రాయలచెరువులో పోటెత్తిన జనసంద్రం! తాడిపత్రిలో రెండోరోజు ఉత్సాహంగా యువగళం నేడు ఉమ్మడికర్నూలు జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళం
తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో వరుసగా రెండోరోజు కూడా యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 68వరోజు బుధవారం పసలూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. మండుటెండలో సైతం జనం యువనేతను కలిసేందుకు పోటీపడ్డారు. రోడ్లవెంట గంటలతరబడి యువనేత కోసం వేచిచూశారు. సాయంత్రం భోజన విరామానంతరం రాయల చెరువు చేరుకున్న యువనేతకు వేలాదిమంది ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల పైకి వచ్చారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగారు. యువనేత రాకతో రాయలచెరువు ప్రధాన రహాదారి కిక్కిరిసిపోయింది. అభిమానులు కేరింతలు కొడుతూ యువనేతను స్వాగతించారు. స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను యువనేత అడిగి తెలుసుకున్నారు. రాయలచెరువులో వైసీపీ నేతల అక్రమాలకు అంతులేకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. రాయలచెరువులోని మట్టిని అక్రమంగా వైసిపి నేతలు దోచుకుంటున్నారని స్థానికులు లోకేష్ దృష్టికి తెచ్చారు. ఉదయం కమ్మవారిపల్లిలో నిరుద్యోగ యువత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 23రోజులపాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో హోరెత్తించిన యువగళం పాదయాత్ర గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 23రోజుల పాటు 300కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కొనసాగింది.
యువనేత పాదయాత్రలో వ్యక్తమైన సమస్యలు:
పదెకరాల రైతును…అప్పులతోనే జీవితాన్ని లాగుతున్నా-సి.జనార్దన్ రెడ్డి, రావులొడుగు, పెద్దఒడుగూరు మండలం.
నేను పదిఎకరాల రైతును. ముగ్గురు బిడ్డలు ఉన్నారు. వ్యవసాయంలో ప్రతిఏటా నష్టాలే వస్తున్నాయి. అప్పలతోనే బతుకుబండి లాగాల్సి వస్తోంది. ఇప్పటివరకు రూ.8లక్షల అప్పు చేశాను. గతంలో డ్రిప్ పరికరాలు సబ్సిడీపై ఇచ్చేవారు. ఇప్పుడు రూపాయి సబ్సిడీ రావడం లేదు. నిన్ననే లక్షరూపాయలతో డ్రిప్ పైపులు కొన్నా. గతంలో చంద్రబాబు గారి హయాంలో రూ.50వేలు రుణమాఫీ అయింది.
కూలీపనులు చేసుకొని కుటుంబాన్ని నడుపుతున్నా-రామకృష్ణ గౌడ్ – కోనఉప్పలపాడు, తాడికిమండలం.
నాకు ఉన్న ఎకరన్నర పొలంలో నిమ్మచెట్లు పెట్టాను. గత ఏడాది మరో ఎకరన్నర తీసుకొని ఉల్లిపంట వేశాను. రూ.60వేలు నష్టం వచ్చింది. భార్య, ఇంటర్ చదివిన కొడుకు, నేను కూలీపనుల కెళ్లి జీవనం సాగిస్తున్నాం. ఆర్ డిటి స్వచ్చంద సంస్థవారు 3గేదెలు ఇస్తే వాటి ద్వారా కొంత ఆదాయం వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం చాలా కష్టం.
చంద్రబాబు వస్తేనే స్థానికంగా ఉద్యోగాలు – కిషోర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, కమ్మవారిపల్లి.
2020లో బి.టెక్ చదివాను. గతఏడాది ఎంబిఎ పూర్తిచేసి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. అనంతపురంలో ఎంబిఎ చదివితే పీజీకి ఫీజు రీఎంబర్స్ మెంట్ రాలేదు. మా గ్రామానికి చెందిన నాలాంటి వారు 35మంది హైదరాబాద్, బెంగుళూరు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాం. మళ్లీ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి స్థానికంగా ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబుగారే సిఎం కావాలి.
మహాత్మాగాంధీ పర్యటించిన నేల తాడిపత్రి
చింతల రమణ స్వామి దేవాలయం, బుగ్గ రామలింగేశ్వర స్వామి కొలువైన ప్రాంతం తాడిపత్రి. మహాత్మా గాంధీ పర్యటించిన పవిత్ర నేల తాడిపత్రి. దక్షిణ భారతదేశంలోనే పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచిన తాడిపత్రి మున్సిపాలిటీ కలిగిన నియోజకవర్గం. విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారిని బర్తరఫ్ చేసినప్పుడు పిడికిలి బిగించింది తాడిపత్రి. ఇంత గొప్ప నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
విషయం వీకు… పబ్లిసిటీ పీక్!
జగన్మోహన్ పబ్లిసిటీ మాత్రం పీక్స్. యువగళంలో వచ్చిన జనంతో తాడిపత్రి పోటెత్తింది. ఒక్క ఉదాహరణ చెబుతాను. రూ.వెయ్యి దాటిన ఏ జబ్బుకైనా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది అని ఫుల్ పబ్లిసిటీ ఇచ్చాడు. ఎక్కడైనా అమలు అవుతుందా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం దూది, మందులు కూడా లేవు. ఇక ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించక ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చెయ్యడం లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే డాక్టర్లను ఒత్తిడి చేసి దొంగ రిపోర్టులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. గ్రామాలను ఉద్ధరిస్తా అని బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు పంచాయతీ నిధులు మొత్తం కాజేసాడు. ప్రకాశం జిల్లా చినాంపల్లె వైసిపి సర్పంచ్ చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపాడు.
సంక్షేమ పథకాలు రద్దుచేసిన చరిత్ర జగన్ ది!
సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన హిస్టరీ మోహన్ ది. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్మోహన్. జగన్మోహన్ యువతని చీట్ చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు.
ప్రతిఏటా జాబ్ క్యాలెండర్!
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్మోహన్ మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.
రైతులను కోలుకోలేని దెబ్బతీశాడు
వైసీపీ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసాడు. జగన్మోహన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. వైసిపి బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. నేరేడు,చీనీ, సపోట, దానిమ్మ, మామిడి, అరటి, వేరుశనగ, టమాటో రైతుల్ని మేము ఆదుకుంటాం.
ఉద్యోగులు, పోలీసులకూ వేధింపులు
వైసీపీ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మీకు తెలియకుండా మీ వస్తువు దొంగిలిస్తే దొంగ అంటాం. ఏకంగా పోలీసుల డబ్బులే కొట్టేసాడు జగన్మోహన్. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు.
బిసిలు, మైనారిటీల బ్యాక్ బోన్ విరిచాడు!
పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం. దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది.
తాడిపత్రిని అభివృద్ధి చేసింది జెసి కుటుంబం
తాడిపత్రిని అభివృద్ధి చేసింది జేసి కుటుంబం. గతంలో పర్యటనకు వచ్చినప్పుడు మీ మున్సిపాలిటీ భవనం చూసి ఆశ్చర్యపోయాను. అభివృద్ధి లో జేసి ప్రభాకర్ రెడ్డి గారి రికార్డులు బ్రేక్ చెయ్యడం ఎవరి తరం కాదు. సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పార్కులు, ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి, ఎల్ఈడి విధి దీపాలు, స్కూల్స్, కాలేజీలు, రోడ్లు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జేసి ప్రభాకర్ రెడ్డి గారు. అభివృద్ధి లో తాడిపత్రి మున్సిపాలిటీ దరిదాపుల్లో కూడా మరో మున్సిపాలిటీ లేదు. సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ ప్రాజెక్టులు, గ్రానైట్ పరిశ్రమలు తెచ్చి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించింది జేసి ప్రభాకర్ రెడ్డి గారు. వేసవిలో కూడా తాడిపత్రి కి తాగునీటి కష్టాలు లేవంటే దాని వెనుక జేసి ప్రభాకర్ రెడ్డి గారి కష్టం కనిపిస్తుంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసింది, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ పంపు సెట్లు ఇచ్చి రైతుల్ని ఆదుకుంది టిడిపి ప్రభుత్వం. కానీ మీరు ఎం చేసారు? పాలిచ్చే ఆవుని వద్దనుకోని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. జేసి పాలనలో తాడిపత్రి ఎలా ఉంది? దున్నపోతు పాలనలో తాడిపత్రి ఎలా ఉంది?
జగన్ హామీలు ఏమయ్యాయి?
పాదయాత్ర లో భాగంగా తాడిపత్రి వచ్చిన జగన్ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తిచేస్తాం అని హామీ ఇచ్చాడు.పెండేకల్లు ప్రాజెక్టు నిర్మించి ఏళ్లు అవుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.122 కోట్లతో కాలువలు పూర్తి చేసి 18వేల ఎకరాలకు నీరు అందిస్తాం అన్నారు. కనీసం ఒక గంప మట్టి కూడా తియ్యలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. తాడిపత్రిలోని గ్రానైట్ పరిశ్రమలను ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. మూతబడిన పరిశ్రమలు తెరిపించి 20,000 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. కరెంటు చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. గ్రానైట్ బై రాయల్టీని తగ్గించి యజమానులను ఆదుకుంటామని చెప్పిన జగన్.. అవేవీ చేయకపోగా రివర్స్లో కరెంటు చార్జీలు పెంచారు. రాయల్టీ రెండింతలు పెంచారు. కరెంటు కోతలు విధించారు. కరెంటు కోతలతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. వందల మంది ఉపాధి కోల్పోయారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో రవాణా చార్జీలు భరించలేక వ్యాపారులు నష్టాలు మూటగట్టుకుని పరిశ్రమలను మోసేస్తున్నారు. జగన్ పాలనలో గ్రానైట్ పరిశ్రమ వెంటిలేటర్ మీద ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రానైట్ పరిశ్రమను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. పెంచిన రాయల్టీ, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్,డీజిల్ ధరలు అన్ని తగ్గిస్తాం. వేధింపులు లేకుండా వ్యాపారం చేసుకునే పరిస్థితి కల్పిస్తాం.
చేనేతలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
పాదయాత్రలో భాగంగా తాడిపత్రి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి చేనేత కార్మికుడికి సంవత్సరానికి 24 వేలు అందిస్తానని హామీ ఇచ్చాడు. అయితే అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత నేతన్న నేస్తం అంటూ పథకాన్ని ప్రారంభించాడు. కార్మికులకు కాకుండా సొంత మగ్గం ఉన్నవాళ్లకి మాత్రమే పథకం అంటూ ఫిట్టింగ్ పెట్టారు. టిడిపి ప్రభుత్వంలో చేనేత కార్మికులకు ఆదరణ పథకం ద్వారా పరికరాలు అందించాం. టిడిపి ప్రభుత్వంలో చేనేత ఉత్పత్తులపై ఒక్క శాతం కూడా పన్ను విధించలేదు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చేనేత ఉత్పత్తిపై 5 శాతం జీఎస్టీ విధించి చేనేతలను కోల్కోలేని దెబ్బ కొట్టాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత పై జీఎస్టీ ఎత్తివేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేతలకు చేనేత రుణమాఫీ కింద 110 కోట్ల రూపాయలు చెల్లించాం.
వైసిపి హయాంలో చేనేతల ఆత్మహత్యలు
వైసిపి ప్రభుత్వ హయాంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి పరిహారం అందలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎలా అయితే ఇచ్చామో అలానే యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ అందిస్తాం. టిడ్కొ ఇళ్ళు కేటాయిస్తాం. కామన్ వర్కింగ్ షెడ్లు నిర్మిస్తాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తాం. తాడిపత్రి చేనేతకు ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాం. చేనేత క్లస్టర్ కూడా ఏర్పాటు చేస్తాం. టిడిపి ప్రభుత్వంలో టిడ్కొ ఇల్లు 6300 మంజూరు కాగా 1800 ఇల్లు పూర్తీ చేయడం జరిగింది. వైసిపి ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కార్యకర్తల్ని వేధించిన ఎవరిని వదిలి పెట్టను. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అతి చేసిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం.
నాలుగేళ్ల పాలనలో రెడ్లపరువు తీసిన జగన్! వైసిపి పాలనలో రెడ్డి సామాజికవర్గీయులు బాధితులే తనను సిఎం చేసిన వారిని గాలికొదిలేశారు రెడ్డి సామాజివర్గీయులతో ముఖాముఖిలో లోకేష్
తాడిపత్రి: నాలుగేళ్ల పాలనలో వైసిపి రెడ్లపరువు తీశారని టిడిపి యువనేత నారా లోకేష్ తీవ్రంగా దుయ్యబట్టారు. అనంతపురంజిల్లా, తాడిపత్రి నియోజకవర్గం, తూట్రపల్లి గ్రామంలో రెడ్డి సామాజికవర్గంతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… రాజశేఖర రెడ్డి రాజకీయ చరిత్రలో ఏనాడూ రెడ్ల పరువును దిగజార్చలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక యువత భవిష్యత్తు సర్వనాశనం చేశాడు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి యువత భవిష్యత్తును 30ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు. రెడ్డి సామాజికవర్గం కూడా జగన్ చేతిలో బాధితులుగా మారారు. 2014-19 మధ్య జరిగిన పాలనలో ఏనాడూ అక్రమ కేసులు పెట్టలేదు. జగన్ చేతిలో తాడిపత్రిలోని రెడ్లు మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్లు మొత్తం బాధితులే. సీనియర్ నాయకులు జనార్థన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి లపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టారు. బంగారుపాళ్యంలో డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేయి పట్టుకుని దురుసుగా ప్రవర్తించడం చూసి నాకు చాలా కోపం వచ్చింది. వైసీపీ పాలనలో పెట్టిన ఒక్క కేసు కూడా నిలబడవు. ఎందుకంటే అవన్నీ అక్రమ కేసులే.
అక్రమ కేసులు మాఫీచేస్తాం!
మేం అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులన్నీ మాఫీ చేస్తాం. తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తాం. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారికి శిక్ష పడేలా చేస్తాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా జవహర్ రెడ్డి సహకారంతో అద్భుతంగా పనులు చేశాం. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రెడ్లు భుజానికెత్తుకున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టారు. కానీ సీఎం అయ్యాక పార్టీకి కష్టపడినవారిని వైసిపి గాలికొదిలేశాడు. కులం,మతం,ప్రాంతీయ తత్వాలకు అతీతంగా తెలుగువారి అభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశంపార్టీ పనిచేస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్టీఆర్ పై పోటీ చేశారు. కానీ ఏనాడూ దాడులు, కక్షలు, కార్పణ్యాలకు పోలేదు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబుపై కూడా ఏనాడూ వ్యక్తిగత దూషణలకు పోలేదు. జగన్ వచ్చా తాడిపత్రిలో ఏం జరుగుతుందో యావత్ రాష్ట్రమంతా చూస్తున్నారు.
ప్రత్యర్థి ఇళ్లకెళ్లి రెచ్చగొడుతారా?
ప్రత్యర్థి ఇంటికెళ్లి కూర్చుని రెచ్చగొట్టే ఫ్యాక్షన్ రాజకీయం రాష్ట్రమంతా చూసింది. గత చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. రాష్ట్రమంతా జగన్ చేతిలో అవమానాలు, దాడులు, హత్యలు, అక్రమ కేసులకు గురవుతున్నారు. తెలుగుదేశంపార్టీ వివిధ సామాజికవర్గాల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ల ద్వారా పనిచేశాం. వైసిపి చేతిలో కార్పొరేషన్లు కుదేలయ్యాయి. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి, కంపెనీ, పరిశ్రమ ఏదీ రాలేదు. రాష్ట్ర ప్రజలు బతుకుదెరువు కోసం పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. రాష్ట్రాన్ని కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకునేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరుతున్నా. మేం అధికారంలోకి వచ్చాక రెడ్డి కార్పొరేషన్ కు దామాషా ప్రకారం నిధులు కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న తెలుగుదేశంపార్టీని రెడ్డి సామాజికవర్గం ఆశీర్వదించాలని కోరుతున్నా.
సమన్యాయం రుజువు చేశాం!
సమన్యాయం తెలుగుదేశంపార్టీ అజెండా. ఇది గతంలో అన్ని రంగాల్లో మేం రుజువు చేశాం. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తాం. రెడ్లను ఆదుకుంటాం. గతంలో ఏ ప్రభుత్వమూ సంక్షేమ పథకాలు రద్దు చేయలేదు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా జగన్మోహన్ రెడ్డి 100కు పైగా సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. డ్రిప్ విధానం రాయలసీమకు ఎంత ముఖ్యమో నేను కళ్లారా చూశాను. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్ కు రాయలసీమకు డ్రిప్ ఎంత ముఖ్యమో తెలియదా? డ్రిప్ ఎందుకు రద్దు చేశాడు? మేం అధికారంలో ఉండగా డ్రిప్ ను సబ్సిడీపై ఇచ్చాం. నేడు ఆ ఫలితాలు చూస్తున్నాం. జగన్ రెడ్డి సీఎం అయ్యాక డ్రిప్ రద్దు చేయడం వల్ల రైతులు నష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలోనే ఏపీని రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానానికి తెచ్చాడు. మేం అధికారంలోకి వచ్చాక డ్రిప్, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై గతంలో మాదిరి అందజేస్తాం. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ తో అనుసంధానం చేసి గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టి చీనీ తదితర పంటలకు లాభాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. మా పాలనలో పేదరికానికి కులం, మతం, ప్రాంతం అనే భేదాలు ఉండవు. పేదవారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. దామాషా ప్రకారం అన్ని సామాజికవర్గాలకు నిధులు కేటాయించి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.
ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమలుచేస్తాం!
టిడిపి అధికారంలోకి వచ్చాక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను అమలు చేస్తాం. రెడ్ల కార్పొరేషన్ ను మేం అధికారంలోకి వచ్చాక బలోపేతం చేస్తాం. పేద రెడ్లకు అభివృద్ధిలోకి తీసుకొస్తాం. విదేశీవిద్య, ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వైసిపి రద్దుచేసి ఉన్నత విద్య అందకుండా చేస్తున్నాడు. అప్పర్ భద్ర ప్రాజెక్టును నేను నా పాదయాత్ర ప్రారంభం నుండి వ్యతిరేకిస్తూనే వచ్చా. హంద్రీనీవా ప్రాజెక్టును మేం 90శాతం పూర్తిచేశాం. మిగిలిన దాన్ని జగన్ రెడ్డి గాలికొదిలేశాడు. రాయలసీమపై ప్రేమ ఉంటే పూర్తి చేసేవాడు. అప్పర్ భద్ర పై TDP నుండి కేంద్రానికి లేఖ రాసి, మన అభ్యంతరం చెప్పి ఆపేందుకు ప్రయత్నిస్తాం. ప్రాజెక్టులపై చెక్ డ్యామ్ లు కడుతున్నారు. కానీ దాన్ని మనం ఆపలేము. గోదావరి మిగుల జలాలను మనం ఇక్కడి వరకు తెచ్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ వైసిపి పోలవరాన్ని వరదల్లో ముంచి నాశనం చేస్తున్నాడు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుంసధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. చంద్రబాబు నదులను అనుసంధానం చేసి రాయలసీమకు నీళ్లు ఇస్తారు. పోలవరాన్ని, ఇతర నీటి ప్రాజెక్టులను పూర్తిచేసేది…రిబ్బన్ కట్ చేసేది చంద్రబాబే. మీకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే అమలు చేస్తా.
*రెడ్డి సామాజికవర్గీయులు మాట్లాడుతూ…*
పల్లెల్లో రెడ్డి సామాజికవర్గం తమకు అన్నం లేకపోయినా..ఎదుటివారికి అన్నం పెట్టే స్వభావం ఉన్నవాళ్లం. కానీ జగన్మోహన్ రెడ్డి మా రెడ్లపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాపై పెట్టిన అక్రమ కేసులను మాఫీ చేయండి. ఒక్క తాడిపత్రి లోనే వేలాదిమంది రెడ్లు సబ్ జైళ్లకు వెళ్లివచ్చారు. జైలు నుండి వచ్చిన రోజే మరో కేసు పెట్టి జైలుకు పంపుతున్నాడు. జగన్ రెడ్డి పాలనలో మేం నిరాదరణకు గురవుతున్నాం. మాకు జగన్ మొండి చేయి చూపించారు. జగన్ రెడ్డి పాలనలో కేవలం నలుగురు రెడ్లే బాగుపడ్డారు. మీతో మేం నిలబడతాం…అధికారంలోకి తెస్తాం. మీరు అధికారంలోకి వచ్చాక రెడ్లకు సమన్యాయం చేయండి. రెడ్లు వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్నారు. వ్యవసాయం నష్టాల్లో కూరుకుపోయింది. అప్పుల బాధ తాళలేక చాలామంది చనిపోతున్నారు. రైతులు చనిపోకుండా చర్యలు తీసుకోండి. నిరుపేద రెడ్లకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను ఆధారంగా చేసుకుని 10శాతం రిజర్వేషన్ అమలు కల్పించాలి. మా రెడ్లలో చాలా మంది పేదలు ఉన్నారు. మా రెడ్డి సీఎం అయితే మాకు ఏదో చేస్తాడని నమ్మి మోసపోయాం. మా సామాజికవర్గంలో అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఆదుకోండి.
*ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాట్లాడుతూ….*
రాష్ట్రంలోని రెడ్డి సామాజికవర్గీయులు సమస్యల్లో చిక్కుకొని మానసిక ఆందోళనలో ఉన్నారు. రెడ్డి సామాజికవర్గ ప్రజలే నా వద్దకు వచ్చి తమ సమస్యల్ని లోకేష్ కు వివరించాలని కోరారు. రెడ్లచరిత్ర చాలా గొప్పది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెడ్డి సామాజికవర్గీయులు అడుగడుగునా అవమానాల పాలవుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు రాష్ట్రంలోని రెడ్డి సోదరులు చాలా కష్టపడ్డారు. కానీ జగన్ సీఎం అయ్యాక రెడ్ల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. చిన్న కాంట్రాక్టర్లు 50శాతం మంది రెడ్డి ప్రజలే ఉన్నారు. నాలుగేళ్లుగా వీళ్లకు బిల్లులు చెల్లింపులు లేవు. నెల్లూరులో సిలికా మైన్స్ లాక్కున్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డిని జగన్మోహన్ రెడ్డి కప్పం కట్టాలని కోరారు. కట్టలేదని రెండేళ్లు మైన్స్ మూత వేశారు. నామినేటెడ్ పదవులు మాత్రమే తన అనుచరులకు ఇచ్చి, రెడ్డి వర్గానికి ఏదో చేశానని జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడు. ఆదాన్ డిస్టిలరీస్ పులివెందులకు చెందిన వ్యక్తిది. షిర్డీసాయి కంపెనీ పులివెందులకు చెందిన వాళ్లదే.
రెడ్లపరువును దిగజార్చాడు!
50ఏళ్లు గౌరవప్రదంగా జీవించిన రెడ్లను జగన్మోహన్ రెడ్డి నేడు దేశంలో దోపిడీదారుల జాబితాలో చేర్చాడు. రెడ్డి సామాజికవర్గానికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రెడ్డి నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. మాట్లాడడం లేదు. జగన్ సమీప బంధువు వెంకటేశ్వరరెడ్డి తనను పట్టించుకోలేదని జగన్ ను వదిలి వెళ్లిపోయాడు. ఈబీసీ పథకాన్ని కేంద్రం రెండేళ్ల కిందటే అమలు చేయాలని చెబితే, రెండేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు.రెడ్డి కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. కార్పొరేషన్ కేవలం అలంకారప్రాయంగానే మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాటలకు లొంగిపోయి రెడ్డి సామాజికవర్గ పూర్తిగా నష్టపోయింది. రాష్ట్రమంతా జగన్ చేతుల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రెడ్డి సామాజికవర్గానికి న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉండాలో నిర్ణయించుకోవాలని కోరుతున్నా.
యువనేతను కలిసిన పి.కొట్టాలపల్లి గ్రామస్తులు
తాడిపత్రి నియోజకవర్గం పి.కొట్టాలపల్లి గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అరటి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. నేటికీ పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేయలేదు. టీడీపీ పాలనలో రైతులకు సబ్సిడీపై డ్రిప్, రైతులకు పంట రుణాలు, ఉద్యాన పంటలకు బీమా సౌకర్యం కల్పించింది. మీరు అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.
లోకేష్ స్పందిస్తూ….
రైతు సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పరిపాలన చేశారు. రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక పరిపాలన చేస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన రైతు సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన టి.కొత్తపల్లి గ్రామ అరటి రైతులు
తాడిపత్రి నియోజకవర్గం టి.కొత్తపల్లి గ్రామ రైతులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. అరటి సాగు చేసే రైతులకు వైసీపీ ప్రభుత్వం సబ్సీడీ ఇవ్వడం లేదు. అరటి నాటిన రైతులకు టీడీపీ ప్రభుత్వంలో నేరుగా రైతుల ఖాతాలో సబ్సీడీ డబ్బులు జమయ్యేయి. డ్రిప్ పరికరాలు, మందులు, సూక్ష్మపోషకాలు అందడం లేదు. ఆర్బీకే కేంద్రాల్లో ఎరువులు, మందులు అడుగుతుంటే లేవంటున్నారు. కరోనా సమయంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టపోయిన వారికి కనీసం బీమా కూడా ఇవ్వలేదు.
నారా లోకేష్ మాట్లాడుతూ…
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. టిడిపి హయాంలో ప్రత్యేక రైతుబడ్జెట్ ప్రవేశపెట్టి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చారు. అరటి సాగు చేసుకున్న రైతులకు 5 ఎకరాల దాకా సబ్సీడీ అందించాం. నష్టపోయిన అరటి రైతులకు టీడీపీ ప్రభుత్వం హెక్టారుకు రూ.12 వేల సాయం అందిస్తే, ఈ ప్రభుత్వం రూ.10 వేలకు కుదించింది. చంద్రబాబు అసెంబ్లీలో నిలదీసేదాకా పంటబీమా ప్రీమియంను వైసిపి చెల్లించలేదు. మళ్లీ అధికారంలోకి రాగానే అరటి రైతులకు గతంలో ఇచ్చిన సబ్సీడీలు అందిస్తాం. బోరాన్, జింక్, జిప్సమ్ లాంటి రసాయనాలు సబ్సీడీ ద్వారా అందిస్తాం.
యువనేతను కలిసిన నిరుద్యోగులు
తాడిపత్రి నియోజకవర్గుం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన నిరుద్యోగులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో అత్యధికంగా నిరుద్యోగులున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్కపోవడం వల్ల కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు యువత వలసలు పోతున్నారు. ప్రతియేటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న హామీపై ముఖ్యమంత్రి యువతను మోసం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతిని రద్దు చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ….
టీడీపీ పాలనలో యువతకు అన్ని రంగాల్లో పెద్దపీట వేశాం. 6లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతియేటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఓట్లు వేయించుకుని యువతను జగన్ రెడ్డి మోసం చేశాడు. మేం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ,ప్రైవేటు,స్వయం ఉపాధి రంగంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిన యువతను రాష్ట్రానికి వచ్చేవిధంగా ఉద్యోగాలు కల్పిస్తాం. గత ప్రభుత్వంలో యువతకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం.
యువనేతను కలిసిన నగరూరు గ్రామస్తులు
తాడిపత్రి నియోజకవర్గం, నగరూరు గ్రామానికి చెందిన రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. వైసీపీ పాలనలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. నకిలీ పత్తి విత్తనాల వల్ల మా గ్రామ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పత్తి దిగుబడులు లేక రైతులు అప్పుల పాలయ్యారు. నకిలీ విత్తనాలను అరికట్టి రైతాంగాన్ని ఆదుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను అప్పుల ఊబి నుండి కాపాడాలి.
లోకేష్ స్పందిస్తూ….
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాం. పంటలకు బీమా సౌకర్యం కల్పించి పంట నష్టాన్ని నివారించాం. కల్తీ విత్తనాలు అమ్మే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. రైతులకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్ధరిస్తాం.
యువనేతను కలిసిన డప్పు కళాకారుడు
తాడిపత్రి నియోజకవర్గం తూట్రపల్లిలో డప్పు కళాకారుడు తూట్రపల్లికి చెందిన డప్పు కళాకారుడు గణపతి యువనేతను కలిసి సమస్యలను విన్నవించాడు. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యక్తిని. డప్పు వాయిస్తూ జీవనోపాధి పొందుతున్నాను. గత ప్రభుత్వం నాకు డప్పు కళాకారుల పెన్షన్ రూ.3వేలు మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాతో పాటు మరికొందరికి కళాకారుల పెన్షన్లు నిలిపేశారు. మీరు అధికారంలోకి వచ్చాక నాకు, మిగిలిన వారికి పెన్షన్లు పునరుద్ధరించాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ….
50ఏళ్లు నిండిన దళిత డప్పు కళాకారులకు టిడిపి ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక దళితులపై కక్షసాధిస్తున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక దళితులకు అండగా నిలబడతాం. వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన డప్పు కళాకారుల పెన్షన్లు పునరుద్ధరిస్తాం.
యువనేతను కలిసిన రాయలచెరువు గ్రామస్తులు
తాడిపత్రి నియోజకవర్గం రాయలచెరువు శివారు కూర్మాజీపేట ప్రజలు యువనేత నారా లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. కూర్మాజీపేట ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న డ్రైనేజీ పూడిక తీసేవారు లేరు. మురుగు నీరు రోడ్డు మీదే ప్రవహిస్తోంది. విద్యార్థులంతా మురుగు నీటిలోనే నడుస్తూ పాఠశాలకు వెళ్లాల్సివస్తోంది. మురికి వాసన, దోమలు వల్ల అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. మీరు అధికారంలోకి వచ్చాక మురుగునీటి సమస్యను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలు కళావిహీనంగా మారాయి. గ్రామపంచాయితీల్లో అభివృద్ధి పనులకు ఉద్దేశించిన ఫైనాన్స్ కమీషన్ నిధులను వైసిపి ప్రభుత్వం దొంగిలించింది. మేం అధికారంలోకి వచ్చాక పంచాయతీలను బలోపేతం చేస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. రాయలచెరువు గ్రామస్తుల సమస్యను పరిష్కరిస్తాం.
యువనేతను కలిసిన యాడికి మండల ప్రజలు
తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నివంచారు. మా మండలంలో 75వేల జనాభా ఉంది. మా మండలానికి జూనియర్, డిగ్రీ కాలేజీలు లేవు. పదో తరగతి చదువుకున్న పిల్లలు తాడిపత్రి, గుత్తి రానూ,పోను 60కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సివస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నాయకులను కాలేజీలు అడుగుతున్నాం. మా పిల్లల భవిష్యత్తును ఎవరూ పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా మండలానికి జూనియర్, డిగ్రీ కాలేజీలు తీసుకురావాలని కోరుతున్నాం.
యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…
వైసిపి అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని నాశనం చేశాడు. పేద,బడుగు,బలహీన వర్గాలకు విద్యను దూరం చేస్తున్నాడు. ఉన్నత విద్యను దూరం చేసేందుకు ఫీజు రీయింబర్స్ మెంట్ ను రద్దు చేశాడు. మేం అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం. అన్ని వర్గాలకు విద్య అందేలా తగు చర్యలు తీసుకుంటాం. కాలేజీలు అందుబాటులో లేని ప్రాంతాలను గుర్తించి కాలేజీలు ఏర్పాటు చేస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్ధరిస్తాం.
Also, read this blog: The Journey of Nara Lokesh in Conquering Yuvagalam
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh