Nara Lokesh Yuvagalam Padayatra

యువగళం పాదయాత్రలో ఉరకేస్తున్న ఉత్సాహం! దారిపొడవునా జననీరాజనం… మంగళహారతులు కార్యకర్తల నడుమ ఆవిర్భావ వేడుకల్లో యువనేత లోకేష్ సీనియర్ నేతలకు, కార్యకర్తలకు సత్కారం యువనేతకు సంఘీభావం తెలిపిన జెసి ప్రభాకర్ రెడ్డి, సునీత, కాల్వ

పెనుకొండ: పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో యువగళం పాదయాత్ర పార్టీ అభిమానులు, కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. యువగళం పాదయాత్ర 54వరోజు సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనిపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల నివాళులర్పించిన యువనేత, అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ నేతలు, కార్యకర్తలను ఈ సందర్భంగా సత్కరించి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. తర్వాత పాదయాత్ర ప్రారంభించిన యువనేతకు దారిపొడవున జనం నీరాజనాలు పలికారు. సోమందేపల్లి ఎస్సీ కాలనీ వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై యువనేతకు వినతిపత్రం సమర్పించారు. ఎన్టీఆర్ సర్కిల్ లో చేనేత, మరమగ్గాల కార్మికులను యువనేత కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక కార్మికుడి ఇంటిలోకి వెళ్లి మగ్గాన్ని పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సాదకబాధలు విన్నారు.  సోమందేపల్లిలో Nara Lokesh కి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. మహిళలు పెద్దఎత్తున యువనేతకు ఎదురేగి హారతులు పట్టారు. లోకేష్ ని కలిసి తమ బాధలు చెప్పుకోవడానికి భారీగా జనం రోడ్లపైకి వచ్చారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్దులు చెప్పిన సమస్యలను యువనేత ఓపిగ్గా విన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి బ్రతకడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. పన్నుల భారం విపరీతంగా పెంచేశారు. ఆఖరికి చెత్త పన్ను కూడా కట్టాలి అంటూ వేధిస్తున్నారని మహిళలు వాపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తానని హామీ ఇచ్చారు. వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెనుకొండ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వ్యాపారులు, కురుబలు, బోయలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. యువనేతను టిడిపి సీనియర్ నేతలు జెసి ప్రభాకర్ రెడ్డి, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, గంటి హరీష్ కలిసి సంఘీభావం తెలిపారు. పెనుకొండలో యువనేతను చూసేందుకు రోడ్లవెంట పెద్దఎత్తున జనం బారులు తీరారు. భవనాలపై నిలబడి యువనేతకు చేతులు ఊపుతూ సంఘీభావం తెలిపారు.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

ఇళ్లు ఇప్పించాలి: సూర్యనారాయణ, సోమందేపల్లి

మా గ్రామంలో ప్రతి ఇంట్లో రెండు నుండి మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఇంటి పట్టాలు ఇచ్చారు. కానీ ఇళ్లు మంజూరు చేయలేదు. ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. అధికారులకు ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. TDP వచ్చాక అయినా మాకు ఇళ్లు  మంజూరు చేసి ఆదుకోవాలి.

తాగునీటి సదుపాయం కల్పించాలి: వీరేంద్ర, సోమందేపల్లి

సోమందేపల్లి మండలం దళిత కాలనీల్లో తాగునీటి సౌకర్యం లేదు. అక్కడ సుమారు 20వేల మంది జనాభా ఉన్నారు. దళిత కాలనీలో టీడీపీ పాలనలో నీటిశుద్ధికేంద్రం ఉండేది. ఇప్పుడు అది ఉపయోగంలో లేదు. మేమంతా మంచినీరు కొనుక్కునున తాగుతున్నాం. ఒక బిందెడు నీళ్లు రూ.15 పెట్టి కొంటున్నాం. ఎమ్మెల్యే, స్థానిక నాయకులకు ఎన్నిసార్లు మా కష్టాలు చెప్పినా మా సమస్యలపై స్పందించడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మాకు తాగునీటి పంపిణీ సౌకర్యం కల్పించాలి.

కమ్యూనిటీ భవనం నిర్మించాలి: రామాంజనేయులు, సోమందేపల్లి:

సోమందేపల్లి మండల దళితులకు వివిధ కార్యక్రమాలు చేసుకునేందుకు కమ్యూనిటీ భవనం లేదు. అద్దె భవనాలపై ఆధారపడాల్సివస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేకు ఈ సమస్యపై ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చాం. కనీసం మా వైపు చూడలేదు. మండల కేంద్రంలో దళితులకు వ్యాపారాలు చేసుకునేందుకు ఓ కాంప్లెక్స్ నిర్మించాలని ఎప్పటి నుండో నాయకులను కోరుతున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కమ్యూనిటీ భవనం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి వాటికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం అని పేరు పెట్టాలని కోరుతున్నాం.

*యువగళం క్యాంపు సైట్ లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు*

*జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్ కు నివాళులర్పించిన యువనేత లోకేష్*

తెలుగుదేశంపార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పెనుకొండ నియోజకవర్గం నల్లగొండ్రాయునిపల్లి యువగళం క్యాంప్ సైట్ లో కార్యకర్తల నడుమ బుధవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన యువనేత లోకేష్… అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువనేత లోకేష్ కార్యకర్తలకు స్వీట్లు పంచారు. పరిటాల సునీత, బీకే పార్థసారధి, సవిత, బీవీ రాముడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆవిర్భావం నుండి పార్టీకి సేవలందిస్తున్న సీనియర్ నాయకులను యువనేత నారా లోకేష్ సన్మానించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీకి వారు దశాబ్ధాలుగా చేస్తున్న కృషిని కొనియాడారు. పార్టీ సీనియర్ నాయకులను పూలమాల, శాలువాలతో సత్కరించారు. కాసేపు వారితో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

*పార్టీకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం! – ఎన్.నాగభూషణం, టిడిపి సీనియర్ నాయకులు*

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుగారు తెలుగుదేశంపార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో కదిరి నియోజకవర్గం, నల్లచెరువు మండలంలో తెలుగుదేశంపార్టీ నాయకులు జొన్నా ఆదినారాయణరావు పార్టీ కార్యకర్తలను సిద్ధం చేశారు. ఆ సమయంలో నేను పార్టీలో కార్యకర్తగా నా ప్రస్థానాన్ని ప్రారంభించాను. ఆనాడు తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తగా సభ్యత్వం తీసుకున్నాను. ఆనాటి నుండి తెలుగుదేశం పార్టీలోనే నా ప్రయాణం కొనసాగిస్తూ, పార్టీకి నా వంతు సహాయసహకారాలు అందిస్తూ వస్తున్నాను. పార్టీలో నేను వివిధ హోదాల్లో పనిచేశాను. నల్లచెరువు మండల పార్టీ కన్వీనర్ గా 30ఏళ్లపాటు సేవలందించాను. నల్లచెరువు మండలం ఎంపీటీసీ, సింగిల్ విండో డైరెక్టర్, జెడ్పీటీసీగా పనిచేశాను. ప్రస్తుతం సత్యసాయిజిల్లా పార్టీ కార్యదర్శిగా సేవలందిస్తున్నాను. సరిపూడి నారాయణరావు, బీకే పార్థసారథి, నిమ్మల కిష్టప్ప, ఎస్.వెంకటరెడ్డి, పల్లె రఘనాథరెడ్డి, బాలకృష్ణతో పార్టీ కోసం పనిచేశాను. నా రాజకీయ ప్రయాణం తెలుగుదేశంతో మొదలైంది..తెలుగుదేశంతోనే ముగుస్తుంది. పార్టీకోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధం.

పన్నుమీద పన్నులు కట్టలేక వ్యాపారాలు మూతపడ్డాయి మార్కెట్లన్నీ దళారుల చేతిలోకి వెళ్లిపోయాయి  అధికారంలోకి వచ్చాక చిన్నపరిశ్రమలకు రాయితీలు వ్యాపారులతో ముఖాముఖిలో యువనేత లోకేష్

పెనుకొండ: చెత్త పన్ను, బోర్డు పన్ను, బాత్ రూం పన్ను, ఎఎల్ డి, ఎసిడి పేరుతో విద్యుత్ ఛార్జీల బాదుడు ఇలా వ్యాపారస్తుల పై పన్ను విపరీతంగా పెరిగిపోయాయి. ప్రాపర్టీ ట్యాక్స్ అడ్డగోలుగా పెంచి వ్యాపారస్తులపై పెను భారం పెంచారు. జే ట్యాక్స్ కట్టలేక వ్యాపారాలు మూసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. కరోనా తరువాత ఇస్తామన్న రీస్టార్ట్ ప్యాకేజ్ కూడా వైసిపి ప్రభుత్వం ఇవ్వలేదు. వైసిపి పాలనలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి దేశంలోనే నంబర్ 1.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తాం. ఆక్వా రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసారు వైసిపి. ఆక్వా రంగానికి ఇచ్చే సబ్సిడీలు అన్ని రద్దు చేశారు. ఒక్క కియా వలన ఉమ్మడి అనంతపురం జిల్లా లో తలసరి ఆదాయం 30 వేలు పెరిగింది. కానీ వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత అనుబంధ సంస్థలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. కియా పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడానికి చంద్రబాబు చాలా కష్టపడ్డారు. కానీ జగన్ సీఎం అయ్యాక కియా యాజమాన్యానికి కనీసం జగన్ 6 నెలలు వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అనుబంధ సంస్థలు కూడా వచ్చి ఉంటే ఇంకో లక్ష ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు జిల్లాలో వచ్చేవి. వైసిపి పాలన లో ఇసుక, సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది.  టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక తక్కువ ధరకు అందిస్తాం.

రాయితీలు ఇస్తేనే చిన్నపరిశ్రమల మనుగడ!

చిన్న పరిశ్రమలు  ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తాయి. చిన్న పరిశ్రమ దారులను ప్రోత్సహించేందుకు గతంలో మేము భూములు కూడా సేకరించాం. విద్యుత్ ఛార్జీలు తగ్గించి, రాయితీలు ఇస్తేనే చిన్న పరిశ్రమలు నిలదొక్కుకుంటాయి. గతంలో మాదిరిగానే చిన్న పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ఆదుకుంటాం. వక్కపంట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సిమెంట్ ధరల పెరుగుదలపై సమీక్షించి తగ్గించేవారు. నేను మంత్రిగా ఉన్నపుడు రూ.8 వేల కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ తో పనులు నిర్వహించాం. ఈ ప్రభుత్వం మూలధన వ్యయం చేయడం లేదు. మా ప్రభుత్వం వచ్చాక మూలధన వ్యయాన్ని పెంచుతాం. గతంలో రైతులను ఆదుకున్న విధంగానే ఆదుకుని, పెట్టుబడి తగ్గించి వ్యవసాయాన్ని లాభిసాటిగా చేస్తాం.

అధికారంలోకి వచ్చాక తెలుగు జిఎస్టీ పోర్టల్!

ఆస్తిపన్నును ఈ ప్రభుత్వం విలువ ఆధారంగా పెట్టింది. హైదరాబాద్ కన్నా ఎక్కుక ఆస్తి పన్ను వసూలు చేస్తోంది. కానీ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ కింద తీసుకురావడానికి సమయం పడుతుంది. అధికారంలోకి వచ్చాక 3 నెలల్లో తెలుగులో జీఎస్టీ పోర్టల్ తెలుగులో వచ్చేలా చేస్తాం. నిత్యవసర సరుకుల ధరలు పెరగడానికి కూడా కారణం పెట్రోల్, డీజల్ ధరలు పెరగడం. రాష్ట్రంలో ఒక్క పెట్రోల్, డీజల్ ధరలే కాదు కరెంటు, బస్సు ఛార్జీల ధరలు ఎక్కువగా ఉన్నాయి. మేము అధికారంలోకి పెట్రోల్, డీజిల్ పై ఉన్న పన్నులు తగ్గించి ధరలు తగ్గిస్తాం. ఈ కామర్స్ పోయి క్విక్ కామర్స్ వచ్చింది. మా ప్రభుత్వం వచ్చాక కిరాణా షాపు వాళ్లు ప్రభుత్వానికి కట్టే పన్నులు తగ్గించే ప్రయత్నం చేస్తాం. పన్నులు పెంచి ఆర్థికంగా ఇబ్బందిపెడుతోంది.

*వ్యాపారులు మాట్లాడుతూ….*

వైసిపి పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. పన్నుల భారం తో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి. చెత్త పన్ను, బోర్డు పన్ను, పెరిగిన కరెంట్ ఛార్జీలు, బాత్ రూం పై పన్ను ఇలా అనేక భారాలతో వ్యాపారాలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. వైసిపి ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్ విపరీతంగా పెంచడంతో అద్దెలు పెరిగి వ్యాపారాల్లో ఏమి మిగలడం లేదు. కరోనా సమయంలో చిరు వ్యాపారులను ఆదుకుంటాం అని వైసిపి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ రోజు వరకూ రీస్టార్ట్ ప్యాకేజీ అందలేదు. చిన్న పరిశ్రమలు నిర్వహించే వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందించడం లేదు. వ్యాపారాలు నిర్వహించడానికి ప్రభుత్వం రుణాలు ఇవ్వడం లేదు. ఇసుక లేక నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయ్యింది.

యువనేత ఎదుట వ్యక్తమైన వ్యాపారుల సమస్యలు:

రామకృష్ణ, పెట్రోల్ వ్యాపారి : రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ ధరలు బాగా పెరిగాయి. బంకుల్లో పని చేసేవాళ్లకు మేం జీతాలివ్వలేక, మెయింటెన్స్ చేయలేక కొన్నింటిని మూసేశాం. కర్నాటక కంటే ఇక్కడ డీజల్ రూ.12, పెట్రోల్ రూ.10 అధికంగా ఉంది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల కర్నాటక బార్డర్ కు వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనడం వల్ల ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ లో నష్టం వస్తోంది.

సోమశేఖర్, ఎర్రమంచి : మీ ప్రభుత్వంలో కియా కార్ల పరిశ్రమ వచ్చాక ట్రాన్స్ పోర్ట్ కోసం కాంట్రాక్టు తీసుకుని నేను 12 లారీలు నడిపా. రెండేళ్లుగా నా లారీలన్నీ పక్కనబెట్టా. లారీలు నడిపే కాంట్రాక్టును ఇక్కడి ఎమ్మెల్యే, వాళ్ల మనుషులు దౌర్జన్యంగా నా నుండి లాక్కున్నారు.

శ్రీనివాసులు : ఆస్తిపన్ను 15 శాతం పెంచుతున్నారు. ఆస్తిపన్నులో మీ ప్రభుత్వం వచ్చాక తగ్గించడానికి చర్యలు తీసుకోండి. గుజరాత్ లో జీఎస్టీ పోర్టల్ గుజరాతీ భాషలో ఉన్నాయి.. మన రాష్ట్రంలో కూడా జిఎస్టీ పోర్టల్ తెలుగులో ఉంటే వ్యాపారులకు సౌకర్యంగా ఉంటుంది.

కె.రాజేష్, కిరాణా షాపు : మాల్స్, ఆన్ లైన్ వ్యాపారం పెరిగడంతో మా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మీ ప్రభుత్వం వచ్చాక మాకు ప్రత్యామ్నాయం చూపాలి. కరోనా సమయంలో ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు.

డి.కె.శివయ్య, పెనుగొండ : కియా సంస్థ వచ్చినప్పుడు నేను వై.జంక్షన్ లో 40 రూములతో లాడ్జి కట్టాను. అప్పుడు రూ.12లక్షలు రెంట్ వచ్చేది ఇప్పుడు రూ.3 లక్షలే వస్తోంది. ఈఎమ్ఐ కట్టేందుకూ ఇబ్బంది పడుతున్నా. వ్యాపారం కుప్పకూలిపోయింది.

నగేష్, మడకశిర : 95 శాతం మంది రైతులు ఇక్కడ వక్క, శనగపంట సాగు చేస్తారు. వక్క మార్కెట్ స్థానికంగా లేదు. దీంతో బయట రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోంది. వక్క పంటను ప్రాసెస్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది. వర్కర్లు కూడా దొరకడం లేదు..యంత్రాలు కూడా ఖర్చు అవుతున్నాయి. చిన్న పరిశ్రమల స్థాపనకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.

కొత్తిమీర వ్యాపారి : నేను పెనుగొండలో కొత్తిమీర వ్యాపారం చేస్తా. గత ప్రభుత్వంలో ఇన్ పుట్ సబ్సీడీలు, నష్టపరిహారం కలిసి లక్ష వరకూ రైతులకు అందేవి. దాంతో తక్కువధరకు సరుకు లభించి వ్యాపారం బాగుండేది. ఇప్పుడు రాయితీలు లేకపోవడంతో ధరలు పెంచేశారు. రెండేళ్లుగా వ్యాపారం లేక ఉపాధి కోల్పోయా.

సురేంద్ర, సిమెంట్, ఐరన్ వ్యాపారి : నెలకు 200 టన్నులు ఇనుము వ్యాపారం చేస్తాం. గత ప్రభుత్వంలో నాకు 3వ ర్యాంకు వచ్చింది..ఇప్పుడు లాస్ట్ ర్యాంకులో ఉన్నా. ఇసుక ధరలు పెరగడం వల్ల ఐరన్ కొనుగోలు తగ్గింది.

నిమ్మకాయల రాము, మార్కెట్ ప్రెసిడెంట్, హిందూపురం : రూ.23 కోట్లతో హిందూపురంలో టీడీపీ ప్రభుత్వం మార్కెట్ ను నిర్మించింది. జిల్లా కేంద్రం అని చెప్పి ప్రభుత్వం ఫ్రూట్, ఫ్లవర్ మార్కెటింగ్ వస్తుందని చెప్పడంతో గుడ్ విల్ రూపంలో రూ.18 కోట్లను వ్యాపారులు ప్రభుత్వానికి ఇచ్చారు. 370 షాపులకు గాను 80 షాపులు మాత్రమే నడుస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.

టిడిపి ఆవిర్భావంతోనే బిసిలకు రాజకీయ స్వాతంత్ర్యం! కురుబ, బోయ కార్పొరేషన్లకు రూ.300 కోట్లు ఖర్చుచేశాం వైసిపి అధికారంలోకి వచ్చాక బిసిలపై 26వేల తప్పుడుకేసులు కురుబ, బోయలతో యువనేత లోకేష్ ముఖాముఖి

పెనుకొండ: బీసీలకు నిజమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్రం వచ్చింది 1983లోనేనని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పెనుకొండ ఎన్-గ్రాండ్ కన్వెన్షన్ హాల్ లో బోయ,కురుబ సామాజికవర్గంతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… స్థానిక సంస్థల్లో బీసీలకు 20శాతం ఎన్టీఆర్ ఇచ్చారు. దాన్ని 34శాతం చేసింది చంద్రబాబు. ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు బీసీలకు అత్యధికంగా ఇచ్చిన ఘనత టీడీపీది.బీసీ సాధికార సమితులతో బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. టీడీపీ పాలనలో కురుబ, బోయ కార్పొరేషన్ కు సంవత్సరానికి రూ.300కోట్లు చొప్పున కేటాయించి వారి సంక్షేమానికి పెద్దపీట వేశారు. వైసీపీ ప్రభుత్వం బోయ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వకుండా చేసింది. వాల్మీకీలకు కార్పొరేషన్ పెట్టి, నిధులు కేటాయించి, ఖర్చు చేసింది చంద్రబాబు. మేం అధికారంలోకి వచ్చాక గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తాం.   

గతంలో ఎన్నడూ లేనివిధంగా బిసిలపై తప్పుడు కేసులు

గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. ఇప్పటి వరకు 26వేల అక్రమ కేసులు పెట్టారు. బీసీలను రక్షించేందుకు బీసీ అట్రాసిటీ చట్టం తెస్తాం. మానిటరింగ్ కమిటీలు జిల్లా స్థాయిల్లో నియమిస్తాం. పటిష్టంగా చట్టాన్ని అమలు చేస్తాం. కార్పొరేషన్ చైర్మన్ కు కనీసం కుర్చీకూడా ఇచ్చిన దాఖలాలు లేవు. టీడీపీ పాలనలో మేం వివిధ సామాజికవర్గాలకు ఎంత ఖర్చుపెట్టామో, వైసీపీ ఎంత ఖర్చుపెట్టిందో బహిరంగ చర్చకు రావాలని పాదయాత్ర ప్రారంభం నుండి సవాల్ విసురుతూనే ఉన్నా. ఎవరూ అంగీకరించి ముందుకు రావడం లేదు. రానున్న కాలంలో చట్టసభల్లో బోయ, కురుబలకు రాజకీయంగా పెద్దపీట‌ వేస్తాం. బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కేంద్రం ఇటీవల 15కులాలను ఎస్టీ జాబితాలో చేర్చింది. కానీ ఏపీ ప్రభుత్వం కనీసం మన రాష్ట్రంలోని కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు నోరెత్తలేదు. ఎస్టీల ప్రయోజనాలు దెబ్బతినకుండా వాల్మీకీ, బోయల్ని ఎస్టీ జాబితాలో చేయడంపై అధ్యయనం చేస్తాం. కొంత మంది కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. టీడీపీ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎట్టిపరిస్థితుల్లో మారదని గుర్తుపెట్టుకోండి.

కురుబ కార్పొరేషన్ కు రూ.300 కోట్లు ఇచ్చాం!

కురుబల సంక్షేమానికి గత ప్రభుత్వం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. కురుబ ఫెడరేషన్ ను 2017లో ఏర్పాటు చేసి మొదటి సంవత్సరమే రూ.300కోట్లు ఖర్చు చేశాం. కురుబ కమ్యూనిటీ భవనాలు కట్టేందుకు ఉమ్మడి అనంతపురంజిల్లాకు రూ.10కోట్లు కేటాయించాం. భవనాలు 90శాతం పూర్తిచేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక మిగిలిన 10శాతాన్ని పూర్తిచేయకుండా వదిలేశారు. కురుబలకు గొర్రెల యూనిట్లు ఇచ్చి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాం. ఉమ్మడి అనంతపురంజిల్లాలో గొర్రెలు కొనేందుకు రూ.25కోట్లు ఖర్చుపెట్టాం. రూ.4లక్షల లోన్లలో 50శాతం సబ్సిడీలు ఇచ్చాం. కురుబ కార్పొరేషన్ కు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం. వీరప్పగారి దేవాలయం నిర్మాణం, అందులో అర్చకుల నియామకానికి ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం.

కురుబ, బోయలతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

రమణ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో బోయ,కురుబలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి.

రాజు: వాల్మీకీ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి.

గిరి: కురుబలు బీసీ-బీ కేటగిరీలో ఉంది. రిజర్వేషన్ పరంగా పోటీ ఎక్కువగా ఉంది. బీసీ-బీ నుండి వేరే కేటగిరీలోకి మార్చాలి.

ఆంజనేయులు: వాల్మీకీ బోయల్ని కేవలం 4జిల్లాల వారినే ఎస్టీ జాబితాలో చేరుస్తూ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేశారు. రాష్ట్రమంతా చేర్చేలా చర్యలు తీసుకోండి.

నాగేంద్ర: మేం కురుబ సామాజికవర్గం. అమరావతి రాజధానిలో మాకులదైవం కనకదాసు దేవాలయం నిర్మించాలి. మాకు గొర్రెల యూనిట్లు ఇవ్వాలి. వీరప్పగారి దేవాలయాలు నిర్మించాలి.

రామప్ప: వాల్మీకీ, బోయల్లో చదువుకున్న యువతకు రాజకీయ పదవులు కేటాయించాలి.

రమేష్: హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో వాల్మీకీలకు సీటు ఇవ్వాలి. వాల్మీకీలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేయాలి.

యువనేతను కలిసిన రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ప్రతినిధులు

పెనుగొండ నియోజకవర్గం నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యంచేసి, బ్రాహ్మణులకోసం గత ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలన్నీ రద్దుచేశారు. పేద బ్రాహ్మణులు మరణించినపుడు అంత్యక్రియల కోసం రూ.10వేలు ఇచ్చే గరుడ పథకాన్ని కూడా రద్దుచేసి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించలేని పరిస్థితులు కల్పించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరించి బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు తీసుకోండి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో బ్రాహ్మణులకు గృహనిర్మాణం చేపట్టి అగ్రహారాలను అభివృద్ధి చేయండి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలకేంద్రాలు, పట్టణాల్లో బ్రాహ్మణ భవన్ లు నిర్మించాలి. అలాగే అపరకర్మలు చేసుకోవడానికి స్థలాలు కేటాయించి భవనాలు నిర్మించాలి. మండల పరిషత్, జిల్లాపరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బ్రాహ్మణులకు సీట్లు ఇచ్చి ప్రాతినిధ్యం కల్పించండి. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించండి. 2024 ఎన్నికల్లో బ్రాహ్మణులకు 1 ఎంపి, 3 ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించాలి.

*యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…*

బ్రాహ్మణ సమాజంలో పేదరికాన్ని గుర్తించి దేశంలోనే తొలిసారిగా 2014 ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ.300 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత చంద్రబాబునాయుడు గారిది. పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం భారతి విద్యాపథకం, గాయత్రి విద్యాప్రశక్తి పథకం, వశిష్ట విద్యాపథకం, ద్రోణాచార్య పథకాలను అమలుచేసి పోటీపరీక్షలకు శిక్షణ కూడా ఇప్పించాం. చాణుక్య పథకం ద్వారా వ్యాపారాలు, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించుకునేందుకు ఆర్థికసాయం కూడా అందించాం. గరుడ పథకం ద్వారా పేద బ్రాహ్మణులు మరణించినపుడు అంత్యక్రియల నిర్వహణకు రూ.10వేల రూపాయలు అందజేశాం. కనీస మానవత్వం లేని వైసీపీ ప్ర‌భుత్వం చివరకు పేదబ్రాహ్మణులు గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు ఉద్దేశించిన పథకాన్ని కూడా రద్దుచేశారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. గత ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలన్నింటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్దరిస్తాం. పేద బ్రాహ్మణులకోసం ఇళ్లస్థలాలు కేటాయించి పక్కాగృహాలు నిర్మిస్తాం. మీ అందరి సంక్షేమానికి పాటుపడే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

యువనేతను కలిసి సమస్యలు విన్నవించిన సోమందేపల్లి ఎస్సీ కాలనీవాసులు

పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి ఎస్సీ కాలనీవాసులు యువనేత నారా లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. సోమందేపల్లి ఎస్సీ కాలనీలో సుమారు 800 ఎస్సీ కుటుంబాలు నివాసముంటున్నాం. మేము కూలీపనులు, వ్యవసాయం, చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మాలో చాలామందికి ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరుచేయలేదు. మా కాలనీలో గత ప్రభుత్వంలో నిర్మించిన వాటర్ ప్లాంటును ప్రస్తుతం మూలనపెట్టారు. దీంతో బిందె 10రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మంచినీటి సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. శుభకార్యాల నిర్వహణ కోసం అంబేద్కర్ భవన్ నిర్మించాలని కోరినా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల ఓట్లతో అధికారం చేపట్టిన వైసీపీ ప్ర‌భుత్వం ఆయా వర్గాలన్నింటికీ తీరని అన్యాయం చేశారు. ఎస్సీల సంక్షేమానికి ఉద్దేశించిన రూ.28వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను ఇతర పథకాలకు మళ్లించి తీరని ద్రోహం చేశారు. పేదల సెంటుపట్టా పేరుతో రూ.7వేల కోట్లరూపాయల అవినీతికి పాల్పడ్డారు. సోమందేపల్లి ఎస్సీ కాలనీలో దళిత సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ టిడిపి అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం. మంలో వాటర్ ప్లాంట్ ను పునరుద్దరించి, ఇళ్లులేని వారందరికీ పక్కాగృహాలు మంజూరుచేస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేసి స్వయం ఉపాధికి విరివిగా రుణాలు అందజేస్తాం. పేదల పక్షపాతి చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

యువనేతను కలిసిన పట్టురైతులు

పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో ఎపి పట్టు రైతుల రాష్ట్ర కమిటీ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. రాష్ట్రంలో అతితక్కువ వర్షపాతం కలిగిన శ్రీ సత్యసాయిజిల్లాలో ఎక్కువమంది రైతులు మల్బరీ సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టురైతులకు కిలోకి రూ. 50 ప్రోత్సహకంగా అందించారు. డ్రిప్, మొక్కల కొనుగోలు, షెడ్ల నిర్మాణానికి సబ్సిడీతోపాటు రాయితీపై స్ప్రేయర్లు, ఇతర పనిముట్లు అందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా గతంలో పట్టురైతులకు ఇచ్చిన సబ్సిడీలన్నీ ఎత్తేశారు. రైతులు, రీలర్లకు సుమారు 55 కోట్లరూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. మేం ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసినా ఎటువంటి స్పందన లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించి, గత ప్రభుత్వంలో అమలుచేసిన సబ్సిడీలను పునరుద్దరించండి. ఎన్ఆర్ఇజిఎస్ ను పట్టుపురుగుల పెంపకానికి అనుసంధానం చేసి కూలీల కొరత తీర్చండి.

*యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో రైతురాజ్యం తెస్తానన్న వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్న వెన్ను విరుస్తున్నారు. వైసిపి పాలనలో పట్టురైతులతోపాటు అన్నివర్గాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల అకాలవర్షాల కారణంగా రైతాంగ తీవ్రంగా నష్టపోగా కనీసం ఆ ప్రాంతాల్లో పర్యటించే దిక్కులేదు. గోరుచుట్టుపై రోకటిపోటుగా మోటార్లకు మీటర్లు పెట్టి రాయలసీమ రైతుల మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో పట్టురైతులకు ఇచ్చిన రాయితీలన్నీ పునరుద్దరిస్తాం, పట్టురైతులకు సంబంధించిన బకాయిలను విడుదల చేస్తాం. ఎన్ఆర్ఈజిఎస్ ను పట్టుసాగుకు అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తాం.

చేనేత, మరమగ్గాల కార్మికులను కలిసిన యువనేత లోకేష్

సోమందేపల్లి ఎన్టీఆర్ సర్కిల్లో చేనేత, మరమగ్గాల కార్మికులను యువనేత లోకేష్ కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సోమందేపల్లిలో 6వేల కుటుంబాలు చేనేత, మరమగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. చేనేత పని తప్ప మరే పని తెలియని చేనేత కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో సోమందేపల్లిలో 1350 మందికి పట్టు రాయితీ సబ్సిడీ అందేది. ప్రస్తుతం వివిధ కారణాలు చూపించి అర్హులైనా కూడా కేవలం 300 మందికి మాత్రమే ఇస్తున్నారు. నేతన్న నేస్తం పథకం ఇస్తున్నామన్న సాకుతో సుమారు వెయ్యిమందికి పైగా పట్టు రాయితీ కట్ చేశారు. కేవలం సొంత ఇంటిలో ఉన్న మగ్గం కు మాత్రమే నేతన్న నేస్తం పథకం అమలు చేస్తున్నారు. మాస్టర్ వీవర్ దగ్గర మగ్గం నేసే వరకు వర్క్ షెడ్ లలో పనిచేసే కార్మికులకు నేతన్న నేస్తం ఇవ్వడంలేదు.  ముడిసరుకులైన పట్టు, జరీ, అద్దకపు రంగుల రేట్లు విపరీతంగా  పెరిగిపోయాయి. గత  ప్రభుత్వ హయాంలో రేషం కిలో కేవలం రూ . 3500/- మాత్రమే ఉండగా ప్రస్తుతం కిలో రూ .6500/- వరకు పెరిగింది. ముడిసరుకుల ధరలు ధరలు విపరీతంగా పెరిగి, కొనుగోలు శక్తి పడిపోయి చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. గత ప్రభుత్వ  హయాంలో ఆదరణ పథకం ద్వారా చేనేత మగ్గాల ఆధునీకరణకు 90 శాతం సబ్సిడీపై పరికరాలను అందించగా, ప్రస్తుతం ఆ పథకాన్ని పూర్తిగా రద్దుచేశారు. గత ప్రభుత్వ హయంలో 50ఏళ్లు నిండిన చేనేత కార్మికునికి చేనేత పింఛన్ ఇవ్వగా, ఇప్పుడు వివిధ రకాల సాకులతో చేనేత పింఛన్లను తగ్గించేశారు. చేనేతలకు ఉచిత విద్యుత్, ఉచిత ఆరోగ్య బీమా పథకాలను కూడా పూర్తిగా రద్దుచేశారు. చేనేత కార్మికులకు ముడిసరుకు కొనుగోలుకు ఎటువంటి రుణాలు మంజూరు చేయడం లేదు. మరమగ్గాలపై సబ్సిడీని 50శాతం నుంచి 35శాతానికి తగ్గించడమేగాక రకరకాల కొర్రీలతో దీర్ఘకాలంగా పెండింగ్ లో పెట్టారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచడంతో గతంలో 500 నుంచి రూ.1000 వచ్చే కరెంట్ బిల్లు ప్రస్తుతం రూ.2వేల నుంచి రూ.3వేలవరకు వస్తోంది. అదేవిధంగా జిఎస్టీ, ఇన్కమ్ టాక్స్ చెల్లించాల్సి రావడం, 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంట్ వినియోగం వల్ల మరమగ్గాల యజమానులకు రేషన్ కార్డుతో పథకాలు కట్ చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే, పరిహారం అందజేయకపోగా, కనీసం పరామర్శించే నాథుడే కరువయ్యాడు. టిడిపి అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి అండగా నిలవండి.

*యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…*

వైసిపి ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా చేనేతరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత నాలుగేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు వైసిపి ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం అందించలేదు. తీవ్ర ఇబ్బందుల్లో చేనేతల సంక్షేమానికి ఉదారంగా సాయం అందజేయకపోగా, వివిధరకాల సాకులతో చేనేతల రేషన్ కార్డులు, పథకాలు రద్దుచేయడం దారుణం. గత ప్రభుత్వ హయాంలో సంక్షోభంలో ఉన్న చేనేతలను ఆదుకునేందుకు రూ.110 కోట్లమేర చేనేతల రుణాలను మాఫీ చేశాం. చేనేతలకు 50ఏళ్లకే పెన్షన్, ముడిసరుకు రాయితీలు ఇచ్చి ఆదుకున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. ఎటువంటి కొర్రీలు లేకుండా చేనేత పనిపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తాం. ముడిసరుకు కొనుగోలుకు రాయితీలతోపాటు రుణాలు మంజూరుచేస్తాం.  చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దుకు కృషిచేస్తాం, అవసరమైతే రాష్ట్రప్రభుత్వమే భరించేలా చేస్తాం. టిడిపి అంటేనే బలహీనవర్గాల పార్టీ, మీకు అండగా నిలచే చంద్రన్నను సిఎం చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

Also, read this blog: Nara Lokesh’s Inspirational Pilgrimage in Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *