Nara Lokesh Yuvagalam Padayatra

ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర, 59వరోజు ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో యాత్ర, అడుగడుగునా యువకుల కేరింతలు, మహిళల నీరాజనాలు ఎస్ కె యూనివర్సిటీ వద్ద యువనేతకు విద్యార్థుల సంఘీభావం నేడు అనంతపురం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర

ధర్మవరం/రాప్తాడు: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 59వరోజు (సోమవారం) ధర్మవరం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోలాహలంగా సాగింది. భారీ సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎస్ కె యూనివర్సిటీ వద్ద యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. యువనేతపై పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ధర్మవరం నియోజకవర్గం ముష్టూరు క్యాంప్ సైట్ లో సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో సుమారు వెయ్యిమందికి పైగా అభిమానులతో ఫోటోలు దిగిన యువనేత… అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా  దారిపొడవునా యువతీయువకులు కేరింతలు కొడుతూ యువనేతకు ఆహ్వానం పలకగా, మహిళలు నీరాజనాలతో స్వాగతించారు. ముష్టూరులో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. సంజీవపురంలో ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఈ ప్రాంత సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుని యువగళానికి సంఘీభావం తెలిపారు. మధ్యాహ్నం కృష్ణంరెడ్డిపల్లి భోజన విరామ స్థలంలో మహిళలతో ముఖాముఖి సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. భోజన విరామానంతరం రాప్తాడు నియోజకవర్గంలో సాగిన యువగళం పాదయాత్రకు అడుగడుగునా అనూహ్య స్పందన లభించింది. కృష్ణంరెడ్డిపల్లి, ఇటుకులపల్లిలో వేలాదిగా ప్రజలు రోడ్లవెంట నిలబడి యువనేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఎస్ కె యూనివర్సిటీ వద్ద పెద్దఎత్తున విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పెద్దఎత్తున ప్రధాన రహదారిపైకి వచ్చి యువనేతకు సంఘీభావం తెలిపారు. పూల వర్షంతో లోకేష్ కు స్వాగతం పలికారు. ఎఐఎస్ఎఫ్ విద్యార్థికి సంఘానికి చెందిన ప్రతినిధులు యునేతను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు అండగా నిలుస్తామని చెప్పి అభివాదం చేసి ముందుకు సాగారు.  అనంతరం రాప్తాడు పంచాయితీ పనగల్ రోడ్డు సమీపాన విడిది కేంద్రానికి చేరుకున్నారు. యువగళం పాదయాత్ర 60వరోజు అనంతపురం నగర పరిధిలో కొనసాగనుంది.

గుడ్ మార్నింగ్ కేటు… నీ రూటే సపరేటు! అక్రమ ఇసుక టిప్పర్ ను చూసి యువనేత సెటైర్లు

ధర్మవరం ఎమ్మెల్యే అక్రమాల పుట్ట తవ్వేకొద్దీ బయటపడుతోంది. యువనేత లోకేష్ సోమవారం నాటి పాదయాత్ర దారిలో చిత్రావతినది నుంచి ఎమ్మెల్యే అక్రమంగా తరలిస్తున్న ఇసుకలారీ చూసి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతీరోజూ ధ‌ర్మవ‌రం వీధుల్లో నీ యాక్టింగ్ మా మంగ‌ళ‌గిరి  క‌మ‌ల్ హాస‌న్‌ని మించిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఏ అక్రమం అడ్రస్ లాగినా నీ ద‌గ్గరే తేలుతోంది. ఏ క‌బ్జా  క‌దిపినా స్పష్టం అవుతోంది. చిత్రావ‌తి న‌ది ఉప్పల‌పాడు రీచ్ నుంచి త‌ర‌లించే టిప్పర్లన్నీ కేటువేనంటున్నారు. మ‌న గుడ్ మార్నింగ్ షూటింగ్‌లో ఎర్రగుట్ట క‌బ్జా, చెరువు పూడ్చి ఫాంహౌస్ క‌ట్టుకోవ‌డం, వంద‌ల ఎక‌రాల క‌బ్జా, చిత్రావ‌తి న‌ది నుంచి ఇసుక మాఫియా ఎపిసోడ్ల స్కిట్ల షూట్‌కి ఎప్పుడూ ప్లాన్ చేయ‌లేదా అంటూ చురకలంటించారు.

సైబర్ క్రైమ్ వ్యవస్థ బలోపేతంతో మహిళలకు రక్షణ మహిళలపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తేస్తాం! మహిళలను మోసగిస్తున్న రెండుబటన్ల సిఎం నిజమైన సంక్షేమం ఇచ్చిందెవరో ఆలోచించండి ప్రభుత్వాలు మారిన పరిశ్రమలు పోకుండా చట్టం అధికారంలోకి రాగానే కెజి టు పిజి సిలబస్ మార్పు మహిళలతో ముఖాముఖిలో యువనేత లోకేష్

రాప్తాడు: వైసీపీ పాలనలో అక్రమ కేసులకు ఎవరికీ మినహాయింపులేదు. హక్కుల కోసం పోరాడడం మీ హక్కు. గతంలో ఏ ప్రభుత్వమూ హక్కుల కోసం పోరాడిని మహిళలను ఈ విధంగా ఇబ్బందిపెట్టలేదు. TDP అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లోనే మీపై పెట్టిన కేసులను రద్దు చేస్తామని  టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గం కృష్ణంరెడ్డిపల్లిలో నిర్వహించిన మహిళలతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… కేసులకు ఎవరూ భయపడొద్దు. జాకీ కోసం పోరాడిన వారి పై వైసిపి ప్రభుత్వం పెట్టిన కేసులు మాఫీ చేస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చాక సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేసి మహిళలపై నేరాలను అరికడతాం. సైబర్ నేరాలపై చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమార్లు చర్చించారు. సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు అనేక రకాలుగా రక్షణ చర్యలను చేపట్టారు.మహిళలను బెదిరించి డబ్బులు లాక్కోవడం, వేధింపులకు పాల్పడటం వంటి చర్యలపై చంద్రబాబు ముందస్తు చర్యలు తీసుకున్నారు.  అవన్నీ నేడు వైసీపీ గాలికొదిలేశారు. సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని పూర్తిగా పాడుబెట్టారు. దిశ చట్టం పెద్ద మోసం. అసలు చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడలేదు.

నేను నమ్మింది అంబేద్కర్ రాజ్యాంగం!

నేను అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని నమ్ముకున్నాను.  వైసీపీ పాలనలో నాపై 20కేసులు పెట్టారు. అమరావతిలో మహిళా రైతులను పోలీసులు బూటుకాళ్లతో తన్నారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించారు.  రాప్తాడు ఎమ్మెల్యే, ధర్మవరం ఎమ్మెల్యే భూకబ్జాలపై సిట్ వేస్తాం.  మహిళలు మాట్లాడటం మొదలు పెడితే తాడేపల్లి ప్యాలస్ పిల్లి రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయం. మహిళల కోసం నాడు, నేడు, ఎప్పుడూ మహిళల రక్షణ కోసం పనిచేసింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుని, మీ భద్రతకు మీరే పునాది వేసుకోవాలని కోరుతున్నా.

వైసీపీ పాలనలో దెబ్బతిన్న ఎపి బ్రాండ్ ఇమేజ్!

ఇప్పుడు వైసీపీ పాలన కారణంగా ఏపి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. ఆయన సిఎం అయిన వెంటనే కంపెనీలను బెదిరించి పక్క రాష్ట్రానికి తరిమేశాడు. అమరరాజా, రిలయన్స్, జాకీ ఇలా అనేక కంపెనీలు వేధింపులు తట్టుకోలేక పారిపోయాయి. కేవలం జాకీనే కాకుండా జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీ నుండి అమర్ రాజా, రిలయన్స్ వంటి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.  ఫాక్స్ కాన్ అనే సెల్ ఫోన్ సంస్థ టిడిపి హయాంలో 14వేలమంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించింది. ఇటీవల ఆ సంస్థ లక్ష ఉద్యోగాలు కల్పించే యూనిట్లను తెలంగాణా, కర్నాటకకు తరలించింది. 6 వేల మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చే జాకీ పరిశ్రమను  రాప్తాడు ఎమ్మెల్యే 15 కోట్లు డిమాండ్ చేసి పక్క రాష్ట్రానికి తరిమేశాడు. ఇప్పుడు ఆ భూమి ఎమ్మెల్యే కబ్జా చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక రాప్తాడుకి జాకీతోపాటు మరో పెద్ద సంస్థ ని తీసుకొస్తాం. కియా కూడా ఫేక్ కంపనీ అని జగన్ అన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చి ఆ మాట అనే దమ్ము ఉందా? టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వాలు మారినా వచ్చిన పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా బలమైన చట్టం తీసుకొస్తాం.

మహిళలను మోసగిస్తున్న రెండు బటన్ల సిఎం!

రెండు బటన్ల సిఎం… బల్ల పైన బటన్ నొక్కితే పది రూపాయిలు మీ అకౌంట్ లో పడతాయి. బల్ల కింద ఉన్న బటన్ నొక్కితే 100 రూపాయలు మీ అకౌంట్ నుండి పోతాయి. 45 ఏళ్లకే పెన్షన్ అని బిసి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అని వైసీపీ మోసం చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తరువాత ఓట్లు అడుగుతా అని ఇప్పుడు విషం కంటే ప్రమాదకరమైన మందు తయారు చేసి అమ్ముతున్నారు. మద్యం అమ్మకాలను ఆదాయంగా చూపించి 25 వేల కోట్ల అప్పు తెచ్చారు వైసీపీ. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అని మోసం చేశారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలను రద్దుచేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మహిళలంతా ఆలోచించాలి…130 సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ అమలు చేసింది..వైసీపీ అధికారంలోకి వచ్చాక 100కు పైగా సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడు. సంక్షేమాన్ని ఏపీకి పరిచయం చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం, స్వర్గీయ ఎన్టీఆర్. వైసీపీ వాళ్లు చెప్పే అబద్దాలను ఎవరూ నమ్మొద్దు…నిజమైన సంక్షేమాన్ని ఎవరు అందిస్తారు, ఎవరు అందించారు? అనేది మీరే ఆలోచించాలని కోరుతున్నాం.

చంద్రబాబు అధికారంలోకి వస్తేనే సంక్షేమం

వైసీపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచారు. ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి నంబర్ 1. ఇక ఇంటి పన్ను పెంచారు. చెత్త పై పన్నేసారు. వైసీపీ బాదుడు కి ప్రజలు బ్రతకలేని పరిస్థితి వచ్చింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులను ప్రక్షాళన చేస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తాం. 77 జిఓ తీసుకొచ్చి పీజీ చదువుతున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కాలేజీలకు ఫీజులు చెల్లించి అందరికీ సర్టిఫికేట్లు ఇప్పిస్తాం.

టిడిపి హయాంలోనే మహిళా సంక్షేమం

మహిళల స్వయం ఉపాధికి డ్వాక్రా  ఏర్పాటు చేసింది చంద్రబాబు గారు.  టిడిపి హయాంలో 8,500 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేశాం. పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా మహిళలకు 10,000 కోట్లు ఇచ్చాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మహిళా ఆటో డ్రైవర్ల ను ఆదుకుంటాం. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. పన్నులు తగ్గిస్తాం. ఫైన్ల వేధింపులు లేకుండా చేస్తాం.  పండుగ కానుకలు, పెళ్లి కానుక, చంద్రన్న భీమా, పెన్షన్ 2 వేలకు పెంపు, అన్న క్యాంటీన్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి. రాష్ట్ర విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పిస్తే వాళ్లు ప్రపంచంలోనే గొప్ప శక్తిగా తయారవుతారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిలిపేయడంతో  రాయలసీమలోనే 30శాతం కాలేజీలు, స్కూళ్లు మూతపడ్డాయి. మూసేసిన పాఠశాలను తెరిపించి సర్కారీ విద్యను బలోపేతం చేస్తాం. కేజీ టు పీజీ సిలబస్ ను మారుస్తాం. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సిలబస్ తయారు చేసి, దానిపై ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తాం. 

సమావేశంలో మహిళలు మాట్లాడుతూ…

జాకీ పరిశ్రమ వలన 6 వేల మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వైసిపి ప్రభుత్వం వలన ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. టిడిపి అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ కంపెనీని తీసుకురండి. జాకీ కోసం పోరాడినందుకు 100 మంది మహిళల పై కేసులు పెట్టేవారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుకాక కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తానని వైసిపి మోసం చేశారు. ఆటో డ్రైవింగ్ చేసుకొని జీవిస్తున్న మహిళలకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. వాహన మిత్ర రాలేదు. రజకులకి ఇచ్చే సాయం కూడా ప్రభుత్వం నిలిపివేసింది.

మాజీమంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ…

ప్రభుత్వం అరాచకపాలనతో రాప్తాడు నియోజకవర్గంలో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 10 వేల మందితో జాకీ సంస్థ కోసం పోరాడితే మహిళల పై కేసులు పెట్టి వేధించారు. మహిళలు అని కూడా చూడకుండా అర్థరాత్రి పూట మహిళలను అరెస్టు చేసి స్టేషన్లలో పెట్టారు. ప్రశ్నించిన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారు. రాప్తాడులో వైసీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కొంతమంది ఎస్ఐలు, సిఐలు ఎమ్మెల్యే తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. అటువంటి అధికారులపై టీడీపీ అధికారంలోకి వచ్చాక తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రాప్తాడు నియోజకవర్గంపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాం. చంద్రబాబు సీఎం అయితేనే అన్ని వర్గా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్నాం.

ఓ తల్లిగా బాధపడుతున్నా!

రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఎండను సైతం లెక్కచేయకుండా యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ కు మహిళలందరి తరుపున లోకేష్ కు ధన్యవాదాలు, అభినందనలు. కాళ్లకు బొబ్బలు వచ్చినా, వాటిని లెక్క చేయకుండా మండుటెండలో ముందుకే కొనసాగుతున్నారు. లోకేష్ ఎండలో నడుస్తుంటే ఓ తల్లిగా నాకు చాలా బాధగా ఉంది. సుఖసంతోషాలను పణంగా పెట్టి రాష్ట్రం కోసం ప్రజాక్షేత్రంలోకి రావడం చాలా అభినందనీయం.

మహిళల ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

గౌతమి: టీడీపీ పాలనలో రాప్తాడుకు జాకీ పరిశ్రమను తెచ్చారు. ఆ పరిశ్రమ ఇక్కడ నిర్మించి ఉంటే 6,450మందికి ఉద్యోగాలు వచ్చేవి. ఈ కంపెనీ ఇక్కడి నుండి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింది. టీడీపీ వచ్చాక మా రాప్తాడుకు మళ్లీ జాకీలాంటి పరిశ్రమలు తెండి.

రామాంజమ్మ: జాకీ పరిశ్రమ కోసం మేం పోరాడితే 100మంది రాప్తాడు మహిళలపై అక్రమ కేసులు పెట్టారు. మీరు అధికారంలోకి వచ్చాక మా కేసులను మాఫీ చేయండి.

గీత: ఎంబీఏ 2021లో పూర్తయ్యింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో ఫీజులు కట్టలేకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వలేదు. పదో తరగతి నుండి ఎంబీఏ సర్టిఫికెట్లు వరకు కాలేజీలోనే ఉండిపోయారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు సర్టిఫికెట్లు ఇప్పించండి.

గౌతమి(హిజ్రా): గత పాలనలో మాకు పెన్షన్లు ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెన్షన్లను రద్దు చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మా పెన్షన్లు పునరుద్దరించండి.

అనురాధ: నేను కాంట్రాక్టు పద్ధతిలో ఎస్ కేయూలో ఉద్యోగం చేశాను. వైసిపి ప్రభుత్వం వచ్చాక నన్ను తొలగించి నోటికాడ కూడు లాగేశారు.

శ్రీలేఖ: మహిళల సాధికారత, భద్రత కోసం 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకోండి.

సుజాత: టీడీపీ పాలనలో మహిళలకు షీ ఆటోలు సబ్సిడీ మీద ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు మహిళలకు ఎటువంటి ప్రోత్సాహం లేదు. మాకు గత పాలనలో అమలు చేసిన పథకాలను మళ్లీ అధికారంలోకి వచ్చాక అమలు చేయండి.

నాగేశ్వరమ్మ: మహిళలు, ముఖ్యంగా మైనర్లపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక వీటిని నిరోధించడానికి మీరు అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తీసుకోండి.

అనిత: అమ్మఒడి రూ.15వేలు అన్నారు. ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు తగ్గిస్తూ వస్తున్నారు. మీరు అధికారంలోకి వస్తే పేద విద్యార్థులను ఆదుకోండి.

స్రవంతి: మహిళలపై సైబర్ నేరాలు జరుగుతున్నాయి. దేశంలో ఏపీ 3వ స్థానంలో ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మహిళలకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టండి.

యువనేతను కలిసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం సంజీవపురంలో ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు యువనేత లోకేష్ ను కలిశారు. అనంతపురానికి టిడిపి హయాంలో ఆటోమొబైల్ పరిశ్రమలు, టెక్స్ టైల్స్ పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించారు. అదే విధంగా ఐటి కంపెనీలు కూడా అనంతపురానికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. మన రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు లేక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నాం.  ఉమ్మడి అనంతపురం జిల్లాలో టాలెంట్ ఉన్న యువత ఉన్నారు. పైగా ఐటి సంస్థల ఏర్పాటుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి.

*యువనేత లోకేష్ మాట్లాడుతూ….*

టిడిపి హయాంలో ఐటి కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాం. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకను కాదని మీ రాష్ట్రానికి ఎందుకు రావాలి అని అడిగే వారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పేవాడిని, మీ కంపెనీల్లో పనిచేస్తున్న ఎక్కువ శాతం మంది ఏపి వాళ్ళే ఉన్నారు కాబట్టి, మా రాష్ట్రంలో సెంటర్ ఏర్పాటు చెయ్యాలని అడిగేవాడిని. కంపెనీ ఏర్పాటు కు కావాల్సిన అనుమతులు, రాయితీలు అన్ని వేగంగా ఇవ్వడం వల్లే హెచ్ సిఎల్, జొహో, కాండ్యుయెంట్, పై డేటా సెంటర్ లాంటి పెద్ద కంపెనీలు వచ్చాయి. టిడిపి హయాంలో భౌగోళికంగా ఉన్న ప్రయోజనాల దృష్ట్యా ఒక్కో జిల్లా కి సంబంధిత పరిశ్రమలు తీసుకొచ్చాం. రాయలసీమ ను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా ప్రమోట్ చేసాం. ఉత్తరాంధ్ర లో ఎక్కువగా ఐటి కంపెనీలను ప్రోత్సహించాం. టిడిపి గెలిచిన మొదటి వంద రోజుల్లోనే పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నిరకాల పరిశ్రమలను పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొస్తాం. బాబు అంటే బ్రాండ్ హైదరాబాద్ లో చేసి చూపించాం. ఐటిలో ఎపిని ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలబెడతాం.

యువనేతను కలిసి సమస్యలను విన్నవించిన రైతులు

ధర్మవరం నియోజకవర్గ మష్టూరులో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు యువనేతను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. గత మూడేళ్లుగా అతివృష్టి, అకాల వర్షాల కారణంగా వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు పెద్దఎత్తున నష్టపోయినా ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా పరిహారం ఇవ్వండి. ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి సకాలంలో డబ్బు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. క్రాప్ ఇన్సూరెన్స్, సబ్సిడీలు కేవలం 20శాతం మంది రైతులకు మాత్రమే అందుతున్నాయి. సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లు, సున్నా వడ్డీ అమలుచేయడం లేదు. పేరుకే రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుచేశారు. రైతులకు ఎరువులు, పురుగుమందులు, సబ్సిడీపై యంత్రపరికరాలు అందించడం లేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగానికి గత ప్రభుత్వం అమలుచేసిన రాయితీలన్నీ పునరుద్దరించండి. వైసిపి ప్రభుత్వం బలవంతగా అమలుచేస్తున్న మోటార్లకు మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించాలి. వ్యవసాయానికి గ్రామీణ ఉపాధి పథకాన్ని అనుసంధానం చేయాలి. వ్యవసాయం చేసే రైతుల ఎడ్లబండ్ల కొనుగోలుకు 50శాతం సబ్సిడీ ఇవ్వాలి. రైతులకు రూ.3లక్షల వరకు సున్నావడ్డీ పథకాన్ని అమలుచేయాలి. పంటలు నిల్వచేసుకునేందుకు ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజి నిర్మించాలి. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. రైతులకు 10గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించాలి. చెరువుల కింద ఉన్న కాల్వల నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. 2000 సంవత్సరం వరకు రైతుల అధీనంలో ఉన్న అసైన్ మెంట్ భూములకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలి. చీని నిమ్మ, మామిడి రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలు అందించాలి.

*యువనేత లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో ముఖ్యమంత్రి తన అసమర్థ, చేతగాని విధానాలతో అన్నదాతలకు మరణశాసనం రాస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యల్లో దేశం మొత్తమ్మీద రాష్ట్రం 3వస్థానంలో ఉంది. మళ్లీ ఇప్పుడు మోటార్లకు మీటర్ల పేరుతో రైతాంగం మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నాడు. గతంలో రైతులపై రూ.70వేలు ఉన్న సగటు అప్పు… వైసిపి ప్రభుత్వం నిర్వాకం కారణంగా 2.5లక్షలకు పెరిగి రైతుల అప్పుల ఊబిలో కూరుకుపోయారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి ఉండగా రాయలసీమ రైతులకు 90శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేశాం. రైతులకు రుణమాఫీ అమలుచేయడమేగాక రాయితీపై యంత్రపరికరాలు, ఎరువులు, పురుగుమందులు అందజేశాం. రాష్ట్రంలో పంట పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేశాం.రైతుల సంక్షేమాన్ని కాంక్షించే చంద్రన్నను సిఎం చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

*యువనేతకు ఎస్ కె యూనివర్సిటీ విద్యార్థుల సంఘీభావం, సమస్యలపై లోకేష్ కు ఎఐఎస్ఎఫ్ ప్రతినిధుల వినతిపత్రం*

రాప్తాడు సమీపంలోని ఎస్ కె యూనివర్సిటీ వద్ద ఎఐఎస్ఎఫ్ కు చెందిన విద్యార్థులు యువనేత లోకేష్ కు సంఘీభావం తెలిపి, తమ సమస్యలు విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 5045 బోధన, బోధనేతర పోస్టులు భర్తీచేయాలి. విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దుచేసి పాతపద్ధతిలోని ఆయా యూనివర్సిటీల పరిధిలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలి. పిజి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ రద్దుచేస్తూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జిఓ నెం.77ని రద్దుచేసి పాత ఫీ రీఎంబర్స్ మెంట్ విధానాన్ని తీసుకురావాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.38 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. కరోనా కారణంగా 2019-21 నడుమ విద్యార్థులకు హాజరుశాతం తగ్గింది. ఈ సాకుతో విసి రామకృష్ణారెడ్డి 400మంది విద్యార్థులను డిటైన్ చేశారు. డిటైన్ చేసిన విద్యార్థులను యథావిధిగా కొనసాగించి పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలి. అర్హతలు లేకుండా విసిగా నియమితుడై నియంతలా వ్యవహరిస్తున్న విసి రామకృష్ణారెడ్డిని రీకాల్ చేయాలి.

*యువనేత లోకేష్ స్పందిస్తూ….*

రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో సొంత మనుషులను జొప్పించి ఉన్నత విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారు. జిఓ నెం.77తో పిజి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ రద్దుచేసి రాష్ట్రవ్యాప్తంగా 50వేలమంది పేదవిద్యార్థులకు వైసీపీ అన్యాయం చేశారు.  పిజి విద్యార్థులకు గొడ్డలిపెట్టులా మారిన జిఓ నెం.77ను రద్దుచేసి పాత ఫీ రీఎంబర్స్ మెంట్ ను పునురుద్దరిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయాలతో సంబంధం లేని ఉన్నత విద్యావంతులను విసిలుగా నియమిస్తాం. విద్యార్థులు వివిధ పోటీపరీక్షలకు శిక్షణ తీసుకునేందుకు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ను తిరిగి ప్రారంభిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. కరోనా సమయంలో హాజరుశాతం లేక డిటైన్ కు గురైన విద్యార్థుల అడ్మిషన్ పునరుద్దరించి పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తాం.

Also, read this blog: Lokesh’s Yuvagalam Padayatra A Journey for Progress

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *