ఉరవకొండలో యువనేతకు జననీరాజనం అడుగడుగునా మహిళల హారతులు కూడేరు బహిరంగసభకు పోటెత్తని జనం
ఉరవకొండ: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర మండుటండలను సైతం లెక్కచేయకుండా అనంతపురం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 61వరోజు పాదయాత్ర అనంతపరం రూరల్ పిల్లగుండ్ల ఎంవైఆర్ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైంది. తొలుత దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి యువనేత లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపి ముఖ్యనాయకులు యువనేతను కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో అభిమానులు పెద్దఎత్తున సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. తనను కలిసేందుకు వచ్చిన వారందరినీ యువనేత ఆప్యాయంగా పలకరిస్తూ… వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. కూడేరు మండలం గొట్కూరు వద్ద పాదయాత్ర ఉరవకొండ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నేతృత్వంలో నియోజకవర్గానికి చెందిన పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ గజమాలతో యువనేతను సత్కరించి, ఆత్మీయస్వాగతం పలికారు. గొట్కూరు గ్రామస్తులు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం కూడేరులో జరిగిన బహిరంగసభకు ప్రజలు పోటెత్తారు. బుధవారం నాడు 15.5 కిలోమీటర్ల మేర కొనసాగిన పాదయాత్ర కూడేరులోని విడిది కేంద్రానికి చేరింది. గురువారం యువగళం పాదయాత్ర కోటంక వద్ద పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలో ప్రవేశించనుంది.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
ఇంటిల్లిపాది పనిచేసిన పూటగడవం లేదు – పోలన్న, బేలుదారి కూలీ, ఉరవకొండ.
కట్టుబడి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. గత నాలుగేళ్లుగా ఇసుక దొరక్క పనులు సాగడం లేదు. వారానికొకరోజు మాత్రమే పని దొరుకుతోంది. నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఒకడిని చదువుకు పంపించా. మిగతా ఇద్దరూ నాతో పనికి వస్తారు. సక్రమంగా పనుల్లేక ఇంటిల్లపాది పనిచేసిన పూటగడవం లేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఉన్నపుడు మాకు విసుగొస్తే తప్ప నెలంతా పుష్కలంగా పనులు దొరికేవి. డిగ్రీ చదువుకుంటున్న చిన్న కొడుకుకి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదు. మళ్లీ మాకు దండిగా పనులు దొరకాలంటే చంద్రబాబే సిఎం కావాలి.
ఉన్న పరిశ్రమలను తరిమేశారు! – గంటుముక్కల రమేష్, కదరగుంట
నేను వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. 10ఎకరాల్లో చీనీ, దానిమ్మ సాగుచేస్తే గత ఏడాది అకాల వర్షాలవల్ల రూ.6లక్షల నష్టం వచ్చింది. మా అమ్మకు పెన్షన్ ఇవ్వడం లేదు. నాకు ఇద్దరు చదువుకునే బిడ్డలు ఉన్నారు. చంద్రబాబు హయాంలో డ్రిప్ పరికరాలు పెట్టుకునేందుకు 90శాతం సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పథకాన్ని మూలనబెట్టారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలు తేకపోగా సుజలాన్ గాలిమరల పరిశ్రమను తరిమేశారు. గత ప్రభుత్వంలో యునిక్ డ్రిప్ పేరుతో నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 70శాతం పనులుచేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిలిపేశారు. గ్రామాల్లో చేతిపంపులు రిపేరు చేసే దిక్కుకూడా లేదు. రాష్ట్రం మళ్లీ బాగుపడాలంటే చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా రావాలి.
టీడీపీ వాడినని రూ.4కోట్లు పెండింగ్ పెట్టారు – దాసరి ప్రతాప్ నాయుడు, పెంచలంపాడు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నీరు-చెట్టు పథకం కింద పెంచలపాడు గ్రామం, విడుపునగల్ మండలంలో అనేక పనులు చేశాం. వీటికి సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో నాకు రావాల్సిన కోటి రూపాయల బిల్లులను ఉద్దేశపూర్వకంగా నిలిపేశారు. దీనిపై పలుమార్లు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర కార్యాలయానికి తిరిగినా ఫలితం లేదు. దీనిపై కోర్టులో న్యాయమైన పోరాటం చేస్తే, కోర్టు నాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు, నాకు బిల్లులు విడుదల చేయలేదు. గోకుల్ షెడ్లు నిర్మించే పనులను కూడా చేశాను. దీనికి సంబంధించి రూ.2కోట్లను వైసీపీ ప్రభుత్వం నాకు పెండింగ్ పెట్టింది. బిల్లులు అడిగితే ఆ స్కీమ్ ను రద్దు చేశామని అధికారులు చెబుతున్నారు. నాకు రావాల్సిన బకాయిలుకు సంబంధించిన ఎం.బుక్ ను కూడా అధికారులు చూపించడం లేదు. కేజీబీవీ పాఠశాలలకు కాంపౌండ్ వాల్ నిర్మించే పనులు చేయించాను. దానికి సంబంధించి కోటి రూపాయల బిల్లులను కూడా వైసీపీ ప్రభుత్వం నాకు పెండింగ్ పెట్టింది. దీనిపైనా అధికారులు నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ నన్ను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారు.
వైసీపీ నాయకులు దాడిచేస్తే కేసు నమోదు చేయలేదు – కిట్టు, ఉరవకొండ టౌన్
ఉరవకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి అనుచరులు నాపై కక్షపూరితంగా దాడి చేశారు. దీనిపై నేను ఉరవకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. పోలీసులు నేను పెట్టిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదు. అధికారపార్టీ నాయకులకు మొగ్గుచూపి నాపై దాడి చేసిన వారిని వదిలేశారు. నాకు న్యాయం జరగలేదు.
నన్ను చంపాలని వైసీపీ నాయకులు ప్రయత్నించారు – పేరం.కేశవ, ఉరవకొండ టౌన్
వైసీపీ అనుచరులు నన్ను ముసుగు వేసి కొట్టారు. మారణాయుధాలతో నాపై విచక్షణారహితంగా దాడి చేశారు. చంపడానికి ప్రయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేశాను. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ గూండాలు కేసు నుండి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నాకు అన్యాయం చేయడానికి కొంత మంది అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ పాలనలో TDP అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు రక్షణ లేదు.
నారా లోకేష్ విడుదల చేసిన ఆధారాలు
ముదిగుబ్బ మండలం వైకాపా నాయకుడు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. ముదిగుబ్బ మండల కేంద్రం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల్ని సుమారు 30 ఎకరాల వరకు స్థానిక నాయకులతో కలిసి కబ్జా చేశారు. బినామీలను ముందు పెట్టుకొని భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ముదిగుబ్బ మండలం కేంద్రం చుట్టూ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుండడంతో భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా విలువ రెండు కోట్ల పైమాటే. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ముదిగుబ్బలో సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమించారు. దీని విలువ సుమారు 60 కోట్ల పైనే ఉంటుంది. ముదిగుబ్బ మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న దొరిగల్లు రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 2060-4 లో మూడు ఎకరాల భూమిని టిడిపి హయంలో ముస్లిం స్మశాన వాటికకు కేటాయించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్మశాన వాటిక కోసం కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని ఆక్రమించి అదే వైకాపా నాయకుడి పేరుమీద ఆన్లైన్ లో ఎక్కించేశారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ మూడు ఎకరాల స్థలం విలువ 6 కోట్లకి పైగానే ఉంటుంది. రెవిన్యూ అధికారుల్ని బెదిరించి పాస్ బుక్కులు కూడా చేయించుకున్నారు. ముదిగుబ్బలో జాతీయ రహదారి అనుకొని గుంజేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1190-3 లో టిడిపి హయంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అప్పట్లోనే కొంతమంది ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. ఇళ్లు కట్టుకోని వారిని బెదిరించి స్థలాలు లాక్కున్నారు. స్థానిక వైసిపి నాయకులు సుమారు నాలుగు ఎకరాల వరకు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. కస్తూర్బా స్కూల్ కి ఆనుకొని ఉన్న స్టేడియంకు వెళ్లే దారిని కూడా వైసీపీ నేతలు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. ఇక్కడ సెంటు విలువ సుమారు రెండు లక్షల ఉంటుంది. ఈ లెక్కన వైసిపి నాయకులు ఆక్రమించిన భూమి విలువ సుమారు 8 కోట్లు. ముదిగుబ్బ మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న దొరిగల్లు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 1330-1 లోని 17 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని వైసిపి నాయకులు ఆక్రమించుకున్నారు. గుట్టను చదును చేసి ఫ్లాట్లుగా మార్చి సెంటు రూ. 2 లక్షల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అప్పట్లో తహశీల్దారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుజేసినా లెక్కచేయకుండా గుట్టను కబ్జా చేశారు. ముదిగుబ్బ మండల కేంద్రానికి సమీపంలో అనంతపురం-కదిరి జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఆరు ఎకరాల గుట్టను వైసిపి నాయకులు రాత్రికి రాత్రి చదును చేసి ఆక్రమించుకున్నారు. గుట్టను చదును చేసి కంచె కూడా వేసి సెంటు రూ.1లక్ష చొప్పున విక్రయించారు. ఇంత బరితెగించి, బహిరంగంగా గుట్టను ఆక్రమించుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇవన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన అనుచరులే చేసిన కబ్జాలు. గుడ్ మార్నింగ్ అంటూ గుట్టల్ని మింగేసిన ఎమ్మెల్యే గారు ఇవిగోంది మీ కబ్జాలకి ఆధారాలు, రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ లోకేష్ ప్రశ్నించారు.
ఉరవకొండలో మళ్లీ పసుపుజెండా ఎగరడం ఖాయం
ఉరవకొండలో నేను అడుగుపెట్టిన నాటి నుండి ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు. ఈ ఉరవకొండ ప్రజల ఉత్సాహం, ఉత్తేజం చూసి ఆశ్చర్యపోయాను. ఎత్తిన జెండా ఒరిగిపోకుండా ప్రాణాలు అడ్డుపెట్టి నిలబెడుతున్న ప్రతి కార్యకర్తకు నా ధన్యవాదాలు. 2019లో వైసీపీ మాయమాటలకు లొంగకుండా పసుపుజెండాకే పట్టంకట్టారు. 2024లోనూ ఉరవకొండలో పసుపుజెండా ఎగరడం ఖాయం అని నాకు నమ్మకం వచ్చింది. ఉరవకొండ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. పెన్నహోబిళం లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, సూర్యదేవాలయం ఉన్న పుణ్య భూమి ఉరవకొండ. అద్భుతాలు సృష్టించే చేనేత కళాకారులు ఇక్కడ ఉన్నారు. రాష్టంలో ఎక్కడ లేని విధంగా ఈ నియోజకవర్గంలో కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తాయి. రాష్ట్రమంతా వైసీపీట్రాప్ లో పడినా మీరు మాత్రం పడలేదు. ఉరవకొండ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు టిడిపి ప్రభుత్వం రావాలనే కోరుకున్నారు. కానీ బ్యాడ్ లక్ తన్నే దున్నపోతు ప్రభుత్వం వచ్చింది. ఉరవకొండ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఉరవకొండ ఎమ్మెల్యే గారి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మూడు తరాలకు వారధి పయ్యావుల కేశవ్ గారు. మా తాత ఎన్టీఆర్ గారి దగ్గర కేశవ్ గారు రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. మా నాన్న విజనరీ చంద్రబాబు గారితో కలిసి పనిచేశారు. ఇప్పుడు నాతో నడుస్తున్నారు, పెద్దన్న లా నన్ను నడిపిస్తున్నారు. కేశవ్ గారిని చూస్తే అధికార పక్షానికి వణుకు. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసెంబ్లీ లో మైక్ కట్ చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో ధరలు బాదుడే బాదుడు
విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి టిడిపి గెలిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు అని ప్రచారం చేస్తున్నారు. సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిందే టిడిపి బ్రదర్. సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన హిస్టరీ నీది. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం జగన్ .
యువతను మోసగించిన వైసీపీ ప్రభుత్వం
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
మహిళల తాళిబొట్ల తెంచిన వైసీపీ ప్రభుత్వం!
మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నారు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసారు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.
మోటార్లకు మీటర్లతో అన్నదాతకు ఉరితాళ్లు
వైసీపీ ప్రభుత్వం రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసారు. వైసీపీ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. అవి ఏంటో తెలుసా గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత చీని, టమాటో, వేరుశనగ రైతుల్ని ఆదుకుంటాం. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.
బిసిలు, దళితులపై దమనకాండ
బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు జగన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. దళితులపై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? వైసిపి పాలనలో దళితులను చంపడానికి స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.
మైనారిటీలకు తీరని ద్రోహం
మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.
ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు భూదందాలు
మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరాచకాల గురించి కూడా మీకు చెప్పాలి. పిట్ట కొంచెం కూత ఘనం అనే మాట వింటుంటాం, ఈ విషయంలో మాత్రం పిట్ట కొంచెం అవినీతి ఘనం. మాజీ ఎమ్మెల్యే కుమారుడు అనంతపురం, కూడేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూదందాలు చేస్తున్నాడు. కూడేరు పరిధిలో ఎక్కడ లేఅవుట్ వేయాలన్న ఎకరాకు ఐదు లక్షలు కప్పం కట్టాల్సిందే. ఈ అక్రమాలు ఎంతవరకు వెళ్లాయంటే కూడేరులో ఓ మహిళకు చెందిన భూమిని ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి కొట్టేశాడు. ఆమె కేసు పెడితే ఇతని అక్రమాలు బయటపడ్డాయి. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కూడేరు మండలం కమ్మూరు గ్రామ పరిధిలో అసైన్డ్ భూమికి సంబంధించి నకిలి ఎన్ఓసీలు సృష్టించి భూమి కాజేడానికి ప్రయత్నించాడు. ఈ కేసులోనూ జైలుకు వెళ్లాల్సిన వాడు.. కానీ అధికారులను బలి చేసి తాను తప్పించుకున్నాడు. ఉరవకొండ నియోజకవర్గం లో గాలి మరలకు సంబంధించి అనేక అక్రమాలు చేస్తున్నాడు. విండ్ పవర్ సంస్థలకు వాహనాలన్నీ ఈయనే సప్లై చేస్తున్నాడు. ఇటీవల ఓ సంస్థ వీళ్లు పంపించే వాహనాలు బాలేవని చెప్పినందుకు వాళ్ల తలలు పగలగొట్టారు. గాలి మరల వద్ద పనిచేసే సెక్యూరిటీ గార్డులను శ్రమ దోపిడీ చేస్తున్నాడు. సంస్థల నుంచి పెద్ద మొత్తంలో వేతనాలు తీసుకొని. సెక్యూరిటీ గార్డులకు మాత్రం సగం కూడా ఇవ్వడం లేదు. ఆఖరికి పేదల బియ్యాన్ని కూడా కర్ణాటక లో అమ్ముతున్నాడు.
పండ్లతోటల పరిహారం కొట్టేశారు!
కర్ణాటకలోని హాసన్ నుంచి హైదరాబాద్ వరకు హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తోంది. కూడేరు మండలంలో హెచ్పీసీఎల్ గ్యాస్ పైప్ లైన్ పరిహారం విషయంలో సుమారు ఐదు కోట్ల వరకు అక్రమాలు చేశారు. నిజంగా నష్టపోతున్న రైతులకు అరకొరా పరిహారం అందించారు. తన అనుచరుల భూముల్లో పండ్ల తోటలు లేకపోయినా ఉన్నట్లు సృష్టించి ఒక్కొక్కరు 10 లక్షలు చొప్పున పరిహారం కొట్టేశారు. కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో నక్కలగుట్టను ప్రణయ్ అనుచరుడు కబ్జా చేశాడు. అక్కడితో ఆగకుండా గుట్టపై చీని చెట్లు ఉన్నట్లు సృష్టించి రూపాయలు లక్షల్లో పంట నష్ట పరిహారం కాజేశాడు. నకిలీ డి పట్టాలు సృష్టించి కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొట్టేశాడు.
ఉరవకొండను అభివృద్ధి చేసింది టిడిపినే!
ఉరవకొండని అభివృద్ధి చేసింది టిడిపి. 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలి అనే ఉద్దేశంతో మెగా డ్రిప్ పథకాన్ని ప్రారంభించాం. 890 కోట్లు కేటాయించి పనులు చేసాం. 90 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ ఈ దుర్మార్గపు ప్రభుత్వం వచ్చి ఆ పధకానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఉరవకొండలో 8.50కోట్లతో 50పడకల అధునాతన ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం చేశాము. అనంతపురం నుంచి విడపనకల్ వరకు 70కిలోమీటర్ల మేరకు 332 కోట్లతో నూతన రోడ్డు నిర్మాణం మరియు పెన్నహోబిళం బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి పల్లెకి త్రాగునీటిని అందచేయాలని ఉద్దేశ్యంతో 53 కోట్లతో త్రాగునీటి పథకం మంజూరు చేసాం. గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ కొరకు 330 కోట్లతో దాదాపు పనులు పూర్తి చేయడం జరిగింది. నియోజకవర్గంలో 36 కోట్లతో 19 గ్రామీణ రోడ్లు మంజూరు చేయిచడం జరిగింది. ఉరవకొండ పట్టణంలో 11 కోట్లతో బైపాస్ నుండి మార్కెట్ యార్డ్ వరకు నాలుగు వరుసల సిమెంట్ రోడ్డు నిర్మాణం వేయడం జరిగింది. ఉరవకొండ పట్టణంలో మన ప్రభుత్వంలో మూడు వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చాము. వాటికే ఈ ప్రభుత్వ హయాంలో పేరు మార్చి జగనన్న కాలనీల పేరుతో ఇంటి పట్టాలు మంజూరు చేశారు మన ప్రభుత్వ హయంలో పిఎంఏవై – ఎన్టీర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం క్రింద ఉరవకొండ నియోజకవర్గంలో 16 వేల ఇల్లు మంజూరు చేయించాము. ఇది రాష్ట్రంలోనే అత్యధికం.
వైసిపి వచ్చాక ఆగిపోయిన అభివృద్ధి!
వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉరవకొండని ఒక తన్ను తన్నింది. డ్రిప్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి, బెలుగుప్ప మండలంలో హంద్రీనీవా 36వ ప్యాకేజీ పనులు ఆగిపోయాయి. వజ్రకరూర్ మండలంలో హంద్రీనీవా ద్వారా నీరందించాల్సిన 33వ ప్యాకేజీ పనులు ఆగిపోయాయి. గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు అయిన ఆరు నెలలులోనే డిస్ట్రిబ్యూటరీలకు లత్తవరం, షెక్షానిపల్లి, కోనాపురం, చాబాల, ధర్మపురి గ్రామాలకు నీరు అందిస్తాం అని జగన్ మోహన్ రెడ్డి గారు ఉరవకొండ నియోజకవర్గ పాదయాత్రలో ప్రకటించారు కానీ ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు. హంద్రీనీవా కాలువ వెడల్పు చేస్తాం అని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఇంతవరకు వాటికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టలేదు. లత్తవరం, షెక్షానిపల్లి, కోనాపురం, చాబాల, ధర్మపురి గ్రామాలకు మన ప్రభుత్వ హయంలో నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలాన గడిచిన మూడు సంవత్సరాలుగా నీటిని అందించడంలో విఫలమైనది.
ఉరవకొండకు హంద్రీనీవా నీళ్లు తెస్తాం
ఉరవకొండ మండలంలోని లత్తవరం, షెక్షానిపల్లి, కోనాపురం..వజ్రకరూరు మండలంలోని చాబాల, ధర్మపురి.. బెలుగుప్ప మండలంలోని గంగవరం, కోనాపురం, నరసాపురం, బ్రామ్హనపల్లి శ్రీరంగపురం, చెరువులకు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకురావడానికి చర్యలు చేపడుతాం. జీడిపల్లి నిర్వాసితులకు మంజురైన R & R పనులు ఈ ప్రబుత్వం వచ్చాక ఇప్పటివరకు కూడా మొదలు కాలేదు. మన ప్రబుత్వం వచ్చిన వెంటనే నిధులు విడుదల చేస్తాం. 80 వేల ఎకరాలకు నీరు అందిస్తాం అన్న వైసీపీ హామీ ఏమైంది? 50వేల ఎకరాలలో సాముహిక బిందుసేద్యం (మెగా డ్రిప్) పథకం ద్వారా రైతులకు నీరు అందించాలి అనే ఉద్దేశంతో రూ.890కోట్లతో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి అగ్రిహల్చర్ హబ్ గా మారుస్తాం. చేనేత కార్మికుల కొరకు క్లస్టర్ ఏర్పాటుకు చొరవ చూపుతాం. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మన ప్రభుత్వ హయంలోనే సర్వే పూర్తి అయింది, దీని కొరకు చొరవ చూపుతాము.
యువనేతను కలిసిన గొట్కూరు, బ్రాహ్మణపల్లి గ్రామప్రజలు
ఉరవకొండ నియోజకవర్గం బ్రాహ్మణపల్లి, గొట్కూరు గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. బ్రాహ్మణపల్లిలో అంగన్ వాడీ స్కూలు లేకపోవడంతో చిన్నపిల్లలకు పౌష్టికాహారం లేదు. 1 నుంచి 5వతరగతి వరకు పిల్లలు చదువుకునేందుకు ఎలిమెంటరీ స్కూలు లేదు. స్కూలు లేక ఇక్కడి చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిసి కాలనీలో డ్రైనేజి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. అత్యవసర పరిస్థితుల్లో వైద్యానికి హాస్పటల్ కూడా లేదు. గొట్కూరులోని సర్వే నెం.236లోని జగనన్న కాలనీలో ఇప్పటివరకు ఇళ్లపట్టాలు ఇవ్వలేదు. స్థలయజమానికి కోర్టుకెళ్లి స్టే తెచ్చారు. ఆర్డీఓ, ఎమ్మార్వోలకు చెప్పినా పట్టించుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యల పరిష్కారానికి కృషిచేయండి.
*యువనేత లోకేష్ స్పందిస్తూ…*
ప్రగతికి పట్టుగొమ్మలైన గ్రామసీమలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పంచాయితీల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోగా, స్థానిక సంస్థలకు చెందిన రూ.7,880 కోట్లను ప్రభుత్వం దొంగిలించింది. నేను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నపుడు రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేవిధంగా గ్రామాల్లో 25వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయించాను. ప్రతి గ్రామంలో ఎల్ఇడి వీధిదీపాలతోపాటు ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించాం. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లపై తట్ట మట్టిపోసే దిక్కకూడా లేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గొట్కూరు, బ్రాహ్మణపల్లి వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం.
యువనేతను కలిసిన అనంతపురం జిల్లా మాజీ సైనికులు లోకేష్ కు టోపీ బహుకరించి సంఘీభావం
అనంతపురం జిల్లా ఎక్స్-సర్వీస్ మెన్స్ అసోసియేషన్ కు చెందిన ప్రతినిధులు యువనేత లోకేష్ కు సంఘీభావం తెలియజేసి, టోపీ బహుకరించారు. అనంతరం మాజీ సైనికులు తమ సమస్యలను యువనేతకు విన్నవించారు. ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు భద్రతాసిబ్బందిగా మాజీ సైనికులను కాకుండా పొరుగుసేవల పేరుతో అన్ స్కిల్డ్ యువతను రిక్రూట్ చేసుకొని శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి. ఆవిధంగా ఉద్యోగాల్లోకి తీసుకున్నవారికి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదు. ప్రైవేటు సంస్థలు జిల్లాల్లో సైనికసంక్షేమ కార్యాలయాలను నోడల్ ఏజన్సీగా పరిగణించి సీనియారిటీ ప్రాతిపదికను సెక్యూరిటీ సిబ్బందిని తీసుకోవాలి. మహారాష్ట్ర, తమిళనాడుల్లో మాదిరిగా జీతాలు కూడా ప్రభుత్వం ద్వారా అందేలా చూడాలి. టిడిపి ప్రభుత్వ హయాంలో కూడేరులో 416మంది మాజీ సైనికులకు ఇళ్లపట్టాలు ఇచ్చారు. అందులో 100 పూర్తయ్యాయి. మిగిలినవాటికి ఆర్థిక స్థోమతలేక ముందుకు వెళ్లలేక పోతున్నాం. మిగిలిన ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సహకారం అందించాలి. మాజీ సైనికులకు ప్రభుత్వోద్యోగాల్లో 2శాతం ఉన్న రిజర్వేషన్ ను 4శాతానికి పెంచాలి. ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా వేకెన్సీలను నోటిఫై చేయాలి. సైన్యంలో 15ఏళ్లకు పైగా సేవలందించిన సుశిక్షితులైన వారికి పోలీసుశాఖలో ప్రాధాన్యత కల్పించాలి. మాజీ సైనికులకు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. ప్రతి మాజీ సైనికుడికి స్థానికంగా 5సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలి. మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన భూమి 5సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ గా పట్టాభూమిగా మారేలా జిఓ విడుదలచేయాలి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతమైనందున యువకులు వలసలు వెళ్తున్నారు. అటువంటి వారికి రిక్రూటింగ్ ఆఫీసు ఒకటి అనంతపురంలో ఏర్పాటుచేయాలి. పేద యువకులకు సైన్యంలో చేరే అవకాశం కోసం ప్రభుత్వమే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేయాలి.
*యువనేత లోకేష్ మాట్లాడుతూ….*
దేశరక్షణకు సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా విశాఖతోపాటు పలు ప్రాంతాల్లో మాజీ సైనికుల భూములను కూడా వైసిపి నేతలు కబ్జా చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ సైనికులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బందిగా నియమించే అంశాన్ని పరిశీలిస్తాం. మాజీ సైనికుల ఇళ్లనిర్మాణానికి సహాయం అందజేస్తాం.
Also, read this blog: Nara Lokesh’s Inspirational Journey Towards Progression in Yuvagalam
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh