Nara Lokesh Yuvagalam Padayatra

కదిరి: కోట్లాది ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా ముందుకు సాగుతున్న యువగళం పాదయాత్ర 47వరోజు (ఆదివారం) కదిరి నియోజకవర్గం నల్లచెరువు శివార్లలో 600 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న ఆనందంతో కేరింతలు కొట్టారు. నల్లచెరువు చేరుకున్న Nara Lokesh యువగళం పాదయాత్రకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. భారీగా జనం రోడ్లపైకి తరలివచ్చారు. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ, పూలవర్షం కురిపిస్తూ తమ గ్రామాల్లోకి ఆహ్వానించారు. మహిళలు, దారిపొడవున జనం కరచాలనం చేస్తూ సెల్ఫీ కోసం పోటీ పడ్డారు. తనని చూడటానికి వచ్చిన యువత, మహిళలు, వృద్దులు లతో ఫోటోలు దిగుతూ, ఆప్యాయంగా పలకరించిన యువనేత వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉద్యోగావకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు, పనులు చేసుకుంటున్నామని యువకులు తెలిపారు. టిడిపి గెలిచిన వెంటనే నియోజకవర్గ స్థాయిలో స్థానికంగా పరిశ్రమల ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని భరోసా ఇచ్చారు. పాదయాత్ర దారిలో నల్లచెరువు మండల చేనేతలు యువనేతను కలిసి సమస్యలు విన్నవించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇంతవరకు పరిహారం అందలేదని ఆవేదన చెందారు. రాబోయే టిడిపి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని యువనేత భరోసా ఇచ్చారు. రట్నాలపల్లిలో కురుబ సామాజికవర్గీయులు యువనేతను కలసి తాము ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేశారు. సాయంత్రంలో జొన్నపేటలో జరిగిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీఎత్తున ప్రజలు హాజరయ్యారు.

టెంపుల్ టూరిజం స‌ర్క్యూట్..లోకేష్‌ విజ‌న్‌కి సెల్యూట్‌ – 600 కి.మీ. చేరిన సందర్భంగా శిలాఫలకం

విజ‌న‌రీ చంద్రబాబు త‌న‌యుడు నారా లోకేష్ విజ‌న్‌కి ప్రజ‌లు సెల్యూట్ చేస్తున్నారు. యువ‌గ‌ళంలో వేసే ప్రతీ అడుగు అభివృద్ధికి ముంద‌డుగుగా మ‌లిచే దూర‌దృష్టిని ప్ర‌శంసిస్తున్నారు. ప్రతీ వంద కిలోమీట‌ర్లకి ఓ మైలురాయిగా భావిస్తూ, ఆ ప్రాంతీయుల‌కు ప్రయోజ‌నం క‌లిగే ప‌నికి పూనుకుంటున్నారు. పాద‌యాత్ర 600 కి.మీ చేరుకున్న సంద‌ర్భంగా చిన్నయ‌ల్లంప‌ల్లి వ‌ద్ద‌ టెంపుల్ టూరిజం స‌ర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. TDP ప్రభుత్వం రాగానే కార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ టెంపుల్ టూరిజం స‌ర్క్యూట్‌లో భాగంగా ప‌ర్యాట‌క‌, చారిత్రక‌, ఆధ్యాత్మిక ప్రాంతాల‌ను అభివృద్ధి చేయ‌నున్నారు. టెంపుల్ టూరిజం సర్క్యూట్ పథకం అమలుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 6వేల మంది వ‌ర‌కూ ఉపాధి పొంద‌నున్నారు. ఈ ప‌థ‌కంలో భాగంగా కటారుపల్లె వద్ద వేమన సమాధి, గొటిబాయిలు గ్రామంలో తిమ్మమ్మ మర్రిమాను, చెర్లోపల్లి రిజర్వాయర్ బోటింగ్, బట్రేపల్లె వాటర్ ఫాల్స్ ,  శ్రీ ఖాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తారు. ఆయా ప్రాంతాల్లో ఆహ్లాద‌ర‌క‌ర వాతావ‌ర‌ణం, ర‌వాణా సౌక‌ర్యాలు,  యాత్రికులకు వసతి కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ‌డం ద్వారా ప‌ర్యాట‌క‌రంగం ప్రగ‌తికి దోహ‌ద‌ప‌డ‌వ‌చ్చని అనేది లోకేష్ ఆలోచ‌న‌. నిరుద్యోగుల‌కు స్థానికంగానే ఉపాధి అవ‌కాశాలు దొరుకుతాయి. మ‌న సంస్కృతి, చారిత్ర‌క‌, ఆధ్యాత్మిక వార‌స‌త్వాన్ని ప‌రిర‌క్షించ‌డంతోపాటు టూరిజం ఆదాయం పెంచ‌డం, స్థానికుల‌కు ఉపాధి క‌ల్పించ‌డం ల‌క్ష్యాలుగా త‌ల‌పెట్టిన ఈ టెంపుల్ టూరిజం స‌ర్క్యూట్‌ని తెలుగుదేశం ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే కార్యాచ‌ర‌ణ ప్రారంభించ‌నున్నామ‌ని లోకేష్ ప్రక‌టించారు.

ప్రగ‌తికి పునాది రాళ్లు – యువ‌గ‌ళం మైలురాళ్లు

తెలుగుదేశం పార్టీ నినాదం స‌మాజ‌మే దేవాల‌యం-ప్రజ‌లే దేవుళ్లు. ఇదే విధానం తెలుగుదేశం నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వ‌ర‌కూ కొన‌సాగిస్తూనే ఉంది. టిడిపి పెద్దల అడుగుజాడ‌ల్లోనే యువ‌నేత‌, టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ న‌డుస్తున్నారు. మెజారిటీ ప్రజ‌లకి మేలు చేకూర్చేలా ప్రగ‌తి పనుల‌కు  పునాది రాళ్లుగా నిలుస్తున్నాయి యువ‌గ‌ళం మైలురాళ్లు. పాద‌యాత్రలో ప్రతీ వంద కిలోమీట‌ర్లకి ఇస్తున్న హామీలు టిడిపి ప్రభుత్వం వ‌చ్చే వంద రోజుల్లో నెర‌వేర్చేలా ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర  47వ రోజున 600 కిలోమీట‌ర్లకి చేరింది. ఈ సంద‌ర్భంగా శ్రీసత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలో చిన్నయ‌ల్లంప‌ల్లి వ‌ద్ద‌ టెంపుల్ టూరిజం స‌ర్క్యూట్ ఏర్పాటు చేస్తామని, టీడీపీ ప్రభుత్వం రాగానే కార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తామని లోకేష్ ప్రక‌టించారు.   పాద‌యాత్ర ఆరంభించిన త‌రువాత‌ 100 కి.మీ మైలురాయి పూర్తి చేసుకున్న సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యంలో డ‌యాల‌సిస్ కేంద్రాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని మాట‌ ఇచ్చారు. 200 కి.మీ పూర్తి చేసుకున్న సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం కత్తెరపల్లి వద్ద డిగ్రీ కళాశాలకు ప్రభుత్వం రాగానే అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 300 కి.మీ పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానుపురం పంచాయతీ పరిధిలో 13 గ్రామాల దాహార్తి తీర్చే తాగునీటి ప‌థ‌కం ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. 400 కి.మీ చేరుకున్నసంద‌ర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండ‌లం న‌రేంద్ర‌కుంటలో ఆధునిక వ‌స‌తుల‌తో 10 ప‌డ‌క‌ల ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని ప్రక‌టించారు. 500 కి.మీ పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లి నియోజకర్గంలోని చిన్నతిప్పసముద్రం -2 వద్ద టమోటా ప్రాసెస్ యూనిట్, కోల్డ్ స్టోరేజీ నిర్మాణాలకు ప్రభుత్వం రాగానే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. టమోటా రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్యకి ఇవి శాశ్వత ప‌రిష్కారం చూప‌నున్నాయి. అలాగే ప్రతీ హామీ కూడా స్థానికుల్లో అతి ఎక్కువ‌మందికి ప్రయోజ‌న‌క‌రంగా, అంద‌రి స‌మ‌స్యకి ప‌రిష్కారంగా ఉండేలా చూస్తున్నారు లోకేష్‌.

యువగళం దెబ్బకు వైసీపీ కు దిమ్మదతిరిగి మైండ్ బ్లాంక్!ఇది ట్రైలర్ మాత్రమే… అసలు సినిమా 2024ల చూపిస్తాం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

కదిరి: అధికార మదం తలకెక్కి నా వెంట్రుక కూడా పీకలేరు అన్నావ్… ప్రజలు ఏకంగా నీకు గుండు కొట్టించారు… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ప్రజావిజయమని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా కదిరి నియోజకవర్గం జొన్నపేటలో యువనేత లోకేష్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ… యువగళం దెబ్బకు వైసీపీ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది, ఇది ట్రైలర్ మాత్రమే… అసలు సినిమా 2024లో చూపిస్తాం, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా టిడిపి క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. ఎన్నికల ముందు సెమీఫైనల్స్ అన్నవాళ్లు ఫలితాలు వచ్చాక తూచ్…అనడం హాస్యాస్పదంగా ఉంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పదవికి పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్లను వైసీపీ నిలబెట్టింది. 108 నియోజకవర్గాల యువత వైసీపీని ఛీ కొట్టారు. అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన దాఖలాలు చరిత్రలో మనం చూడలేదు…కానీ వైసీపీ ఆరోపించింది. వై నాట్ 175 అంటున్న జగన్ రెడ్డికి…బైబై జగన్ అంటూ యువత తీర్పునిచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తికి తగిన గుణపాఠమే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎన్నిచేసినా ప్రజలు భారీ మెజారిటీతో టిడిపికి అనుకూలంగా తీర్పుచెప్పారు.

ఇచ్చిన ఒక్క చాన్స్ ను దుర్వినియోగం చేశాడు!

మైండ్ ఉన్న వాడు ఎవడైనా సింగపూర్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటాడు. మన సిఎం మాత్రం ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్నాడు. ఏ సిఎం అయినా అభివృద్ధి పనులతో పాలన ప్రారంభిస్తారు. ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ని మిస్ యూజ్ చేసుకున్న  సీఎం జగన్. మూడు రాజధానులు అంటూ మాయ చెయ్యాలని చూసాడు. ఒక్క ఇటుక పెట్టలేదు.    సీఎం అయిన తరువాత ఎవరైనా మొదట చేసే పని పరిశ్రమలు తీసుకురావడం.  .

రాయలసీమ లో వైసీపీ వైఫ‌ల్యం

జగన్ రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకున్నాడు.  రెండు సార్లు కడప ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసాడు. ముందు 20 వేల మందికి ఉద్యోగాలు అన్నాడు. ఇప్పుడు 6 వేల మందికి అంటున్నాడు.  రెండు సార్లు చేసిన శంకుస్థాపన కోసం సొంత మీడియా కి 30 కోట్లు ప్రకటనలు ఇచ్చాడు. 30 పైసలు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఖర్చు చెయ్యలేదు. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. రిలయన్స్, అమరరాజా వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. అన్నమయ్య గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. కియా కారు చూస్తే అనంతపురం గుర్తు వస్తుంది. దటీజ్ చంద్రబాబు గారు. డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు ఇలా ఏమి చూసినా చంద్రబాబు గారు గుర్తు వస్తారు. జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అనంతపురం కి నువ్వు తెచ్చిన ఒక్క కంపెనీ ఉందా?ఒక్క అభివృద్ధి కార్యక్రమం నువ్వు చేసావా?

మహిళలకు హామీలిచ్చి మాటతప్పిన జగన్!

మహిళల్ని మోసపూరిత హామీలిచ్చి ముంచేసాడు ఫెయిల్డ్ సీఎం జగన్. మద్యపాన నిషేధం, 45 ఏళ్లకే ఎస్సి,ఎస్టీ,బిసి, మైనార్టీ మహిళలకు పెన్షన్, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.  వృద్ధులకు బిల్డప్ బాబాయ్ 3 వేల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ సీఎం జగన్ 6లక్షల పెన్షన్లు కట్ చేసాడు. రైతు రాజ్యం తీసుకొస్తా అన్నాడు. 3500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, టమాటో రైతులకు కచప్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజీలు అన్నాడు. వేరుశనగ రైతుల్ని ఆదుకుంటా అన్నాడు. ఒక్క హామీ నిలబెట్టుకోకపోగా రైతుల మెడలో మీటర్ల ఉరి తాడు బిగిస్తున్నాడు. ఉద్యోగస్తులకు వారంలో పెన్షన్ రద్దు అన్నాడు. పోలీసులకు వీక్లీ ఆఫ్ అన్నాడు. సీఎం జగన్ ఇప్పుడు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి. పోలీసులకు సరెండర్స్ పెండింగ్ పెట్టాడు.

బిసిల వెన్నెముక విరిచిన జగన్

అధికారంలకి వచ్చాక జగన్ ముస్లింలను వేధించిన పాపం ఊరికే వదలదు.  ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం అని ముస్లింలు భావిస్తారు. అలాంటి వారికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చాడు జగన్. అబ్దుల్ సలాం కుటుంబం పై దొంగ అనే ముద్ర వేసి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసారు. స్కూల్ లో టాపర్ గా ఉన్న మిస్బా ని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. హాజిరాను అత్యాచారం చేసి చంపేస్తే కనీసం పోస్టుమార్టమ్ నివేదిక ఇవ్వలేదు. మసీదు భూములు కాపాడుకోవడానికి పోరాడిన ఇబ్రహీం ని చంపేసారు.  విదేశీ విద్య, దుల్హన్ పధకాలు అమలు కావడం లేదు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ అభివృద్ధి కి ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. బీసీల బ్యాక్ బోన్ విరిచేసాడు జగన్. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 10 శాతం కట్ చేసాడు. నిధులు లేని పదవులు బీసీలకు. పవర్ ఉండే పదవులు అన్ని ఒకే సామాజిక వర్గానికి. దళితుడ్ని సుబ్రహ్మణ్యం ని చంపిన అనంతబాబు కి సన్మానం చేసాడు జగన్ రెడ్డి. డాక్టర్ సుధాకర్, అనితా రాణి, కిరణ్, వరప్రసాద్, ఓం ప్రతాప్ ఇలా ఎంతో మంది బాధితులు ఉన్నారు. బిసి సోదరులను వేధించిన వారిని జైలుకు పంపి తీరుతాం. ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ చట్టం తరహాలో బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం.

అడ్డగోలు దోపిడీలో సిద్దారెడ్డి తక్కువేడేం కాదు!

కదిరి ఎమ్మెల్యే గారి పేరు సిద్దారెడ్డి. ఆయన ప్రజల సొమ్ము కొట్టేయడంలో సిద్దహస్తుడు. నాలుగేళ్లలో ఎమ్మెల్యే ప్రజలకు ఏంచేశావ్? ఏ ముఖం పెట్టుకొని ప్రజలముందుకు వస్తారు? ఎన్పీ కుంటలో ఏర్పాటు చేసిన సోలార్ పార్కులో 9 నిర్వహణ కంపెనీలపై పులివెందుల బ్యాచ్ తో రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి 8 కోట్ల వరకు వసూలు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గ్రామాలకు సోలార్ పార్కు ఇచ్చిన నిధుల్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 50 వేల రూపాయలకు మించి ఏ కాంట్రాక్ట్ అయినా సరే సిద్ధారెడ్డి కంపెనీకే పనులు దక్కుతాయి.  గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలు మొత్తం సిద్ధారెడ్డికి చెందిన కంపెనీకే కట్టబెట్టారు. కాని ఈ మహానుభావుడు కంకర వేసి వదిలేశారు. కాంట్రాక్టు తీసుకోవడం తవ్వి వదిలేయడం అలవాటుగా పెట్టుకున్నారు. రోడ్డు వేయలేని వాడు కాంట్రాక్టు ఎందుకు తీసుకోవాలి? జనాల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. గ్రామాల్లో రోడ్లు వేయని ఎమ్మెల్యే సిద్దారెడ్డి కదిరిలో తన అపార్ట్ మెంట్ కు మాత్రం 50 లక్షలు పెట్టి రోడ్డు వేసుకున్నారు.

నరసింహస్వామి కోనేరును కూడా వదల్లేదు

ఖాద్రీ నరసింహుడు కోనేరులోకి మురుగునీరు రాకుండా ఉండటం కోసం 2కోట్ల 30 లక్షలతో మోడర్నైజేషన్ పనులు అనంతపురానికి చెందిన కంపెనీకి అప్పగించి ఎమ్మెల్యే రూ.2కోట్లు కొట్టేశాడు. నాసిరకం పనులు చేయడంతో కోనేరు వరదలకు కొట్టుకుపోయింది.  తన కంకర మిషన్ నుంచి వేస్టేజ్ ను పారేయడం కోసం నలుగురు రైతులకు చెందిన పొలాలు లాక్కున్నారు. ఎమ్మెల్యే సిద్దారెడ్డి బంధువు హరినాథ్ రెడ్డి ద్వారా ఇటుకులపల్లి, రాచానపల్లి, కందుకూరు, కురుగుంట గ్రామాల్లో 30 ఎకరాలు కబ్జా చేశారు. కదిరి మున్సిపాలిటీలో 14, 15 ఫైనాన్స్ నిధులకు తనకు అనుకూలమైన కాంట్రాక్టర్ల కోసం మళ్లించారు. కదిరి పట్టణంలో ఏ ఇళ్లు కట్టాలన్నా ఎమ్మెల్యే అనుమతి ఉండాల్సిందేనట. డబ్బులు తీసుకుని ఓ బిల్డింగ్ కు అనుమతి లేకపోయినా చూసిచూడనట్లు వదిలేశారు. ఆ బిల్డింగ్ నిర్మాణంలో ఉండగానే.. కూలిపోయి 6 మంది చనిపోయారు. వచ్చేది టిడిపి ప్రభుత్వమే. బలవంతంగా లాక్కున్న భూములను తిరిగి సొంతదారులకు అప్పగిస్తాం.

కదిరికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

కదిరి నియోజకవర్గానికి , వైసిపి నేతలు అనేక హామీలు ఇచ్చారు అందులో ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? కదిరి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ఉన్న డ్రైనేజీలను కూడా రెగ్యులర్ గా శుభ్రం చేయించలేకపోతున్నారు. మున్సిపాలిటీలో చీపుర్లు కొనడానికి కూడా డబ్బులు లేవంటున్నారు. ఔటర్ బైపాస్ లో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. పరిశ్రమల మాట దేవుడెరుగు. బైపాస్ లో ఒక్క టీ షాపు కూడా పెట్టించలేదు. బైపాస్ నిర్మాణం ఇదే స్పీడులో జరిగితే మరో ఐదేళ్లయినా పూర్తవదు.. బట్రేపల్లి జలపాతం, తిమ్మమ్మ మర్రిమానును పర్యాటకంగా అభివ్రుద్ధి చేస్తామన్నారు.  దీని కోసం మంజూరు చేసిన ఉపాధి నిధుల్ని కూడా వాడుకోలేక వదిలేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మారుస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు.

కదిరి సమస్యలను పరిష్కరిస్తాం!

కదిరి నియోజకవర్గంలో అత్యధిక శాతం యువత ఉపాధి కోసం వలసలు వెళ్లిపోతున్నారు.  తనకల్లు మండలం మినహా మిగిలిన 5 మండలాల్లో సాగునీటి సౌకర్యం లేదు. హంద్రీనీవా పనులు పూర్తి చేసి కదిరిలోని చెరువులకు నీళ్లిస్తాం. కదిరి ప్రాంతంలో రైతులు ఎక్కువగా వేరుసెనగ, టమాటా వంటివి ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక్కడ వేరుసెనగ పరిశోధన స్థానం టీడీపీ హయాంలో ఏర్పాటు చేసాం. వైకాపా వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ ప్రాంతంలో వేరుసెనగ, టమాటకు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజిలు ఏర్పాటు చేస్తాం. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో నాటుసారా విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది తాండాల్లో గిరిజన సోదరులు ఇందులోకి దిగి కేసుల్లో ఇరుక్కున్నారు. వారిని దీని నుంచి బయట పడేయడం కోసం ప్రత్యేక కార్యచరణ చేపడతాం. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల చూపిస్తాం.  కదిరి నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఇక్కడే మంచి పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తాం.

కదిరి టీడీపీ ఇన్చార్జి ప్రసాద్ మాట్లాడుతూ…

4ఏళ్లుగా చీకట్లో మగ్గుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెచ్చేందుకు యువనేత పాదయాత్రను సంకల్పించారు. యువగళం పాదయాత్రతో సత్యసాయి జిల్లా పులకరించింది. గత మూడు రోజులుగా టీడీపీలో ఊహించని ఉత్సాహం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ దుందుభి నూతనోత్సాహాన్ని నింపింది. టీడీపీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా మొదటిగా స్పందించేది అనంతపురం జిల్లానే. వైసీపీ పాలనలో ఏ వర్గమూ గత నాలుగేళ్లుగా ఆనందంగా లేదు. 2019 ఎన్నికల సమయంలో ఈ జిల్లాకు జగన్ చాలా హామీలిచ్చారు. ఒక్క హామీని కూడా నేటికీ నెరవేర్చేలేదు. పరిటాల రవి, టీడీపీ భిక్షతో పైకి వచ్చిన వల్లభనేని వంశీ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దాడు. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ ఒక కారణ జన్ముడు. అనంతపురంలో పరిటాల రవి కారణజన్ముడు. తండ్రి, భర్త, భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా కలిగిన మహోన్నత తల్లి భువనేశ్వరి మాత్రమే. మరొకరికి ఈ అవకాశం రాదు.

యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించిన చేనేతలు

నల్లచెరువు మండల చేనేతలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. నల్లచెరువు మండలంలో 2వేల చేనేత కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. చేనేత కార్మికులకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి. ప్రతినెలా రేషన్‌(నూలు) సబ్సిడీ మంజూరు చేయాలి. చేనేత క‌ళాకారుల‌కు ప్రత్యేకంగా చేనేత కాలనీలు ఏర్పాటుచేయడంతోపాటు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలు కేటాయించాలి. ప్రతి చేనేత కార్మికుడికి కరెంటు సబ్సిడీ అందించాలి. చేనేతలకు పనిముట్లు ఉచితంగా పంపిణీ చేయాలి. ప్రతిఒక్క చేనేత కార్మికుడికి మగ్గం కోసం లోన్లు మంజూరు చేయాలి. చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ.30వేలు ఆర్థిక సాయం అందించాలి. చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్న కరెంటు మగ్గాలను బంద్ చేయాలి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరి మాదిరిగానే చేనేతలను కూడా తీవ్రంగా మోసగించింది. నాలుగేళ్లుగా ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన రూ. 80 కోట్ల బకాయిలు ఇంకా విడుదల చేయలేదు. కరోనా సమయంలో ప్రభుత్వం మాస్కుల కోసం ఆప్కో నుంచి కొనుగోలుచేసిన గుడ్డకు సంబంధించి  ఇంకా సగం బకాయిలు చెల్లించలేదు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు ఎటువంటి పరిహారం అందజేయలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతలకు రావాల్సిన బకాయిలను వెంటనే ఆప్కో ద్వారా విడుదల చేస్తాం. చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. చేనేత వస్త్రాలపై జిఎస్టీని రాష్ట్రప్రభుత్వమే భరించేలా చేస్తాం. చేనేతలకు కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటుచేస్తాం. చేనేత ఉత్పత్తులను బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. గత ప్రభుత్వ హయాంలో చేనేత రంగాలకు అందించిన పట్టు సబ్సిడీ, ప్రోత్సాహకాలు, పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం. చేనేతరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు చేనేత నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.

యువనేత లోకేష్‌ని కలిసిన కురుబ సామాజికవర్గీయులు

రట్నాలపల్లిలో కదిరి నియోజకవర్గ కురుబ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. వైసిపి ప్రభుత్వం కురుబ కార్పొరేషన్ కు ఎటువంటి నిధులు కేటాయించలేదు. గొర్రెల లోన్లు, సబ్సిడీ రుణాలు, గొర్రెలు, గొర్రెల పెంప‌కందారులకు భీమా సౌకర్యం కల్పించాలి. నూరుశాతం సబ్సిడీతో గొర్రెల పెంపకందార్ల షెడ్ల నిర్మాణానికి సహాయం అందించాలి. ప్రతి గ్రామంలో గొర్రెల మేపు కోసం 10ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలి. కురుబల కులదైవం భక్త కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించాలి. జిల్లాకేంద్రంలో కమ్యూనిటీ హాలు భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. కురుబ యువతీయువకులకు విద్య, స్వయం ఉపాధి రుణాలను అందించాలి. కురుబల కులవృత్తి అయిన కమ్మెళ్లనేత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రుణాలు మంజూరుచేయాలి. గొర్రెల కాపరుల సంఘాలు, కురుబ కమ్యూనిటీ హాళ్లకు విరివిగా నిధులు మంజూరు చేయాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనాభాపరంగా రెండోస్థానంలో ఉన్న కురుబలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి పదవులు కేటాయించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుర్చీల్లేని కార్పొరేషన్లను ఏర్పాటుచేసి బిసిలకు తీరని అన్యాయం చేశారు.గత ప్రభుత్వ హయాంలో బిసి కమ్యూనిటీ హాళ్లకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేయగా, ఈ ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాళ్ల పనులను నిలిపివేసింది. నిలిచిపోయిన కమ్యూనిటీహాల్ భవనాలను అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిచేస్తాం. గొర్రెల కాపరులు, గొర్రెలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చాక కురుబల గొర్రెల మేపు కోసం ఖాళీగా ఉన్న బంజరు భూములను కేటాయిస్తాం. కురుబ కార్పొరేషన్ ను బలోపేతం చేసి గొర్రెల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు అందిస్తాం. కురుబల ఆరాధ్యదైవం కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం. అనంతపురంలో కురుబ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు చేపడతాం. కురుబ యువతకు విద్య, స్వయం ఉపాధి రుణాలకు చర్యలు తీసుకుంటాం. బిసిలు, కురుబలకు అండగా నిలిచే చంద్రన్నను ముఖ్యమంత్రి  చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

Also, read this blog: Striving for Greater Excellence in Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *