Nara Lokesh Yuvagalam Padayatra

రాప్తాడు నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం పాదయాత్ర అడుగడుగునా నీరాజనాలు పలికిన మహిళలు, వృద్ధులు, అభిమానులు

రాప్తాడు: అరాచకపాలనపై పోరు సాగించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేస్తున్న యువగళం పాదయాత్ర 56వరోజు (శుక్రవారం) రాప్తాడు నియోజకవర్గం సికె పల్లి పంచాయితీ కోన క్రాస్ వద్ద నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు యువనేతను ఆప్యాయంగా పలకరిస్తూ నీరాజనాలు పలికారు. పాదయత్ర ప్రారంభానికి ముందు సెల్ఫీ విత్ నారా లోకేష్ లో తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను ఆప్యాయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగారు. ప్రతిరోజు సుమారు వెయ్యిమంది అభిమానులతో యువనేత ఫోటోలు దిగుతున్నారు. సికె పల్లి చేరుకున్న నారా లోకేష్ కు టిడిపి కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు భారీగా మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు.  నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గించి, ధరలను అదుపుచేస్తామని యువనేత చెప్పారు. కరెంట్ బిల్లు ఎక్కువోచ్చిందని పెన్షన్లు కట్ చేశారని పలువురు వృద్దులు ఆవేదన వ్యక్తంచేశారు. మీ పెన్షన్లే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది పెన్షన్లు కట్ చేశారు. మరో ఆరు లక్షల పెన్షన్లు లేపేయడానికి వైసీపీ ప్రభుత్వం సిద్దం అవుతుంది. అర్హులైన వారందరికీ టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు. చిరు వ్యాపారులతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. బసినేపల్లి వద్ద గత ప్రభుత్వ హయాంలో 90శాతం నిర్మాణం పూర్తయి, ఎమ్మెల్యే కక్షపూరిత ధోరణికి నిరసనగా ప్రారంభానికి నోచుకోని ఎన్టీఆర్ గృహాలను యువనేత సందర్శించారు. సికె పల్లిలో బిసి సామాజికవర్గీయులు యువనేతను కలిసి సమస్యలు విన్నవించారు. ఎస్ఎస్ గేటు వద్ద జాకీ పరిశ్రమ భూనిర్వాసితులు, ఆటోకార్మికులు యువనేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. పైదిండి వద్ద నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు.

జాకీ పరిశ్రమ పోవడంతో ఉద్యోగాలు పోయాయి – నాగమణి, బండమీదపల్లి

జాకీ పరిశ్రమ మా ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా సంతోషించాం. నిర్మాణ పనులు చేస్తుంటే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం. కానీ ప్రభుత్వ మారాక జాకీ పరిశ్రమ వెళ్లిపోయింది. అసలే కరువు జిల్లా, వచ్చిన పరిశ్రమలు కూడా పంపిస్తే ఎలా.? పెద్దపరిశ్రమల్లో, పక్కరాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేయడానికి మేమేం ఉన్నత చదువులు చదువుకోలేదు. కనీసం TDP ప్రభుత్వ వచ్చాకైనా మళ్లీ జాకీ పరిశ్రమను తెప్పించాలి.

ఎమ్మెల్యే మా గృహ ప్రవేశాలను అడ్డుకుంటున్నాడు! – తరికి గురుప్రసాద్, బసినేపల్లి, ఎన్టీఆర్ గృహ లబ్ధిదారుడు

మా గ్రామంలో ఇళ్లులేని 122 కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది. అందులో నేను కూడా లబ్ధిదారుడినే. మా ఇళ్లు మొత్తం పూర్తైంది. కేవలం తలుపులు, ఫ్లోరింగ్ వర్కు మాత్రమే మిగిలింది. కానీ ఆలోపు ప్రభుత్వం మారింది. మేము ఇళ్లలోకి చేరకుండా ఎమ్మెల్యే అధికారులతో అడ్డుకుంటున్నారు. మౌలిక వసతులన్నీ టీడీపీ ప్రభుత్వం కల్పించింది. ఇళ్ల నిర్మాణం జరగ్గా మిగిలిన 1.25 ఎకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా చేసి, పెట్రోల్ బంక్ పెట్టుకోవాలని చూస్తున్నాడు.

కుడిచేత్తో రూ.10 ఇచ్చి ఎడమచేత్తో వందలాగేస్తున్నారు!

కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి, ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేస్తున్నారు.  కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ నంబర్1. ఇంటి పన్ను రెట్టింపు చేసాడు, చెత్త పన్ను వేసాడు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎవరినీ వదిలి పెట్టలేదు యువత, మహిళలు, రైతులు, కార్యకర్తలు, ఉద్యోగస్తులు అందరినీ మోసం చేసారు.

మహిళలు, రైతులనూ మోసంచేశారు.

మహిళల్ని మోసం చేసింది వైసిపి ప్రభుత్వం.  మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నారు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు కుడ రావటంలేదు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసారు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. రైతు రాజ్యం తెస్తానన్నవారు రైతులు లేని రాజ్యం తెచ్చారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లుగా మారబోతున్నాయి. డ్రిప్ ఇరిగేషన్ ని నిర్వీర్యం చేసింది వైసిపి ప్రభుత్వం. టిడిపి హయాంలో ఎస్సీ,ఎస్టీ లకు ఉచితంగా, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ అందించాం. కానీ ఇప్పుడు వైసిపి డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని నిర్వీర్యం చేసి రాయలసీమ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశారు.

యువత భవిష్యత్తును నాశనంచేశారు!

యువత భవిష్యత్తును నాశనం చేసారు. వైసీపీ ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసారు.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం.  విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

బిసిలు, దళితులపై దమనకాండ

బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది.  డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? ఉద్యోగస్తులను కూడా వదిలిపెట్టలేదు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టారు. బీసీలకు బ్యాక్ బోన్ విరిచారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసారు.

రాయలసీమకు వైసీపీ ప్ర‌భుత్వం ఏమి చేయలేదు

రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకుంటున్న జగన్ వాస్తవానికి రాయలసీమ కు ఏమి చేయలేదు. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. అన్నమయ్యా గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. వైసీపీ ప్ర‌భుత్వం 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రిలయన్స్, అమరరాజా, జాకీ  వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. కియా కారు చూస్తే చంద్రబాబు గుర్తొస్తారు. వేసుకునే డ్రాయర్ చూస్తే వైసిపి తన్ని తరిమేసిన జాకీ కంపెనీ  గుర్తొస్తుంది .

సునీతమ్మ హయాంలోనే రాప్తాడు అభివృద్ధి

అభివృద్ధి లో సునీతమ్మ స్పీడ్ అందుకోవడం ఎవరి వల్లా కాదు. ప్రతిపక్షంలో ఉన్నా సునీతమ్మ ప్రజలు, రైతులకు అండగా పోరాటం చేసారు. టిడిపి హయాంలో రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం 5 వేల కోట్లు ఖర్చు చేసాం. 804 కోట్లతో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు కాలువ త్రవడంతో పాటు పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసాం. హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి, నియోజకవర్గంలోని 45 చెరువులకు, 120 చెక్ డ్యామ్ లకు సాగునీరు ఇవ్వడం జరిగింది. రోడ్లు, ప్రభుత్వ భవనాలు, కాలేజీలు అన్నీ టిడిపి హయాంలో కట్టినవే. టిడిపి హయాంలో నియోజకవర్గంలో రోడ్లు వెయ్యడానికి కేటాయించిన 46 కోట్ల విలువైన పనులను కూడా కమిషన్ కక్కుర్తితో ఆపేసింది స్థానిక ఎమ్మెల్యే . నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య తీర్చేందుకు ప్రతి ఇంటికి నీటి కుళాయి ఏర్పాటు చేస్తాం.

లక్ష ఎకరాలకు నీళ్ల హామీ ఏమైంది?

పాదయాత్రలో భాగంగా రాప్తాడు నియోజకవర్గానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే జీడిపల్లి పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తామని అన్నారు. పుట్టకనుమ రిజర్వాయర్ ను క్యాన్సిల్ చేసి దానికి స్థానంలో తోపుదుర్తి, ముట్టాల, దేవరకొండ జలాశయాలకు శంకుస్థాపనకు చేశారు. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని.. రాప్తాడును కోనసీమలా మారుస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికాడు. శంకుస్థాపన చేసి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఒక్క ఎకరా భూ సేకరణ కూడా పూర్తి చేయలేదు. పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి చేయడంతో పాటు సోమరవాండ్లపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందిస్తాం.  నియోజకవర్గంలో రైతులను గాలికొదిలేసింది ఎమ్మెల్యే. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోలేదు. టమాటో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మార్కెటింగ్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయమని అడిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. చీనీ, టమోటా, వేరుశనగ రైతులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటాం. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించిన వారిని వదిలిపెట్టను. వచ్చే ఎన్నికల్లో టిడిపి ని భారీ మెజారిటీ తో గెలిపించండి. నియోజకవర్గం సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను స్వయంగా తీసుకుంటాను.

యువనేతను కలిసిన జాకీ పరిశ్రమ భూనిర్వాసితులు

యువ‌గ‌ళం పాద‌యాత్రలో రాప్తాడు నియోజకవర్గం ఎన్ఎస్ గేటు వద్ద యువనేత నారా లోకేష్ ని కలిసిన జాకీ పరిశ్రమ భూ కలసిని నిర్వాసితులు,  మ‌హిళ‌లు  త‌మ గోడు వెళ్లబోసుకున్నారు. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే రూ.15 కోట్లు క‌ప్పం క‌ట్టక‌పోతే జాకీ ప‌రిశ్రమ‌ని ఏర్పాటు చేయ‌నివ్వన‌ని బెదిరించ‌డంతో ఆ కంపెనీ త‌ర‌లిపోయింది. కమీషన్ల కక్కుర్తి మా ప్రాంతీయులు 6వేల‌మందికి ఉపాధి దూరం చేసింది. ఎమ్మెల్యే జాకీ పరిశ్రమ ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారు. అవినీతి కారణంగానే రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ తెలంగాణాకు వెళ్లిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక  కొత్త పరిశ్రమలు రాక‌, ఉన్నవి త‌ర‌లిపోయి ఉపాధి కోల్పోయాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలు రాప్తాడుకి తీసుకురావాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ….

మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 2017లో జాకీ కంపెనీని రాప్తాడుకు తీసుకొచ్చాం. కంపెనీ కోసం 27ఎకరాల భూమిని కేటాయించి, మౌలిక సదుపాయాలు కల్పించాం. జాకీ సంస్థ పనులు కూడా ప్రారంభించింది. 2019లో రాష్ట్రంలోనూ, రాప్తాడులో వైసీపీ అధికారంలోకి వచ్చారు. కమీషన్ల కోసం జాకీ యాజమాన్యాన్ని వేధించడంతో రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలు తీసుకొచ్చి అంద‌రికీ ఉపాధి కల్పిస్తాం.

యువనేతను కలిసిన రాప్తాడు నియోజకవర్గ బిసి సామాజికవర్గీయులు

రాప్తాడు నియోజకవర్గం సికె పల్లిలో నియోజకవర్గానికి చెందిన బిసిలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. రాప్తాడు నియోజకవర్గంలో వాల్మీకి, బోయలు దుర్భర పేదరికంలో ఉన్నారు. ఎస్టీ జాబితాలో చేర్చండి. కురుబ కులస్తులకు గత ప్రభుత్వం రూ.2లక్షల వరకు లోన్లు ఇచ్చేవారు, ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. వడ్డెర కులస్తులు క్వారీల్లో బ్లాస్టింగులు చేసుకోవడానికి అనుమతులు ఇప్పించండి. ఈడిగ కులస్తులకు పంచాయితీకి 10ఎకరాల భూమిని ఈతవనానికి కేటాయించండి. రజకులు, నాయీబ్రాహ్మణులు, యాదవులు, చేనేత కార్మికులకు బిసి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి ఆదుకోండి. గాండ్ల కులస్తులకు కరెంటు గానుగల ఏర్పాటుకు రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయండి. ఉన్నత విద్య, విదేశీ విద్యకు రుణాల మంజూరులో ప్రాధాన్యత కల్పించండి. జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాలు, 50 ఏళ్లు దాటిని వారికి పెన్షన్ సౌకర్యం కల్పించండి.

*యువనేత నారా లోకేష్ మాట్లడుతూ…*

రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్న బిసిల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పథకాల పేరుతో బిసిలకు చెందాల్సిన వేలకోట్ల నిధులను దారిమళ్లించిన వైసీపీ ప్రభుత్వం. వైసీపీ అధికారంలోకి రాష్ట్రంలో 26వేలమందికి పైగా బిసిలపై తప్పుడు కేసులు నమోదుచేశారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక కార్పొరేషన్లను బలోపేతం చేసి విరివిగా సబ్సిడీ రుణాలు మంజూరుచేస్తాం. ఉన్నత విద్యకు ఫీజు రీఎంబర్స్ మెంట్, విదేశీ విద్య పథకాలను పునరుద్దరిస్తాం. వెనుకబడిన తరగతులకు అండగా నిలిచే చంద్రన్నను సిఎం చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

యువనేతను కలిసిన ఆటో కార్మికులు

రాప్తాడు నియోజకవర్గం ఎన్.ఎస్ గేటు వద్ద ఆటోకార్మికులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పెట్రోల్, డీజిల్ ధర రూ.100 దాటడంతో ఇబ్బందులు పడుతున్నాం. రోజంతా ఆటో నడిపినా రోజుకూలి కూడా దక్కడం లేదు. వాహనమిత్ర పథకం అందరికీ అందడం లేదు. ఆటోలకు లైఫ్ ట్యాక్స్ పెంచడం వల్ల కట్టలేని పరిస్థితి. మహిళల బంగారం కుదువపెట్టి కట్టాల్సివస్తోంది. సొంత ఆటో లేనివాళ్లు రోజుకు రూ.200కట్టి బాడుగకు ఆటో తెచ్చుకుని బ్రతుకుతున్నారు. పోలీసులు వేసే చలాన్లు కట్టలేక ఆటోలు రోడ్డెక్కే పరిస్థితి లేదు. కోవిడ్ సమయంలో ఈఎంఐ లు కట్టని కారణంతో ఫైనాన్స్ వాళ్లు ఆటోలు లాక్కెళ్లిపోయారు, దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆటో కార్మికులకు ఇళ్ల స్థలాలు కూడా లేవు. ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితి నెలకొంది. ధర్మవరంలో మాకు ఎక్కడా పార్కింగ్ స్థలాలు లేవు, పోలీసులు కేటాయించడం లేదు.

నారా లోకేష్ మాట్లాడుతూ….

దోచుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఎవరికీ మినహాయింపు ఇవ్వడం లేదు. వైసీపీ ప్రభుత్వం పోలీసులకు టార్గెట్లు ఇచ్చి చలానాలు వసూలు చేయాలంటూ పోలీసులను వేధిస్తున్నారు. ఆటోవాళ్ల సంక్షేమం కోసం లైఫ్ ట్యాక్స్ రద్దు చేసింది చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం. అడ్డగోలు చలానా విధానానికి టీడీపీకి వచ్చాక స్వస్తి పలుకుతాం. ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం. ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా రూ.10లక్షలు ఇచ్చి ఆదుకుంటాం. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తిరిగే ఆటోలకు సింగిల్ పర్మిట్లు ఇస్తాం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం.

ఎన్టీఆర్ గృహాలను పరిశీలించిన యువనేత లోకేష్

రాప్తాడు నియోజకవర్గం బసినేపల్లి లో ఎన్టీఆర్ గృహాలను నారా లోకేష్ పరిశీలించారు. బసినేపల్లి లో పేదలకు నాటి టిడిపి ప్రభుత్వం 122 ఇళ్లు కేటాయించింది.  ఇంటి స్థలం, ఇళ్ళ నిర్మాణం, రోడ్లు, త్రాగునీరు సదుపాయం, మౌలిక వసతుల కల్పన 90 శాతం టిడిపి హయంలోనే పూర్తయినా మిగిలిన పనులు పూర్తి చేసి ఇళ్ళు కేటాయించకుండా స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందిపెడుతున్నారు. టిడిపి హయాంలో పూర్తయిన ఇళ్లు కేటాయించకుండా ఎమ్మెల్యే వేధిస్తున్నారని లబ్ధిదారులు లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గుడి, బడి కోసం కేటాయించిన 1.25 ఎకరాలను స్థానిక ఎమ్మెల్యే ఆక్రమించుకుని పెట్రోల్ బంక్ పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న బాధితులు తెలిపారు. అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని లబ్దిదారులు తమ బాధను వ్యక్తం చేశారు. లబ్ధిదారులంతా బీసీలు కావడంతో గృహప్రవేశాలను సైతం ఎమ్మెల్యే అడ్డుకున్నాడని చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.

Also, read this blog: The Empowering Trek of Nara Lokesh in Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *