Naralokesh yuvagalam, yuvagalam padayatra

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత యువగళం పాదయాత్ర! అభిమానుల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగుతున్న యాత్ర కదిరి పట్టణంలో పోటెత్తిన జనం… కిటకిటలాడిన రహదారులు

కదిరి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 48వరోజు (సోమవారం) కదిరి నియోజకవర్గంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా ముందుకు సాగింది. సోమవారం మధ్యాహ్నం భోజన విరామానాంతరం కదిరి పట్టణంలో ప్రవేశించిన పాదయాత్రకు జనం పోటెత్తారు. కదిరిలోని రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. కదిరి ఇక్బాల్ సర్కిల్, ఎంజి రోడ్డు, కోనేరు సర్కిల్ వద్ద మిద్దెలు, మేడలపై నిలబడి అభిమాననేతను చూసేందుకు పోటీపడ్డారు. దారిపొడవునా బాణాసంచా కాలుస్తూ పూలవర్షం కురిపించి యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. జనం భారీఎత్తున రోడ్లపైకి చేరుకోవడంతో వారిని అదుపుచేయడం భద్రతాసిబ్బందికి కష్టసాధ్యంగా మారింది. యువత, మహిళలు, వృద్దులు అందరినీ కలుస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ యువనేత ముందుకు సాగారు.  యువతీయువకులు లోకేష్ కు ఎదురేగి స్వాగతం పలుకుతూ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కదిరి ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో యువనేత లోకేష్ ప్రత్యేక పూజలుచేసి, పురోహితులతో ఆశీర్వచనాలు అందుకున్నారు.  48వరోజు పాదయాత్ర జోగన్నపేట విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. విడిది కేంద్రం వద్ద తనను కలిసేందుకు వచ్చిన సుమారు వెయ్యిమంది అభిమానులతో యువనేత ఓపిగ్గా ఫోటోలు దిగి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. భుజం వద్ద గాయంతో ఇబ్బంది పడుతున్నా అభిమానులను నిరాశపర్చకూడదని భావించి యువనేత ప్రతిఒక్కరికీ సెల్ఫీ ఇచ్చారు. మొటుకుపల్లి వద్ద ఆర్డీటి ట్రస్ట్ నిర్వహిస్తున్న దివ్యాంగుల ఆశ్రమపాఠశాలను యువనేత సందర్శించి అక్కడ బాలలతో కొద్దిసేపు ముచ్చటించారు. వారికి ముఠాయిలు, చాక్లెట్లు పంచి వారితో ఫోటోలు దిగారు. అనంతరం మొటుకుపల్లి పివిఆర్ గ్రాండ్ వద్ద బిసిలు, ముస్లిం మైనారిటీలతో సమావేశమై వారి సాదకబాధలను తెలుసుకున్నారు. భోజన విరామానంతరం మొటుకుపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర కదిరి పట్టణంలో ప్రవేశించింది.

అన్నా క్యాంటీన్ ప్రారంభించిన యువనేత

శ్రీ విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాన్టీన్ ను ప్రారంభించిన యువనేత నారా లోకేష్ సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్యాంటీన్ లోపల ఉన్న ఎన్ఠీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు. స్థానికులకు భోజనం వడ్డించి క్యాంటీన్ లో అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ ఎవరూ ఆకలితో ఉండరాదన్న సదుద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటుచేస్తే వైసీపీ ప్ర‌భుత్వం వాటిని రద్దుచేశారని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా TDP నాయకులు, అభిమానులు సొంత డబ్బుతో అన్నా క్యాంటీన్లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మంగళగిరిలో గత 200రోజులుగా అన్నాక్యాంటీన్ ను కొనసాగిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నట్లు చెప్పారు.  తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పారు.

యువనేత లోకేష్ ఎదుట వ్యక్తమైన సమస్యలు:

నా కూతరుకి దుల్హన్ పథకం ఇవ్వలేదు -షేక్.జహీరా, కదిరి పట్టణం

నా భర్తలేక, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నా కూతురుని నాలుగు వరకు చదివించి ఆపేశాను. ఏడాది క్రితం కదిరికి చెందిన వ్యక్తితోనే వివాహం చేశాను. దుల్హన్ పథకానికి దరఖాస్తు చేశా..కానీ ఇవ్వలేదు. ఎందుకివ్వలేదని సచివాలయంలో ప్రశ్నించగా పదవ తరగతి పాసై ఉండాలన్నారు. మా వీధిలో కూడా ఎవరికీ రాలేదు.

ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వడం లేదు – పి.మున్నీ, 13వ వార్డు

 విడాకులు ఇవ్వడం వల్ల మూడేళ్ల నుండి నా భర్తకు దూరంగా ఉంటున్నా. ఉన్న ఒక్క కూతురు నాతోనే ఉంటోంది. ఇళ్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఒంటరి మహిళ పెన్షన్ కోసం సచివాలయంలో ఎన్నిసార్లు అడిగినా వస్తుందంటున్నారు..కానీ ఇవ్వడం లేదు. కనీసం రంజాన్ కు పండుగ కానుక కూడా ఇవ్వడం లేదు.

అవిటితనంతో మంచంలోనే ఉంటున్నా… పెన్షన్ రావడంలేదు! – తమ్మిశెట్టి వెంకటమ్మ, 14వ వార్డు, కదిరి.

3 ఏళ్ల క్రితం జారి పడి కాలు విరిగింది. నా పని నేను చేసుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నా. నా కొడుకు, భర్త ఇద్దరూ చనిపోయారు. నా కోడలు సరిగ్గా చూసుకోవడం లేదు. నేను వడ్డెర కులస్తురాలిని. ఇంటి పక్కన వాళ్లు జాలికొద్దీ ఏదో ఒకటి పెడితే తిని బతుకుతున్నా. నాకు పెన్షన్ ఇప్పించేలా చేయండి.

అధికారంలోకి వచ్చాక ఆదరణ పథకాన్ని మళ్లీ ప్రవేశపెడతాం వడ్డెర్ల వృత్తిపనికోసం క్వారీలు కేటాయిస్తాం మద్యంషాపుల్లో కల్లుగీత కార్మికులకు రిజర్వేషన్ అమలుచేస్తాం నిలచిపోయిన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలన్నీ పూర్తిచేస్తాం ట్రిపుల్ ఆర్ సినిమాలో నటించి ఉంటే జగన్ కు ఆస్కార్ వచ్చేది! బిసిలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

కదిరి: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెర్లు ఉపాధి పొందేందుకు క్వారీలు కేటాయిస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కదిరి నియోజకవర్గంలో మొటుకుపల్లి పివిఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో బిసిలతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. వడ్డెర్లలో పేదరికాన్ని గుర్తించి మొట్టమొదటగా ఫెడరేషన్ ఏర్పాటుచేసింది ఎన్టీఆర్, అప్పట్లోనే క్వారీలు కేటాయిస్తే వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత వడ్డెరలకి ఇచ్చిన క్వారీలు, మైన్లు బలవంతంగా లాక్కున్నారు. టిడిపి హయాంలో వడ్డెరలను ఆదుకోవడానికి పెట్టిన భీమా పథకాన్ని వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. టిడిపి ప్రభుత్వం వచ్చాక మళ్లీ చంద్రన్న భీమా పథకాన్ని తీసుకువచ్చి బీమామొత్తాన్ని రూ.10లక్షలకు పెంచుతాం. వైసిపి ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ కు ఎటువంట నిధులు కేటాయించకుండా ఆపేసారు. బిసిలకు పనిముట్లు అందించేందుకు ఆదరణ పథకాన్ని పరిచయం చేసింది టిడిపి. ఈ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో రూ.964 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. కేవలం 10శాతం లబ్ధిదారుడి వాటాతో పనిముట్లు అందించాం. ఎన్నికలకు ముందు ఆదరణ-2 పథకం కోసం లబ్ధిదారులు చెల్లించిన వాటా కూడా తిరిగి ఇవ్వకుండా పనిముట్లన్నీ పాడుబెట్టారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే 2025లో ఆదరణ పథకాన్ని తిరిగి అమలుచేస్తాం. కల్లుగీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ అమలుచేస్తాం. కల్తీమద్యంపై ఉక్కుపాదం మోపుతాం.

బిసిలపై 26వేలకుపైగా దాడులు, తప్పుడుకేసులు

బీసీల పై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వైసిపి ప్రభుత్వం వచ్చాక 26వేలమంది బిసిలపైద దాడులు, తప్పుడు కేసులు నమోదయాయ్యాయి. బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయపోరాటానికి సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.  వైసిపి పాలనలో మహిళల పై విపరీతంగా దాడులు పెరిగిపోయాయి. మహిళల్ని చంపుతుంటే గన్ కంటే ముందు వస్తా అన్న జగన్ ఎక్కడ? చట్టం ఒక మోసం. అసలు చట్టమే లేదు. ఒక్క కేసులో కూడా 21 రోజుల్లో శిక్ష పడలేదు. నాయి బ్రాహ్మణులను, రజకులను శాసనమండలికి పంపుతా అని మోసం చేసింది జగన్. రజకులను శాసన మండలికి పంపింది. నాయి బ్రాహ్మణులను శాసన మండలికి పంపబోయేది టిడిపి. బిసిల్లో ఉన్న అనేక ఉప కులాల డిమాండ్ల పరిష్కారం కోసం సత్యపాల్ కమిటీ వేసింది టిడిపి. ఆ రిపోర్ట్ చెత్త బుట్టలో పడేసింది వైసిపి ప్రభుత్వం. బిసిల్లో అన్ని ఉపకులాలకి అవకాశాలు ఇవ్వడానికి టిడిపి లో సాధికార సమితిలు ఏర్పాటు చేశాం. ఉపకులాల వారీగా నాయకత్వాన్ని అభివృద్ది చేస్తున్నాం.

కమ్యూనిటీ హాళ్లను పూర్తిచేస్తాం!

కదిరి లో అన్ని మండలాల్లో బీసీ కమ్యూనిటీ హాల్స్ కట్టడానికి మండలానికి 25 లక్షలు కేటాయించింది టిడిపి ప్రభుత్వం. ఇప్పుడు అవన్నీ ఆపేసారు. టిడిపి ప్రభుత్వం గెలిచిన ఏడాది లో కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తాం. బీసీల్లో ఉన్న ఉపకులాల వారీగా కమ్యూనిటీ భవనాలు, నిధులు టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే కేటాయిస్తాం. టిడిపి పాలనలో బిసిలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది…. బిసిలను మోసం చేసింది జగన్… ఇతర సంక్షేమ కార్యక్రమాలు లెక్కలు బిసిలకు ఇచ్చినట్టు చూపిస్తున్నారు. బిసిల రిజర్వేషన్లు 10 శాతం కట్ చేసింది జగన్. స్థానిక సంస్థల్లో 16,500 బీసీలను పదవులకి దూరం చేసింది జగన్. టిడిపి హయాంలో బిసిలకు ఎంత ఖర్చు చేశామో మేము చెబుతున్నాం. మీరు ఏం చేశారో చెప్పండి అని సవాల్ విసిరితే వైసిపి వాళ్ళు పారిపోతున్నారు. బిసిల పుట్టినిల్లు టిడిపి. మళ్లీ బిసిలకు న్యాయం జరగాలి అంటే టిడిపి అధికారంలోకి రావాలి.

ట్రిపుల్ ఆర్ లో నటించి ఉంటే ఆస్కార్ వచ్చేది!

మాట మార్చడం… మడమ తిప్పడం లో జగన్ దిట్ట. సొంత ఆర్ఆర్ఆర్ లో జగన్ నటించి ఉంటే ఆస్కార్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చేది. ఒక కంటిని పొడుచుకుంటామా అంటూ యాక్టింగ్ చేసాడు జగన్.  ఒక్కో సారి జగన్ ఢిల్లీ వెళ్ళడానికి కోటి ఖర్చు అవుతుంది. ప్రత్యేక హోదా గురించి అడగడు, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం అడగడు.  జగన్ కి సౌండ్ ఎక్కువ పని తక్కువ.

భవననిర్మాణ నిధులు పక్కదారి పట్టించారు!

ఇసుక, సిమెంట్ ధరలు విపరీతంగా పెంచి భవన నిర్మాణ కార్మికుల పొట్ట పై కొట్టింది వైసీపీ ప్రభుత్వం. ఆఖరికి భవన నిర్మాణ కార్మికుల బోర్డు డబ్బు కూడా వైసీపీ పక్కదారి పట్టించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిధులు ఇతర అవసరాలకి వాడుకునే అవకాశం లేకుండా చట్టం తీసుకొస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బోర్డు నిధులు కేవలం మీ సంక్షేమం కోసం మాత్రమే వినియోగిస్తాం. నియోజకవర్గ స్థాయిలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి బీసీలకు ప్రత్యేకంగా భూములు కేటాయించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.

పరిశ్రమలు తెస్తే పక్క రాష్ట్రాలకు తరిమేశారు!

టిడిపి ప్రభుత్వం స్థానికంగా ఉద్యోగాలు కల్పించడానికి కియా, జాకీ లాంటి అనేక సంస్థలు తీసుకొస్తే వైసీపీప్రభుత్వం కంపెనీలను తన్ని పక్క రాష్ట్రాలకు తరిమేసింది.  రైతుల్ని ఆదుకోవడానికి టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. పెట్టుబడి వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు. విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేశారు.  కదిరి లో టిడిపిని గెలిపిస్తే అభివృద్ది అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత నాది.       పట్ర కులస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇక్కడ ఎమ్మెల్యే సహకరించడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక నిర్మిస్తాం.

బీసీల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

పుష్పలత,వడ్డెర : వడ్డెర సామాజికవర్గానికి చెందిన మేము రాళ్ల పనికి వెళ్లి జీవనం సాగిస్తాం. మా భర్తలు ప్రమాదకరమైన పనుల్లో ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని  భయపడుతున్నాం. మాప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి కల్పించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా కులాన్ని ఆదుకోవాలి.

ప్రతాప్ : కదిరిలో బీసీ సామాజికవర్గంలో రైతులు అధికంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో సబ్సీడీలలో ట్రాక్టర్లు ఇచ్చారు. కానీ ప్రభుత్వం సబ్సీడీలన్నింటినీ రద్దు చేసింది. మళ్లీ మీ ప్రభుత్వం వస్తే రైతు రథాలకు 70 శాతం రాయితీ కల్పించి, వ్యవసాయ పనిముట్లు అందించాలి.

మనోహర్, కదిరి : మూడు నెలల క్రితం నా భార్య దారుణ హత్యకు గురైంది. కదిరి ప్రాంతంలో 20 ఏళ్ల చరిత్రలో లేని ఘటన ఇది. వాషింగ్ మెషిన్ ద్వారా వచ్చే వేస్టేజ్ వాటర్ కారణంగా వచ్చిన వివాదంతో నా భార్యను బండతో కొట్టి చంపారు. ఈ కేసులో ఇద్దరినిపై మాత్రమే కేసు నమోదు చేసి..మిగతా ఇద్దరిని వదిలేశారు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకూ న్యాయం జరగదు. మాకు ప్రాణపాయ స్థితి ఉంది. ప్రభుత్వం నుండి ఏలాంటి సాయమూ లేదు. మీ ప్రభుత్వం వచ్చాక నాకు న్యాయం చేయాలి. హత్యలో పాల్గొన్నవారిని చట్టపరంగా శిక్షించాలి.

రామ్ ప్రసాద్ (గౌడ): గౌడలు కల్లుగీసి జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో గౌడలకు పెన్షన్, ఇన్సూరెన్స్ కల్పించారు. కానీ ఈ ప్రభుత్వం వృథ్యాప్య పెన్షన్ తప్ప వృత్తిపరమైన పెన్షన్ ఇవ్వడం లేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అడిగితే లేవంటున్నారు. కల్లుగీసుకుంటుంటే కల్లు మాకే పోయాలని ఇక్కడివాళ్లు బెదిరిస్తున్నారు. బతకలేక బెంగళూరు వలసవెళ్తున్నాం. మాకు బీమా లేదు..మీరొచ్చాక కల్పించాలి. అన్ని మండలాల్లో భూములు కేటాయించి తాటిచెట్ల పెంపకానికి ప్రోత్సహించాలి. గౌడలకు ప్రభుత్వ మద్యం షాపుల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించాలి.

సోమశేఖర్ : బీసీలకు విదేవీ విద్య పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలి. ఉన్నత చదవుల్లో బీసీలను ప్రోత్సహించాలి. ఎస్సీ, ఎస్టీలకు పెట్టిన విధంగా బీసీలకు కూడా రెసిడెన్షియల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

దేవా: ఫోర్ వీలర్ ఉన్నవాళ్లకు రేషన్ కార్డు తొలగించారు. మేము నెలనెలా ఈఎమ్ఐ కట్టాలి. గత ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం బాగా ఉపయోగపడింది. మీ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు పునరుద్ధరణ చేయాలి. క్వారీల్లో పనిచేసే సమయంలో వడ్డెర్లు ప్రమాదాలకు గురవుతున్నారు. చనిపోయిన వాళ్లకు రూ.25 లక్షలు పరిహారం అందించాలి.

మైనారిటీల అభివృద్ధిపై బహిరంగచర్చకు రండి షరతుల్లేకుండా దుల్హాన్ పథకాన్ని అమలుచేస్తాం! మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేస్తాం సమస్యలపై పోరాడుతున్నందుకే దళిత ఎమ్మెల్యేకి అవమానం ముస్లింలతో ముఖాముఖిలో యువనేత లోకేష్

కదిరి: మైనారిటీల కోసం ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధం, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా రావాలి,  మైనారిటీ సమక్షంలోనే చర్చకు రావాలని టిడిపి యువనేత నారా లోకేష్ సవాల్ విసిరారు. కదిరి నియోజకవర్గం మొటుకుపల్లిలో మైనారిటీలతో యువనేత లోకేష్ సమావవేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ…. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మైనారిటీ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది.  వైసీపీ పాలనలో మైనారిటీల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదు. నంద్యాలలో అబ్ధుల్ సలాం కుటుంబం, పలమనేరులో మిస్బా, ఎమ్మిగనూరులో హజీరాబీని పొట్టనబెట్టుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ మైనారిటీల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య వంటి ఉన్నతమైన పథకాలను చంద్రబాబు అమలు చేశారు. ఈసారి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దుల్హాన్ పథకాన్ని ఎటువంటి షరతులు లేకుండా అమలుచేస్తాం.  

దళిత ఎమ్మెల్యేని శాసనసభ సాక్షిగా అవమానించారు!

సమస్యలపై పోరాడుతున్నందుకు దళిత శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామిపై వైసిపి ఎమ్మెల్యేలు దాడిచేశారు. ఆనాడు శాసనసమండలిలో చైర్మన్ షరీఫ్ ను ఓ మంత్రి దారుణంగా అవమానించారు. మైనారిటీలను గౌరవించాలని మనసులో ఉండాలి. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు మైనారిటీలను రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించారు.  టిడిపి ప్రభుత్వ హయాంలో కదిరిలో రూ.18కోట్లతో మొదటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరుచేసి 90శాతం పూర్తిచేస్తే ప్రస్తుత ప్రభుత్వం పాడుబెట్టింది. మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజిని కూడా 50శాతం పూర్తిచేయగా, మిగిలిన 50శాతం పనులు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో 1200 ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీచేస్తాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉర్దూ బ్యాక్ లాగ్ పోస్టులన్నీ భర్తీచేస్తాం. మైనారిటీలకు ఉర్దూ పాఠశాలలు అందుబాటులోకి తెస్తాం.

విదేశీవిద్యా పథకాన్ని అమలుచేస్తాం!

అన్ని వర్గాల విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించాలనేది చంద్రబాబు లక్ష్యం. ఈ పథకాన్ని వైసీపీ ప్ర‌భుత్వం దుర్మార్గంగా రద్దు చేశారు. మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక దాన్ని పునరుద్ధరిస్తాం. మైనారిటీలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గతంలో టీడీపీ కీలకపాత్ర పోషించింది. మేం తెచ్చిన అనేక కంపెనీలను వైసీపీ రాష్ట్రం నుండి తరిమేశారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పిస్తారు. ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించిన ఘనత చంద్రబాబుది. స్వయం ఉపాధి పొందేందుకు ఇస్లామిక్ బ్యాంకు ద్వారా లోన్లు ఇచ్చి, ప్రోత్సహిస్తాం. పారిశ్రామిక వేత్తలుగా ముందుకు తీసుకెళ్తాం. బీడీ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చిత్తూరు పర్యటనలో హామీ ఇచ్చాను. కదిరిలో ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసి వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం.

ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని పునరుద్దరిస్తాం!

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా సంవత్సరానికి రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు జగన్. ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసి విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని మోపాడు. నాలుగేళ్లలో ఒక్కొక విద్యార్థిపై రూ.లక్ష భారం మోపాడు. దీనివల్ల చదువులు పూర్తయినా ఫీజులు కట్టకపోవడం వల్ల సర్టిఫికెట్లు రాకపోవడంతో నిరుద్యోగులుగా యువత మిగిలిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రారంభిస్తాం. మీపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా విద్యార్థులకు చేదోడువాదోడుగా నిలుస్తాం.

మైనారిటీలతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

కరీమున్నీసా: ఉన్నత చదువులు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థికసాయం చేయాలి. ఉన్నత విద్య చదువుకున్న మైనారిటీలకు ఉద్యోగాలు కల్పించాలి.

సైదుబాషా: మైనారిటీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలి. విదేశీవిద్య పథకం స్కాలర్ షిప్ రాలేదని అడిగినా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఉపాధి అవకాశాలు కల్పించాలి.

రజాక్: కదిరిలో వైసీపీ రెండు సార్లు గెలిచిన తర్వాత మాకు ఖబరస్తాన్ కు 71సెంట్లు భూమి ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేయడానికి ఎమ్మెల్యే డబ్బులు అడుగుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా ఖబరస్తాన్ ను మాకు రిజిస్ట్రేషన్ చేయించాలి.

రఫీ: మైనారిటీల్లో బీడీ కార్మికులు ఉన్నారు. వారు అనారోగ్యానికి గురవుతున్నారు. భరోసా కల్పించండి.

సులేమాన్: మైనారిటీలకు అందుబాటులో ఉర్దూ పాఠశాలలు లేవు. మీరు అధికారంలోకి వచ్చాక ఉర్దూ పాఠశాలలు ఏర్పాటుచేయండి.

చాంద్ బాషా: దుల్హన్ పథకం అమలు కావడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక పథకాన్ని అమలు చేయండి. పథకం సొమ్మును లక్షరాయలకు పెంచండి.

అక్బర్: మైనారిటీ విద్యార్థులకు చదువుకునేందుకు వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక సాయం అందడం లేదు. వివిధ పథకాల పేర్ల చెబుతున్నారు. అవి అందడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా పిల్లలకు ఆర్థిక సాయం అందించండి.

దివ్యాంగుల బాలలతో ముచ్చటించిన యువనేత లోకేష్

కదిరి నియోజకవర్గం మొటుకుపల్లి గ్రామంలో ఆర్ డిటి ట్రస్ట్ నిర్వహిస్తున్న దివ్యాంగుల ఆశ్రమాన్ని యువనేత లోకేష్ సందర్శించారు. దివ్యాంగ పిల్లలతో సరదాగా ముచ్చటించి వారికి స్వీట్లు, చాక్లెట్లు పంచారు. మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఎలా చదువుతున్నారు, టీచర్లు బాగా చెబుతున్నారా అంటూ పిల్లలను కుశలప్రశ్నలు వేశారు. టీచర్లను గౌరవించాలి..వారు మనకోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఆశ్రమంలో పిల్లలకు అందుతున్న సౌకర్యాలు, వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లోకేష్ కుమారుడు దేవాన్ష్ కుమారుడికి దివ్యాంగ చిన్నారులు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో యువనేత మురిసిపోయారు.  తమకు పాఠశాలలో బోధిస్తున్న పాఠ్య పుస్తకాలు లోకేష్ కు చూపించారు. తాము నేర్చుకున్న పాఠాలను చిన్నారి కార్తికేయ  బోర్డుపై రాసి చూపించారు. ఆర్ డిటి ట్రస్ట్ కార్యకలాపాలు, ఆశ్రమంలో నిర్వహణ తీరును అనంతపురం ఆర్.డీ.టీ(రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్) డైరెక్టర్ దశరథ్ లోకేష్ కు వివరించారు. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో దివ్యాంగుల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతపురం జిల్లాలోకే 16ఆశ్రమ పాఠశాలలున్నాయని తెలిపారు. దివ్యాంగుల పూర్వపు చట్టాల్లో 7రకాల దివ్యాంగులకు మాత్రమే గుర్తింపు ఉందని, 2016 ఆర్.పీ.డబ్ల్యు.డీ చట్టం లో 21రకాల దివ్యాంగులకు గుర్తింపునిచ్చేందుకు అవకాశం ఉందని, దాని అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 రకాల దివ్యాంగులకు మాత్రమే సర్టిఫికెట్లు వస్తున్నాయని, మిగిలిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, దీనివల్ల మరింతమందికి  సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక తప్పకుండా దివ్యాంగుల సమస్యలపై చర్యలు తీసుకుంటామని, 21రకాల దివ్యాంగులకు సర్టిఫికెట్లు వచ్చేందుకు చొరవ తీసుకుంటానని యువనేత హామీ ఇచ్చారు. దివ్యాంగ పిల్లలు, సిబ్బందితో యువనేత సరదాగా ఫోటోలు దిగారు.

యువనేతను కలిసిన స్వర్ణకార సంఘం ప్రతినిధులు

కదిరి ఎంజి రోడ్డులో స్వర్ణకార సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.  వ్యాపారం, పని చేసే ప్రాంతాల్లో ఎదుర్కుంటున్న సమస్యలను లోకేష్ కు వివరించారు. స్వర్ణ కారుల సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది. మంగళగిరి లో స్వర్ణ కారులను ఆదుకోవడానికి లక్ష్మి నరసింహ స్వర్ణకార సొసైటీ ఏర్పాటు చేశాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణ కారులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తాం. పని చేసుకోవడానికి మెరుగైన వసతులతో కూడిన వర్క్ షాప్స్, ఆదునిక పనిముట్లు అందిస్తాం. పిల్లల చదువుకు సహాయం, ఆరోగ్య భద్రత, ఇన్స్యూరెన్స్ కల్పిస్తాం. పోలీసుల వేధింపులు లేకుండా చూస్తాం.

యువనేతను కలిసిన ఆర్యవైశ్య ప్రముఖులు

కదిరి దేవళం బజారులో యువనేత నారా లోకేష్ ను ఆర్యవైశ్య ప్రముఖులు కలిసి సమస్యలు విన్నవించారు. వ్యాపారం నిర్వహణలో ఎదుర్కుంటున్న సమస్యలు లోకేష్ కి తెలిపారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ…. ఆర్యవైశ్యలు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. జగన్ పాలనలో వ్యాపారాలు నిర్వహించడం ఎంత కష్టం గా మారిందో నాకు తెలుసు. పెరిగిన విద్యుత్ బిల్లులు, చెత్త పన్ను, పన్నుల భారం తో వ్యాపారాలు నిర్వహించడం మీకు భారం గా మారింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీపై అదనంగా మోపిన భారాన్ని తగ్గిస్తాం. వేధింపులు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.

Also, read this blog: Progressing to the Next Level of Achievement in Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *