్తిని అధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగా కూడా డెవలప్ చేస్తానన్నారు. చిత్రావతిలో, బుక్కపట్నం చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టపర్తికి వచ్చింది లేదు.. నిధులు ఇచ్చింది లేదు. బుక్కపట్నం మండలంలోని మారాల జలాశయాన్ని 0.5 టీఎంసీల కెపాసిటీతో 2018లోనే చంద్రబాబునాయుడు పూర్తి చేశారు. పాదయాత్రలో భాగంగా మారాల వచ్చిన జగన్ రెడ్డి కాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. నాలుగేళ్లు గడిచిపోయింది. ఇప్పటివరకు ఒక్క పని కూడా మొదలుపెట్టలేదు. జగన్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.
టిడిపి వచ్చాక వలసలను నివారిస్తాం!
పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రధాన సమస్య స్థానికంగా ఉపాధి అవకాశలు లేకపోవడం. ఓడీసీ, నల్లమాడ, అమడగూరు మండలాల నుంచి పెద్దఎత్తున కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇక్కడి నుండి కేరళకు వెళ్లిన కొందరు అక్కడ బిక్షాటన చేసి బతుకుతున్న దౌర్బగ్యం. ఈ పరిస్థి మారాలంటే నియోజకవర్గంలో పెద్దఎత్తున పరిశ్రమలు రావాలి. టిడిపి అధికారంలోకి రాగానే పుట్టపర్తి చుట్టూ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తాం. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి లేకుండా చేస్తాం. పుట్టపర్తి నియోజకవర్గంలో అన్ని రకాల పంటలు పండించేందుకు అనువైన భూములు ఉన్నాయి. అయితే సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హంద్రీనీవా ద్వారా చెరువు నింపి ఉంటే రైతులు బాగుపడేవారు. అయితే పైనున్న టిడిపి హయాంలోనే రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద చెరువైన బుక్కపట్నం చెరువుకు నీరిచ్చాం. హంద్రీనీవా ప్రధాన కాలువ పూర్తి చేశాం. మళ్లీ అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి పుట్టపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇస్తున్నా. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసి ఏడాది కావొస్తోంది. సత్యసాయి ట్రస్టు పుణ్యమా అని బిల్డింగులన్ని ఉచితంగా వచ్చేశాయి. కాని జిల్లా కేంద్రంలో ఏ ఒక్క డిపార్ట్ మెంట్లోనూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. చాలా డిపార్ట్ మెంట్లలో ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతులు కల్పిస్తాం.
యువనేత లోకేష్ ను కలిసిన లారీడ్రైవర్లు, క్లీనర్ల సంఘం ప్రతినిధులు
పుట్టపర్తి నియోజకవర్గం ఇనగలూరులో తెలుగు రాష్ట్ర భారీవాహనాల డ్రైవర్లు, క్లీనర్ల సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. ట్రిప్ షీట్ విధానాన్ని దేశం మొత్తం కంప్యూటీకరించాలి. సరుకు రవాణా ఎక్కడినుంచి ఎక్కడకు అనే విషయాన్ని అందులో పొందుపర్చాలి. డ్రైవర్ లైసెన్సు నంబర్, క్లీనర్ గుర్తింపుకార్డు ప్రతి ట్రిప్ షీట్ లో నమోదుచేయాలి. కిరాయిలో 1శాతం డ్రైవర్లు, క్లీనర్ల సంక్షేమ నిధికి ట్రాన్స్ పోర్టు కంపెనీ లేదా యజమాని ఆన్లైన్ లోనే చెల్లించే విధానాన్ని తీసుకురావాలి. ప్రభుత్వం డీజిల్ అమ్మకాలపై ప్రతిలీటరుకు 50పైసలు డ్రైవర్లు, క్లీనర్ల సంక్షేమనిధికి జమచేయాలి. భారీవాహనాల అమ్మకాలపై 1శాతం పన్నును డ్రైవర్లు, క్లీనర్ల సంక్షేమానికి కేటాయించాలి. సంక్షేమనిధి ద్వారా డ్రైవర్లు, క్లీనర్లకు రిటైర్ మెంట్ నాటికి పిఎఫ్, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఒకవేళ విధినిర్వహణలో లేదా అకస్మాత్తుగా డ్రైవర్, క్లీనర్ మరణిస్తే వారి కుటుంబసభ్యులకు పెన్షన్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. భారీవాహనాలు ప్రమాదానికి గురైనపుడు అంగవైకల్యం సంభవిస్తే రూ.5లక్షలు, మరణిస్తే రూ.20లక్షలు ప్రమాద బీమా చెల్లించాలి. ఇందుకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం సంబంధిత వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియంతోనే కలిపి ఉండేలా చర్యలు తీసుకోవాలి.
యువనేత నారా లోకేష్ స్పందిస్తూ….
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర వహించే రవాణా రంగాన్ని ముఖ్యమంత్రి నిర్వీర్యం చేశారు, దేశంలో మరెక్కడా లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేయడంతోపాటు పన్నులను కూడా భారీగా పెంచేశారు. పన్నులమీద పన్నులు పెంచేయడంతో చాలా ప్రాంతాల్లో ఓనర్లు వాహనాలను అమ్మేసి డ్రైవర్లుగా మారే పరిస్థితి నెలకొంది. టిడిపి అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేందుకు చర్యలు చేపడతాం. డ్రైవర్లు, క్లీనర్ల సంక్షేమానికి ప్రత్యేక సంక్షేమనిధిని ఏర్పాటుచేసి చంద్రన్న బీమా తరహాలో బీమా సౌకర్యం కల్పిస్తాం. రవాణారంగాన్ని తిరిగి బతికించేందుకు తెలుగుదేశం పార్టీ అధికరంలోకి వచ్చాక అన్ని చర్యలు తీసుకుంటాం.
లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించిన రైతులు
పుట్టపర్తి నియోజకవర్గం గాజుకుంటపల్లిలో రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి ఉండగా రైతులకు రుణమాఫీ, రైతురథం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ జలసిరి, సబ్సిడీపై ఎరువులు, పురుగుమందులు అందించేవారు. అకాలవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, పరిహారం, సున్నా వడ్డీ వంటివాటితో రైతులను ఆనాడు ఆదుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమానికి గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలన్నీ నిలిపివేసి తీరని అన్యాయం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు, రైతు భరోసా కేంద్రాలు ఏవిధంగానూ ఉపయోగపడటం లేదు. ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి సరిగా డబ్బు చెల్లించడం లేదు. మోటార్లకు మీటర్లు బిగించేందుకు సంతకాలు చేయాలని వత్తిడితెస్తూ మా మెడకు ఉరితాడు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. పంటలకు ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ కేవలం 20శాతం మందికి మాత్రమే ఇస్తున్నారు. గతంలో హంద్రీనీవా కాల్వల ద్వారా నియోకవర్గంలో 30శాతం చెరువులు నింపారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, స్ప్రింకర్లు ఇవ్వడం లేదు, అన్నివిధాలా మమ్మల్ని నట్టేట ముంచారు.
యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో 70శాతం మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయరంగాన్ని ముఖ్యమంత్రి వెన్నువిరిచారు. ముఖ్యంగా రాయలసీమ రైతాంగానికి గతంలో 90శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందించగా, ప్రస్తుత ప్రభుత్వం ఆ సబ్సిడీని పూర్తిగా రద్దుచేసింది. రైతుల గిట్టుబాటు ధర కోసం రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని చెప్పిన సిఎం… నాలుగేళ్లయినా ఇందుకోసం ఒక్కరూపాయి ఖర్చుచేసిన పాపాన పోలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రైతులు పండించే అన్నిరకాల పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటాం. రైతుల సంక్షేమం కోసం గతంలో అమలుచేసిన పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం.
లోకేష్ ను కలిసిన మైదాన ప్రాంత గిరిజనులు
పుట్టపర్తి నియోజకవర్గం ఓబుల దేవరచెరువులో మైదాన ప్రాంత గిరిజనులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. రాష్ట్రంలో 60శాతం మంది గిరిజనులు మైదాన ప్రాంతంలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎస్టీలకు కేటాయించిన 1 పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలు ఏజన్సీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు స్థానం కూడా లేదు. దీనివల్ల మైదాన ప్రాంతంలోని గిరిజనుల సమస్యలను చట్టసభల్లో చర్చించే అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో నివసించే గిరిజనులు (సుగాలీలు, ఎరుకల, యానాది) అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎక్కువమంది గిరిజనులు కేరళ, ముంబయ్, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వలసవెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాద వశాత్తు చనిపోతే కనీసం శవాన్ని కూడా తెచ్చుకోలేని దుర్భరస్థితిలో గిరిజనులు ఉన్నారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మైదాన ప్రాంతం నుంచి ఒకరికి అవకాశం కల్పించాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గిరిజన బిడ్డలు చదువుకోవడానికి సిబిఎస్ఇ సిలబస్ తో పాఠశాలను, పాలిటెక్నిక్, గురుకుల పాఠశాలను ఏర్పాటుచేయాలి. వ్యవసాయరంగంలో అమలుచేసే పథకాల్లో గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించాలి. గిరిజనుల్లో ఉన్న అన్ని తెగల భాష, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో మొట్టమొదటిగా ఐటిడిఎలు ఏర్పాటుచేసి గిరిజనుల సంక్షేమానికి పెద్దఎత్తున కార్యక్రమాలు అమలుచేసిన ఘనత అన్న ఎన్టీఆర్ కే దక్కుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక గిరిజనుల సంక్షేమానికి ఉద్దేశించిన వేలకోట్ల సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించి ద్రోహం చేశారు. మైదాన ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషిచేస్తాం. మైదాన ప్రాంతంలో గిరిజనుల జనాభాను పరిశీలించి ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేస్తాం. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషిచేస్తాం. రాబోయే ఎన్నికల్లో చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.
యువనేతను కలిసిన శ్రీ సత్యసాయి జిల్లా ముస్లిం ప్రతినిధులు
శ్రీ సత్యసాయిజిల్లా ముస్లిం మైనారిటీల ప్రతినిధులు ఓడీసీలో యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు అమలుచేసిన సంక్షేమ పథకాలన్నింటినీ వైసిపి ప్రభుత్వం రద్దుచేసింది. జగన్మోహన్ రెడ్డి ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలైన ఆ ఊసేలేదు. దుల్హాన్ పథకం కింద పేద ముస్లింల వివాహానికి రూ.50వేల నుంచి లక్షకు పెంచుతానని చెప్పి చెయ్యలేదు. పదోతరగతి పాసైన వారికి మాత్రమే ఇస్తామంటూ కొర్రీలు పెడుతున్నారు. వైఎస్సార్ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన హజ్ హౌస్ ను వైసిపి పాలనలో పాడుబెట్టారు. ప్రతి మండలంలో ముస్లిం విద్యార్థుల కోసం ఉర్దూ పాఠశాల నిర్మించండి. పుట్టపర్తి పంచాయితీలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన షాదీ మహల్ కు బాత్రూమ్స్, విద్యుత్, అండర్ గ్రౌండ్ డ్రైనేజి సౌకర్యం కల్పించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. షాదీ మహాల్ లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.25లక్షలు కేటాయించి ఉపయోగంలోకి తేవాలి. టిడిపి ప్రభుత్వం వచ్చాక పేద ముస్లింలకు రంజాన్ తోఫాను పునరుద్దరించండి. వైసిపి ప్రభుత్వం వచ్చాక వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఖబరిస్తాన్ లకు ప్రహరీగోడలు లేక ఆక్రమణలకు గురవుతున్నాయి. టిడిపి ప్రభుత్వం వచ్చాక భద్రత కల్పించండి. మసీదుల మరమ్మతులకు స్పెషల్ గ్రాంటు మంజూరు చేయండి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
దేశంలోనే ముస్లిం మైనారిటీలకు మొట్టమొదటిసారిగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి సంక్షేమానికి కృషిచేసింది అన్న ఎన్టీఆర్. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుచేసి మైనారిటీ సోదరులకు అండగా నిలుస్తాం. కడపలో హజ్ హౌస్, పుట్టపర్తిలో షాదీ ఖానాలకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి వినియోగంలోకి తెస్తాం. ముస్లింలకు గతప్రభుత్వం అమలుచేసిన పథకాలన్నింటినీ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్దరిస్తాం. ముస్లిం సోదరులంతా తిరిగి చంద్రన్నను సిఎం చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.
*యువనేతను కలిసిన సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మకులు*
*ప్రాజెక్టును దత్తత తీసుకుని మరింత విస్తరిస్తానని యువనేత హామీ*
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న కార్మికులు యువనేత నారా లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1995లో భగవాన్ సత్యసాయి బాబా ఏర్పాటుచేసిన సత్యసాయి వాటర్ వర్క్స్ లో 572మంది పనిచేస్తున్నాం. ఈ పథకం ద్వారా 725 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో అప్పట్లో సత్యసాయి వాటర్ బోర్డును ఏర్పాటుచేశారు. బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టి సంస్థ నిర్వహిస్తోంది. ఈ పథకం నిర్వహణకు సంబంధించి ఎల్ అండ్ టి సంస్థకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గత ఏడాది జూన్ నుంచి ఆ సంస్థ నిర్వహణ బాధ్యతనుంచి తప్పుకుంది. అప్పటినుంచి ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ప్రాజెక్టు మూసివేత దిశగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం 70గ్రామాలకు నీటిసరఫరా నిలిచిపోయింది.
చాలాచోట్ల పైప్ లైన్ల మరమ్మతులు, పంపుల మరమ్మతులు చేపట్టలేదు. కాలిపోయిన మోటార్లకు మరమ్మతులు లేవు. అటవీ ప్రాంతంలో ఉన్న పంప్ హౌస్ లకు ఏడాదికి పైగా విద్యుత్ సౌకర్యం కూడా లేదు. వాటర్ వర్క్స్ కార్మికులకు నెలలతరబడి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. కార్మికులకు ఈపిఎఫ్, ఈఎస్ఐ ఖాతాలకు 9నెలలుగా నిధులు జమచేయడంలేదు. చనిపోయిన, రిటైరైన కార్మికుల కుటుంబాలకు చాలాకాలంగా గ్రాట్యుటీలు పెండింగ్ లో ఉన్నాయి. డ్యూటీ సమయంలో ప్రమాదానికి గురైన కార్మికులకు ఎటువంటి బీమా సౌకర్యం లేదు. వేతనాల విషయంలో కనీస వేతన చట్టాన్ని అమలుచేయడం లేదు. ఎల్ అండ్ టి సంస్థ ప్రాజెక్టును నిర్వహిస్తున్న సమయంలో కార్మికులకు బోనస్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ సౌకర్యం కల్పించగా, ప్రస్తుతం అవన్నీ నిలిపివేశారు. సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలి. ప్రతినెలా సకాలంలో కార్మికులకు వేతనాలు అందేలా చూడాలి. విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రమాదబీమా అమలుచేయాలి. కార్మికులకు సంబంధించి ఈపిఎఫ్, ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించాలి. పదవీ విరమణ చేసిన, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు గ్రాట్యుటీ, గతంలో మాదిరి లీవ్ ఎన్ క్యాష్ మెంట్, బోనస్ సౌకర్యాలను పునరుద్దరించాలి.
*యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…*
ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది ప్రజల దాహార్తిని తీర్చడానికి వందలకోట్ల రూపాయలతో భగవాన్ సత్యసాయి ప్రాజెక్టును, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సత్యసాయి వాటర్ వర్క్స్ పథకాన్ని దత్తత తీసుకుంటా. సత్యసాయి తాగునీటి ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా నిర్వహించి, ప్రాజెక్టు పరిధిని మరిన్ని గ్రామాలకు విస్తరించేందుకు కృషిచేస్తాం. సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులకు అండగా నిలిస్తాం, అధికారంలోకి వచ్చాక వారి సేవలను వినియోగించుకుంటాం. సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తాం.
Also, read this blog: Reaching New Heights of Excellence in Yuvagalam
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh