Nara Lokesh Yuvagalam Padayatra

యువగళంతో అడుగులు వేసిన బాలయ్య! ఆనందంతో అభిమానుల కేరింతలు మార్తాడు 800 కి.మీ. శిలాఫలకం ఆవిష్కరణ, చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు హామీ గంజాయి వద్దు బ్రో అంటూ వినూత్నంగా సందేశం

శింగనమల: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రం విజయవంతంగా ముందుకు సాగుతోంది. 63వరోజు పాదయాత్ర మార్తాడు శివార్లలోని క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తూ యువనేతతో కలిసి అడుగులు వేశారు. బాలయ్యను చూసిన అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. పాదయాత్ర 800 కి.మీ. మైలురాయిని అధిగమించిన సందర్భంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత చీనీ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించారు.  ఇచ్చిన హామీకి గుర్తుగా ఈ సందర్భంగా యువనేత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాదయాత్రలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ గంజాయి వద్దు బ్రో అంటూ ప్రత్యేకమైన టోపీలు ధరించి వినూత్నంగా సందేశమిచ్చారు. గంజాయి వద్దు బ్రో అని రాసిన టీషర్టులు, టోపీలు ధరించి వాలంటీర్లు, తెలుగుయువత, టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. గంజాయి,డ్రగ్స్ కి  ఏపి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందంటూ గత 63 రోజులుగా యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.

యువనేత పాదయాత్రలో వ్యక్తమైన అభిప్రాయాలు:

34ఎకరాల పొలంఉండేది, ఇప్పుడు టీ అమ్ముకుంటున్నా! – జి.సుధాకర్ నాయుడు, కల్లుమడి, శింగనమల నియోజకవర్గం.

మాది శింగనమల నియోజకవర్గం కల్లుమడి గ్రామం. నా భార్య రాధమ్మ పేరిట కర్నూలు జిల్లా కృష్ణగిరిలో మాకు 34ఎకరాల పొలం ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30ఏళ్లుగా మా అధీనంలో ఉన్న  భూమిని వైసిపి నేతలు రికార్డులు తారుమారుచేసి లాగేసుకున్నారు. ఎమ్మార్వో నుంచి కలెక్టర్ వరకు అధికారులందరికీ  మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. హైకోర్టు వెళితే మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా కోర్టు ఉత్తర్వులు కూడా అధికారులు అమలుచేయడం లేదు. ప్రస్తుతం చేసేదిలేక మా గ్రామంలో టీకొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నా. నా జీవితం ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని చూడలేదు.

ఉన్న ఎకరం లాగేసుకున్నారు – కేశవ, చిన్నరామప్ప, చెదళ్ల

మేము చెదళ్ల గ్రామానికి చెందిన అన్నదమ్ములం. 40ఏళ్లక్రితం మా పూర్వీకుల ద్వారా మాకు వచ్చిన ఎకరం భూమిని సంజీవ్ అనే వారు లాగేసుకున్నారు. దీంతో కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి విత్తనాలు, ఎరువుల వంటివి ఏవీ మాకు అందడంలేదు. గత మూడేళ్లుగా నష్టాలే తప్ప లాభం లేదు. ఇక్కడి వైసిపి నాయకుల దృష్టి అంతా ఇసుక అమ్ముకోవడం, కబ్జాలపైనే. మమ్మల్ని పట్టించుకునే నాథుడు లేడు.

వ్యవసాయం లాభసాటిగా లేదు – నల్లప్ప, రైతు, గనంపల్లి

నాకున్న 5ఎకరాల పొలంలో శనగపంట వేస్తున్నాను. ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, మరేఇతర సబ్సిడీలు రావడం లేదు. అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా వ్యవసాయం లాభసాటిగా లేదు. మాకు ఏ పథకాలు అందడం లేదు. చంద్రబాబు ఉన్నపుడు డ్రిప్ కు సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు దానిని ఆపేశారు. జగనన్న కాలనీలో ఇళ్లన్నీ వైసిపి నాయకులు, వాళ్లకు కావాల్సినవారే పంచేసుకున్నారు. మేం అడిగినా ఉపయోగం లేకపోగా, అరాచక చేస్తారు.

గొర్రెలు మేపుకుంటున్నా!  – చౌడన్న, రైతు, కొప్పలకొండ.

నాకు రెండు ఎకరాల పొలం ఉంది. కందిపంట వేయగా రూ.30వేల నష్టం వచ్చింది. నష్టాలతో వ్యవసాయం చేయలేక గొర్రెలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నా. బోయ కులానికి చెందిన మా ఇల్లు వర్షం వచ్చినపుడు కారుతూ ఉంది. ఇల్లు ఇప్పించమని సర్పంచ్ ని అడిగినా స్పందించలేదు. ముగ్గురు బిడ్డలు ఉన్నారు, మార్కెట్లో నిత్యవసర ధరలన్నీ పెరిగిపోయాయి. బతుకుబండి లాగడం కష్టంగా ఉంది.

మహామహులు జన్మించిన నేల శింగనమల!

రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి రాష్ట్రపతిగా నీలం సంజీవ రెడ్డి గారిని అందించిన నేల శింగనమల. పేద ప్రజల హక్కుల కోసం భూస్వాములు, పెట్టుబడిదారులతో పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన తరిమెల నాగిరెడ్డి గారు జన్మించిన ప్రాంతం ఇది. మొహరం సంతాప దినాలు ప్రారంభమయ్యే  శ్రీ గుగూడు కుళ్లాయి స్వామి పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న స్థలం ఈ శింగనమల. ఇంత గొప్ప నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. నాది అంబేద్కర్ గారి రాజ్యాంగం అని ముందే చెప్పా. సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని చెప్పినా వినలేదు. మీ కోసం పోరాడుతున్న లోకేష్ ని అడ్డుకోవడానికి వెయ్యి మంది పోలీసుల్ని రంగంలోకి దింపారు వైసీపీ.  దాని రిజల్ట్ ఏంటో తెలుసా 4 ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం 4 మొట్టికాయలు వేశారు.

సంక్షేమం రద్దుచేసిన చరిత్ర వైసీపీ దే!

వైసీపీ వాలంటీర్ ని పంపి గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారు. వాలంటీర్లు మీ ఇంటికి  వచ్చి టిడిపి గెలిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు అని ప్రచారం చేస్తున్నారు.  సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిందే టిడిపి బ్రదర్.  సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన హిస్టరీ వైసీపీది. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్.  100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం గా గిన్నిస్ బుక్ లోకి ఎక్కించొచ్చు.

యువతను చీట్ చేసిన వైసీపీ!

వైసీపీ యువతను చీట్ చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. వైసీపీ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

అధికారంలోకి వచ్చాక పన్నుల భారం తగ్గిస్తాం!

మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. వైసీపీ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసారు. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లుగా మారబోతున్నాయి. చీని, అరటి, వేరుశనగ, టమాటో రైతుల్ని మేము ఆదుకుంటాం. 

దళితులను చంపడానికి లైసెన్సు ఇచ్చాడు!

బీసీలకు బ్యాక్ బోన్ విరిచారు వైసీపీ. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసారు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టారు. బీసిల రక్షణ కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం.అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం. దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది.  

మైనారిటీలనూ మోసం చేశారు!

మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. TDP హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.

శింగనమలకు 8మంది ఎమ్మెల్యేలు!

శింగనమల ఎమ్మెల్యే ఈవిడ ఎమ్మెల్యే అయితే ఇక్కడ దళితులకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు. కానీ ఈమె పాలనలో దళితులకు అన్యాయమే జరిగింది. ఆమె చాలా బిజీగా ఉంటారు. వారంలో 5 రోజులు బెంగుళూరు, 2 రోజులు అనంతపురంలో ఉంటారు. ప్రజా సమస్యలు ఆమెకు పట్టవు. పేరుకే ఎమ్మెల్యే పెత్తనం అంతా ఆమె భర్తదే.  ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను మీ నియోజకవర్గం బ్రేక్ చేసింది. మీకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు. శింగనమల ఎమ్మెల్యే, ఆమె భర్త, ఇంకో ఆరుగురు బంధువులు, శింగనమలను కేక్ లా కట్ చేసి కుటుంబసభ్యులకు పంచేసారు.  

నియోజకవర్గాన్ని అడ్డంగా దోచేస్తున్నారు!

ఎమ్మెల్యే భర్త, ఆయన అనుచరులు నియోజకవర్గం లో ఇసుక, మట్టి ని ఘోరంగా దోచుకుంటున్నారు. ఎన్నికల ముందు సొంత ఇల్లు లేదు అన్నవారు ఈ రోజు 25 కోట్లతో అదిరిపోయే ఇల్లు కట్టారు. పామురాయి నుంచి ముచుకోట వరకు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. ముందుగానే ఏ రహదారి డిపిఆర్ తెలుసుకుని ఆయా మార్గంలో భూములు కొట్టేశారు. అమ్మడానికి ఒప్పుకొని రైతులపైకి రెవెన్యూ అధికారుల్ని ఉసిగొల్పి లాక్కున్నారు. ఎంతవరకు వెళ్లారంటే భూమి అమ్మడానికి అంగీకరించని రైతుకు చెందిన పచ్చటి పొలాన్ని ట్రాక్టర్ తో తొక్కించారు. పుట్లూరు మండలంలో కాల భైరవ స్వామి ఆలయ పునరుద్ధరణకు గ్రామస్తులు చందాలు వేసుకుని నిధిని ఏర్పాటు చేసుకున్నారు. గుడి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని సాంబశివరెడ్డి వద్దకు వెళితే రూ.10 లక్షలు కమిషన్ అడిగారు. విద్యాశాఖ సలహాదారుడుగా పనిచేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను బెదిరించి కోట్ల రూపాయలు కప్పం కట్టించుకున్నారు. ఈయన ఎంత గొప్ప సలహాదారుడంటే శింగనమల కెజిబివి హాస్టల్ లో ఒకే నెలలో రెండు సార్లు బాలికలకు పుడ్ పాయిజన్ అయ్యింది. కోడుమూరు గ్రామంలో 2.51 ఎకరాల ఎస్సిల శ్మశానాన్నికబ్జా చేసారు. విండ్ మిల్, సోలార్ ప్రాజెక్టుల యాజమాన్యాలను బెదిరించి నెలకు కోటి రూపాయలు కొట్టేస్తున్నారు. బుక్కరాయసముద్రం మండలం భద్రంపల్లి లో దూదేకుల రైతులకు చెందిన 18 ఎకరాల చుక్కల భూమి వైసిపి నాయకులు ఆక్రమించుకున్నారు.

శింగనమలను అభివృద్ధి చేసింది టిడిపినే!

శింగనమలను అభివృద్ధి చేసింది టిడిపి. బుక్కరాయసముద్రం మండలం దెంతలూరు లో సెంట్రల్ యూనివర్సిటీ పనులు ప్రారంభించాం. వైసిపి వచ్చిన తరువాత ఆపేసారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరామపురం లో పోలీసు క్వాటర్స్ నిర్మాణ పనులు ప్రారంభించాం. వైసిపి వచ్చిన తరువాత ఆపేసారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తాం. నార్పల క్రాస్ లో పాలిటెక్నిక్ కళాశాల నిర్మించాం.  ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో చదివే బాలికల వసతి కోసం రూ. 2 కోట్ల వ్యయంతో నార్పల, శింగనమల లో హాస్టల్ నిర్మించడం జరిగింది. అనంతపురం నుండి అరటి పండు విదేశాలకు ఎగుమతి అవుతుందంటే టిడిపి ముందు చూపే కారణం… టిడిపి ప్రభుత్వంలో విదేశాలకు అరటి ఎగుమతి చేసేందుకు జైన్, ఐఎంఎల్ కంపెనీలతో ఒప్పందం చేసుకోకముందు కేజీ అరటి రూ. 6 ఉండగా ప్రస్తుతం రూ. 32 ధర పలుకుతుందంటే చంద్రబాబు గారి చలవే. గార్లదిన్నె మరియు శింగనమల మండల కేంద్రాలలో షాదీఖానాలను టిడిపి ప్రభుత్వం నిర్మించింది. మిగిలిన 10 శాతం పనులను వైసిపి పూర్తిచెయ్యలేదు. టిడిపి అధికారం వచ్చిన వెంటనే షాదీఖానాల నిర్మాణం పూర్తిచేస్తాం.

టిడిపి వచ్చాక పెండింగ్ పనులు పూర్తి

గండికోట-నిట్టూరు-బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు టిడిపి ప్రభుత్వంలో వేగంగా జరిగాయి. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం ఆ పనులు ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తిచేస్తాం. పుట్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు వైసిపి నాయకులు శిలాఫలకం వేసి ఏడాదైనా డిపిఆర్ పూర్తి కాలేదు.   కొర్రపాడు గ్రామము నందు ఎస్సీ బాలికల కోసం 20 కోట్ల గురుకుల పాఠశాలను దాదాపుగా 90 శాతం పనులను పూర్తి చేస్తే,  ఇప్పటి వరకు మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసి పాఠశాలను ప్రారంభిచలేదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తిచేస్తాం. చిత్రావతి నదిపై తాడిపత్రి-పులివెందుల వెళ్ళేందుకు ఏర్పాటు చేస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు కమీషన్ల కోసం నిలిపివేసారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జ్ నిర్మాణాన్ని టిడిపి అదికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిచేస్తాం.

ఎన్టీఆర్ ట్రస్ట్ నీడలో మౌనంగా ఎదిగిన మౌనిక, 2005లో హత్యకు గురైన తండ్రి , ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని ఉన్నత శిఖరాలకు!  యువనేతకు కృతజ్ఞతలు తెలిపిన మౌనిక – సంతోషం వ్యక్తం చేసిన నారా లోకేష్

ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఓ విద్యార్థిని శింగనమల నియోజకవర్గం గార్లదిన్నెలో యువగళం క్యాంప్ సైట్ వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి చనిపోయిన తనను, తన కుటుంబాన్ని తెలుగుదేశంపార్టీ, నారా చంద్రబాబు నాయుడు ఆదుకున్నారని వివరించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల తన సోదరి, తాను ఉన్నత స్థానానికి చేరుకున్నామని పేర్కొంది. యువతి చెప్పిన మాటలకు నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, పదిమందికి దారిచూపేలా ఆలోచించాలని కోరారు.

వివరాలు ఇలా ఉన్నాయి:

‘‘అనంతపురంజిల్లా, బుక్కరాయసముద్రం మండలం, కేకే అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ను ప్రత్యర్థులు 2005లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఇతనికి నలుగురు ఆడపిల్లలు. వారిలో మూడవ కూతురు నాగమణి, నాల్గవ కూతురు మౌనికను తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివించారు. నాగమణి, మౌనిక ఎన్టీఆర్ ట్రస్ట్ లోనే చదువుకున్నారు. ఉన్నత విద్యను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సహకారంతో పూర్తిచేశారు. నాగమణి ఎన్టీఆర్ ట్రస్ట్ లోనే చదువుకుని హైదరాబాద్ లోని వివిడ్ మైండ్స్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. మౌనిక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చదివి నేడు ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు. వీళ్ల బాబయ్ కొడుకు వెంకటేష్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చదివి బెంగళూరులోని క్రిక్ బజ్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ స్థిరపడ్డారు’’. తమ కుటుంబాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉన్నత స్థానానికి వెళ్లాయని చెప్పి, కృతజ్ఞతలు చెప్పేందుకు యువనేత నారా లోకేష్ ను కలిశానని మౌనిక వివరించింది.

మూగ మ‌న‌సుకి మాట వ‌చ్చింది చంద్రబాబుకి కృత‌జ్ఞత‌లు చెప్పింది

ఆ చిన్నారి మూగ‌మ‌న‌సుకి మాట వ‌చ్చింది. తండ్రితో క‌లిసి వ‌చ్చి త‌న చికిత్సకి  సాయం అందించిన చంద్రబాబు త‌న‌యుడికి కృత‌జ్ఞత‌లు చెప్పుకుంది. మాట‌వ‌చ్చిన ఆ మూగ‌మ‌న‌సు పేరు ప‌వ‌న్. తండ్రి పేరు బ‌ర్మా ర‌మేష్. సింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం, గార్లదిన్నె మండ‌లం, బ‌న‌క‌చెర్ల ప్రాజెక్టు వ‌ద్ద నివాసం. క‌ర్ణాట‌క రాష్ట్రానికి వ‌ల‌స వెళ్లి కూలీ ప‌నులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు ర‌మేష్. మూడేళ్ల కొడుకు ప‌వ‌న్‌కి పుట్టుక‌తో వినికిడి స‌మ‌స్య వ‌ల్ల మాట‌లు రాలేదు. అప్పులుచేసి క‌ర్ణాట‌క‌లోనే ఆస్పత్రులు తిప్పుతూ నానా తిప్పలు ప‌డేవాడు. కొడుకుకి ఎలాగైనా మాట తెప్పించాల‌నే ర‌మేష్ బాధ‌లు చూసిన అక్కడి తెలుగువారు, మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యానికి సాయం చేస్తున్నారు క‌దా, అక్కడికి వెళ్లి ప్రయ‌త్నించు అని చెప్పిన స‌ల‌హాతో  సీఎంఆర్ఎఫ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. 2017వ సంవ‌త్సరంలో టిడిపి స‌ర్కారు మంజూరు చేసిన రూ.5.20ల‌క్షల‌తో అపోలో హైద‌రాబాద్‌లో ప‌వ‌న్ కి చికిత్స చేశారు. ప‌వ‌న్ కి మాట వ‌చ్చింది. వినికిడి యంత్రాలు అమ‌ర్చారు. బ‌ర్మా ర‌మేష్ ఆనందానికి అవ‌ధుల్లేవు. తాను బిడ్డకి జ‌న్మనిస్తే, మాట వ‌చ్చేలా వైద్యానికి సాయం అందించి చంద్రబాబు పున‌ర్జన్మ ఇచ్చార‌ని సంతోషం వ్యక్తం చేశాడు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో సింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం వ‌చ్చిన నారా లోకేష్‌ని క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. తెలుగుదేశం ప్రభుత్వం స‌హకారంతో మాట వ‌చ్చిన ప‌వ‌న్‌, 9వ‌ ఏట అడుగుపెట్టి బ‌న‌క‌చెర్లలో చ‌దువుకుంటున్నాడ‌ని లోకేష్‌కి వివ‌రించారు.

Also, read this blog: The Remarkable Journey of Nara Lokesh in Excelling in Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *